కొత్త ప్రపంచ వింతలు నిర్ణయించేసారు. వెబర్ అనే ఒక పిచ్చోడికి వచ్చిన అద్భుతమయిన హార్వార్డు వ్యాపార స్థాయి ఆలోచన జనాలతో, వారి సెంటిమెంట్లతో ఆడుకుని ఏడు ప్రపంచ వింతలను నిర్ణయించేసింది. అవి ఏడే ఎందుకు వుండాలని చాలా మందికి డౌటొచ్చింది., కానీ మన దేశంలో కానీ, మరెక్కడయినా కానీ మేధావులను డౌటొస్తేనే కదా ఏవడయినా పట్టించుకునేది? అందువలన ఆ డౌట్లు పెద్దగా ప్రభావితం చూపలేదు. యునెస్కో లాంటి సంస్థ కూడా చాలా ఖచ్చితంగా తెగేసి మరీ ఈ ప్రయోగాన్ని విమర్శించినా ఎవడూ పట్టించుకోలేదు.
మీరు కూడా ఈ వోటింగులో పాల్గొనివుంటే, వెంటనే ఒక సర్టిఫికెట్ ప్రింటు తీసుకోండి. ఎందుకంటే ప్రపంచంలోని అతి పెద్ద వింత స్కామ్ లో మీరు పాల్గొన్నారు కాబట్టి.
అతిపెద్ద వింత ఏమిటంటే, ఈ లెక్కల ప్రకారం, పిరమిడ్లు ఒక వింత కాదు. ఇదెలా వుందంటే కొంతమంది పిచ్చోల్లందరు కలసి చంద్రున్ని సూర్యుడిగా నిర్ణయించేసినట్లుంది. అసలు ప్రపంచంలో ఏ శాస్త్రం ప్రకారమైనా, నిర్మాణశైలిలో నయినా పిరమిడ్లకు సాటి రాగల వింత అసలు లేనే లేదు. ఇప్పడి సైంటిష్టులందరూ ఒక ఏభై సంవత్సరాలు కష్టపడినా వాటిని కట్టలేరు. నాకు తాజ్ కు వచ్చిన గుర్తింపువలన రావలసిన ఆనందం కన్నా, పిరమిడ్లకు లభించని గుర్తింపు తలచుకుంటే చాలా బాధగా వుంది. అలానే కంబోడియాలో అతి ప్రాచీనమయిన అంగకార్ వాట్ విష్ణు దేవాలయమూ లేదు. కంబోడియాలో ఇంటర్నెట్టు, మొబైల్ ప్రపంచం అంతగా లేదు మరి. అందువలన ఆ దేశం వింతలు వుండే ఆస్కారమే లేదు.
నేను ఈ పిచ్చి ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీకు ఈ మాయ అర్ధమయితే ఖండించండి.
19 comments:
మా బాగా చెప్పారు.
నేను కూడా ఖండిస్తున్నాను. పిరమిడ్లు వింతకాకపోతే మరేదీ వింతకాదు. తాజ్‌మహల్ ఈ వింతల్లో చేరిందని చంకలు గుద్దుకుంటూ నాకూ కొన్ని ఈ-మెయిళ్లు వచ్చాయి. పెద్దగా పట్టించుకోనక్కరలేని సర్వే ఇది.
నేను కూడా టుకుడా టుకుడా ఖండించినాను అయినా మన వాళ్ళు వినలేదు.
అందరూ యస్యంయస్సులు తెగ వేసినారు.
ఇంతకీ టూరిస్టులు పెరుగుతారా?
మనము కూడా ఇండియాలో ఇరవై ఒక్క వింతలు అని ఓ సైటు పెడదామా? (ఇరవై ఒకటి చాలు కదా, మనకి లభాలు రావడానికి :) )
ఎంత మంది చెప్పినా, ఎన్ని మెయిళ్ళు, ఎస్సెమ్మెస్సులొచ్చినా ఓటువెయ్యకుండా నా తీవ్ర ఆక్షేపణ తెలిపా. అధిక ప్రజాభిప్రాయం అన్నిటినీ నిర్ణయించలేదు.
ఎన్ని మెయిళ్ళు వచ్చినా నాకెందుకు వోట్ వెయ్యాలనిపించలా! తొక్కలోది నాకసలు ఏది ఎందుకు వింతయిందో సరిగా తెలీనే తెలీదు. ఏదొ మన దేశం లోది అనే స్వార్ధం తో వోట్ వెయ్యాలంటే సిల్లీ గా అనిపించి..లైట్ తీస్కున్నా.
yes idi komdaru aardhika paripushti kala vaari abhipraayamamte kaanii idi sakala janaabhipraayam kaadu prapamch vimta asale kaadu. manamu maatramu mana market sakthini maroa saari niruapimchukunnaamu.
