మసక బారిన నకిలీ ఐ.ఎస్.ఐ మార్కు హెల్మెట్ అద్దం చికాకు పెడుతోంది
దారి పొడవునా ఇసుక అందరి కళ్సల్లో జల్లుకుంటూ ఒక డొక్కు లారీ ముందుకు పోయింది
అడ్డం పడుతూ పరిగెడుతున్న రోడ్దు బాలలు, దేశ భవిష్యత్తును వెక్కిరిస్తున్నట్టు...
సరిగ్గా రోడ్దు మలుపులో తీరిగ్గా ఆటో ఆపి చుట్ట వెలిగించిన తెలుగు సినిమా నిర్మాతల హీరో
రోడ్దంతా కళ్లాపి జల్లుతూ మన ఘన జల వనరులని వెక్కిరిస్తున్న ఒక తుప్పు టాంకర్
దారి లేదని తెలిసినా మొండిగా, పిచ్చిగా హార్న్ మోగిస్తు ముందున్న వారిని విసిగిస్తున్న మధ్య తరగతి బైకు జీవులు
నాన్న గారి బహుమతి 'పల్సార్' తో జనాలని థ్రిల్ చేస్తున్న కుర్రాల్లు
రోడ్ల పై అనుభవించే రక్త పోటు వ్యవహారాలు...
అడ్దంగా రోడ్లు తవ్వేస్తున్న ప్రయివేటీకరణ, కప్పేదెవెడో మనకర్ధం కాదు
ఎవడో మంత్రి గాడు, ఎన్నికయ్యాక ప్రజలలో తిరగటానికి భయపడి అదే రోడ్దుని బ్లాక్ చేసి పోతున్నాట్ట….
వాళ్ళు నడిస్తే పల్లె బాటలు బ్లాకు...కారులో వెలితే నగర బాట బందు...ప్రజాభిమానం అంతే మరి
ఎవడికి కోపం వచ్చినా చలో నగరం...ఆనందం వచ్చినా చలో నగరం
మరి వీరందరు రైతు జపం నగరం లో ఎందుకు చేస్తారో మన బుర్రకు అందని బ్రహ్మ పదార్ధం
రౌడీ చస్తే రణరంగం చేసి బస్సులు తగల పెట్టేస్తాం, మరి రైతు చస్తే ?
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
అదిరిందయ్యా సుధాకరూ,
కానీ సమస్యకి మీకు తోచిన పూరణం కూడా వ్రాస్తే బాగుండేది
ఇలా విప్లవ పంథాలో సమస్యలు చెప్పుకోనీ, చెప్పుకోనీ బోరు కొడుతుంది।
This is time for solving them
థ్యాంక్స్ కిరణ్ గారు, కాని ఇవన్నీ బాగుపడాలీ అంటే సినిమాలలో జరిగినట్లు జరగవు కదా.. ప్రతి ఒక్కడికి మర్యాద అలవాటు అవ్వాలి.ఎదుటి వాడి మాటకు మర్యాద ఇచ్చే సంస్కృతి మన రాజధాని లో భూతద్దం పెట్టుకుని వెతకాలి.నేను ఇక్కడ రెడ్ సిగ్నల్ పడితే ఆగి వెనకన వున్న బస్సు డ్రైవర్ తో మాటలు పడిన రోజులున్నాయి. నేను చెయ్యగలిగింది ఒక మంచి పౌరుడిగా వుండటమే... ఈ జనాలని బాగు చెయ్యటానికి ఎవ్వడూ ఏమి చెయ్యనక్కర లేదు కూడా... They Deserve It !
నేను పెద్దగా ఏమీ చెప్పుకోలేనండీ, ఎందుకంటే నేను గీతకు ఎటువైపున వున్నానో నాకే తెలీదు :D
మర్యాద విషయానికి వస్తే చాలా కాలం క్రితం కంటే ఇప్పుడు కొద్దిగా నయమండి, ఇలాగే మారుతారు లేండి కొద్దికాలం ఓపికపడదాం।
At the same time
పై పై మెరుగులకీ, నిజంగా మర్యాద ఇవ్వడానికి భేదం ఉంది। నాకు నిజంగా మర్యాద ఇచ్చే ప్రపంచం ఉంటే బావుండు అనిపిస్తుంది
nizamga maryada inche prapancham oka oooha prapanchameeeeeeeee
raajadhani lo vunna jananiki maryada nerpalante maroo hitler avatarinchalsinde nandi kiran gaaru.Ikkadi manushulaki maryada kanna godavalupettukovadam itarula meeda coments veyadam lo phdlu vunnayi.
Post a Comment