Friday, September 08, 2006

నేతి బీరకాయలు

మన తెలుగు ఛానల్స్ బాగా పరిశీలించితే నాకు ఈ క్రమంలో తెలుగుతనం కనిపించింది. చిట్టాలో చివర వున్నవి తెలుగు చానల్లు అని ఇంక చెప్పుకోనక్కరలేదు :-)

01. దూరదర్శన్ - సప్తగిరి
02. ఈనాడు టీ.వీ 2
03. ఈనాడు టీ.వీ
04. జెమిని
05. తేజా
06. మా టీ.వీ
07. టీ.వీ 9 (వీళ్ళ కట్టు బొట్టు కూడా తెలుగు కాదు)

వీటిలో కొన్ని ఛానల్లు, తెలుగులో మాట్లాడి నాలుక్కరుచుకుని ఆంగ్లంలో చెప్పిన సందర్భాలు వున్నాయి. మొత్తం ఆంగ్లపదాలనే కార్యక్రమాలకు పేర్లుగా వాడిన ఛానల్లున్నాయి.

మీరూ మీ అభిప్రాయాలు, క్రమం తెలియచేయండి...

2 comments:

Anonymous said...

వీటితో పాటు ఆదిత్యా అని ఎటూ కాని పాటల, పిచ్చి పిచ్చి మాటల చానెల్ ఒకటి వస్తుంది దాన్ని ఏ కోవలోకి చేర్చాలో?

లేఖిని ని తెలుగు పలక అనడం చాలా బాగుంది.
మీ బ్లాగ్ కి వేసిన కొత్త డ్రెస్ కూడా.

అన్నట్టు సాహిత్యం, తెలుగుబ్లాగ్ బటన్లను మీ బ్లాగ్ లో పెట్టొచ్చు కదా!!

spandana said...

"TV9" ఈ చానల్ పేరే ఇంగ్లీషు కదా!

-- ప్రసాద్
http://charasala.wordpress.com

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name