Friday, April 08, 2005

ఉగాది మళ్లీ వచ్చింది...

అందరికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. :-)

టెలుగు థెలుషుకో...

నాకు చిరాకు పుట్టించే కొన్ని తెలుగు ఖూనీలు....

షివ (Siva)
షైలు (Sailu)
షంకర్ (Sankar)
షసి (Sasi)

మనోల్లు "మనిసి" అనే పదాన్ని పల్లె పదంగా చూస్తారు...మరి ఈ తాగుబోతు శబ్దాలను ఏమంటారో...

Tuesday, April 05, 2005

మన చుట్తూ పిచ్చి వెధవలు....

మందుల షాపులు అన్ని బందు.... వాళ్లకు జనఘోష ఎమీ పట్టినట్లు లేదు. వాళ్లు షాపులు మూసేశారు సరి గదా, ఉస్మానియా మెడికల్ షాపుని కూడా మూసివేయించడానికి తయారయ్యారు. దీని బట్టి ఏమిటి అర్ఢం అవుతుంది తమ్ముడూ అంటే? జనాభా బాగు చెయ్యలేనంతగా చెడిపొయారు అని. ఒక మంచి లేదు, మానవత లేదు. వాళ్ల స్వార్ధం వాళ్ళది. మరి ఇప్పుడు చెప్పు, ఇంకా నేను నా దేశం, నా ప్రజలు, నా జన్మభూమి అనుకోవడం లో ఎమైనా అర్ధం పర్ధం వుందా? ఒక ముక్కలో చెప్పాలంటే "ఎవడి గోల వాడిది, ఎవడి స్వార్ధం వాడిది". మనోల్లు వాళ్ల పిచ్చి వెధవ లాంటి సినిమా హీరో కోసం చస్తారేమో గాని, తోటి, సాటి మనిషి గురించి ఆలోచించే ఇంగితం ఈ జన్మలో పొందలేరు...
About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name