Thursday, September 28, 2006

మరో పద్మ వ్యూహమా? - 1

భాగ్యనగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య భూతంలా పెరిగిపోతుంది.ఇది ఎంత తీవ్రంగా ఉంది అంటే;గ్రామ ప్రాంతాలలోని ప్రజలు,మా నగరంలో ట్రాఫిక్ ఇలా ఉంటుంది అంటే నవ్వి పోతారు. అయితే దీనికి ఎవరు బాధ్యులు? అతి వేగంగా అభివృధ్ధి చెందుతున్న ఈ నగరం ఇకనైనా మేలుకోకుంటే త్వరలోనే బెంగుళూరులా చెడ్డపేరు తెచ్చుకోవటం ఖాయం.ఇక మనం ఈ నాణేనికి రెండు వైపులా చూద్దాం.


పోలీసులు మాత్రం ట్రాఫిక్ అనేది మాకు సంబంధించిన విషయం కాదన్నట్లే ఉన్నారు. నగర అదనపు కమీషనరు మాత్రం నెలకోసారి తూతూ అని ఒక రెండు పత్రికా సమావేశాలు నిర్వహించేస్తున్నారు.

నేను గమనించిన విషయాలలో ముఖ్యమైనవి ఇవి. (ఈ రోజు సమస్యలు మాత్రమే రాస్తా...పరిష్కారాలు తరువాతి టపాలో)

  • మన రోడ్లు, వాటి ప్రమాణాలు అతి చెత్తగా ఉన్నాయి.
  • వాటి నిర్మాణం కూడా చాలా అశాస్త్రీయం.
  • పోలీసులు అతి కొద్ది మంది ఉన్నారు. (కావలసిన దానికంటే ఒక పది రెట్లు తక్కువ)
  • అతి చెత్త ఆటో డ్రయివర్లు
  • బాధ్యతలేని ఆర్టీసి బస్సు డ్రయివర్లు
  • అస్సలు లేనే లేని ర్యాపిడ్ రోడ్ ప్యాచింగ్ టీములు
  • సరిగ్గా రోడ్డు వంపులలోనే నిర్మించిన బస్ (ఆటో?) స్టాపులు
  • నామ మాత్రం అక్కడక్కడా నిర్మించిన ఫుట్‍పాత్ లు.
  • రోడ్ మీద మాత్రమే నడిచే తొంభై శాతం జనాభా
  • నత్త నడక నడిచే ఫ్లై ఓవర్ నిర్మాణాలు
  • రోడ్లను మింగేస్తూ అక్రమ నిర్మాణాలు, అడ్డంగా గుడులు, మసీదులు, శ్మశానాలు
  • ప్రభుత్వ ట్రాఫిక్ సమాచార వ్యవస్థ లేదు
  • దారుణస్థితిలో ఉన్న మురుగునీటి వ్యవస్థ.
  • అడ్డదిడ్డమైన పార్కింగులు, అక్రమ పార్కింగులు
  • క్రమ పధ్ధతిలేని రోడ్డు తవ్వకాలు

 పైన పేర్కొన్నవి కాక, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఎన్నో విదేశీ యాత్రలు చేసి కూడా మన అధికారులు పని దగ్గరకొచ్చేసరికి ఆవులింతలు తీస్తున్నారు. పోలీసులలో చాలా మందికి కొన్ని రూల్సే తెలియవు. జాగ్రత్తగా గమనిస్తే వారి ఉద్యోగం పట్ల నిరాసక్తత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

1 comments:

రానారె said...

7.30కి S.R.Nagar లో బయల్దేరి 11.30కి కూడా city limits దాటదు Hyd-Kadapa RTC Hi-Tech bus.
ఆ రోజు నేను గమనించిన కారణం - మన Hyd జనాలకు Traffic sense బొత్తిగా లేకపోవడం .
నాక్కనిపించిన మార్గం- జనాలకు Traffic sense, సహనం నేర్పే సున్నితత్వంతోబాటు Traffic rules అతిక్రమించిన వారినుంచి strict గా fine వసూలు చేయడం ప్రారంభించాలి బెంగుళూరులో లాగా. అప్పుడు మన Hyd రోడ్లు ఎంత విశాలమైనవోకదా అనిపిస్తుంది. బెంగుళూరులో జనాలకు Traffic sense ఉన్నా రోడ్లు ఇరుకు. ఇది నిజంగా సమస్య. మన Hyd ది attitude problem.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name