ఈ ఓటింగ్ కు. దాని పబ్లిసిటీ కి తగలేసిన కోట్ల కొద్దీ రూపాయలు తాజ్ మహల్ ను సం రక్షించడం కోసం ఖర్చు చేస్తే ఎంత బాగుండేది
నేను కూడా మొత్తుకున్నాను ఓటేశే దానివలన మనకు కానీ తాజ్ మహల్ కు కానీ ఒరిగేదేమీ లేదురా బాబు అని. ఐన జనాలు వింటేనా....గొర్రె దాటుడు అంటే ఇదేనా అని ఒక్క నిముషం అనిపించింది. ఓటేసిన శ్రద్ద....తాజ్ చిట్టూ ఉన్న వందల ఇనుప కొలిముల్ని మూయిచడంలో ఉంటే....తెల్లగా ఉన్న తాజ్ పసుపుగా మారకుండా ఉంటుంది యమునా నది మురికి కాల్వలా కాకుండా జీవ నదిలా పారుతుంది...
లైఫు టైము అచీవుమెంటు లాగా పిరమిడ్లకు కూడా చారిత్రక అద్భుతం అని అన్నారు కదా....అది చాలు. పిరమిడ్లకు ఓటెయ్యలేదంటే...జనాలకు దాని గురించి అవగాహన లేదు అని అర్థం....లేదంటే ఏ కొంచెం తెలిసినోడైనా ఉన్నోడైనా మొదట పిరమిడ్లకే వేస్తాడు ఓటు. సూయెజ్ కెనాల్, శ్రీలంక కోట నామినేషన్లలో లేకపోవడం భలే ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవి లిబర్టీ విగ్రహం కన్నా ఎన్నో రెట్లు అద్భుతమైనవి ఇవి.
అవును. ఇది పూర్తిగా తలతిక్క విధానం. ఓటు వేసేవారు ఇది మనదేశంలోనిది అనే స్వాభిమానంతో వోటు వేశారే తప్ప అది వింతనా కాదా అని పట్టించుకోలేదు. అసలు అది వింతనా అయితే ఎలా వింత అని సామాన్య జనానికి తెలిసే అవకాశమూ లేదు. దేనికెక్కువ ఓట్లు వస్తే అది వింత అనడం అసంబద్దం.
--ప్రసాద్
http://blog.charasala.com
పిరమిడ్లని పోటీలో ఉంచడం పట్ల ఈజిప్టు ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో పోటీ నిర్వాహకులు పిరమిడ్లకి "గౌరవ సభ్యత్వం" ఇచ్చేసి, పోటీనించి విరమింప జేశారని ఈ పోటీ వాళ్ళ అఫీషియల్ సైటులోచదివాను. అంటే వీళ్ళు "ఏడు" వింతల్ని ఎన్నుకుంటే మరి పిరమిడ్లు ఎనిమిదో వింతా? :-))
అంతా ఒక వేలం వెర్రి - వచ్చేనెల ఈ టైముకి ఎవడికీ ఈ విషయం గుర్తుకూడా ఉండదు.
రాజ్య సభ సభ్యత్వంలాగా ఈ గౌరవ సభ్యత్వం ఏమిటి? చాలా చెత్తగా వుంది. భారత ప్రభుత్వం అభ్యంతరం చెప్పివుంటే తాజ్ కు ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చివుండే వారేమో? మనమే కదా SMS పిచ్చిలో వరల్డ్ నెంబర్ వన్ను. మనల్నెలా వదులుకుంటారు?
Telugu anta bagundi kani Font Size koncham peddadi ga vunte bavvunu ...
CRORES OF INDIANS BECAME FOOLS BY PARTICIPATING IN THIS TAJ VOTING, WHY SHOULD THEY PARTICIPATE IN A PRIVATE SURVEY, JUST WASTING THEIR TIME- BHARATH
nijame nenu kuda aa vishnu temple photos net lo chusaanu adi desham garvinchadagga kattadam. even thoug that is not in our country.
my blog is indianshiva.blogspot.com
ధీన్ని కండిచదాన్ని పక్కన పెడితె,అసలు ఈ ఐడియ వచ్చిన వాడికి నా జొహ్రాల్లు.
కాధెధి వ్యపరానికి ఆటంకం అని,ఒక చిన్న ఐడియ తొ ఎంత దబ్బు (SMS ల ద్వరా)
సంపాధించాడు.ఏ industry పెట్టకుండ,ఏ గొప్ప book రాయకుందా,ఏ గొప్ప సినిమ తియ్యకుండా ,
కెవలం ఒక ఐడియ మరియు కొంత పెట్టుబడి(for advertising) తొ ఇంత ఘనకార్యం సాధించినంధుకు,I really appricate him.
Chaala baaga chepparandi. Sri sri gaaru annatlu, gorrera laga andaru okadi venaka okadu follow avutaru. Okkadu kooda alochincharu.
kaaddhedhi kavvithakanarham annaru sri sri. alage gattiga alochisthe kadedhi prapancha vinathaki anarham.. evari alochanalu vallvi.. evari ishtalu varivi, miku pyramid la midha unna avagahana prapancham lo enni vishayala midha undhi? alage migilina janula avagahana kuda. antha mathram chetha antha mandhi janulu select chesukunna vinthalai kadhanadaniki miku emi hakku undhi??
iam also agree with u
this is prasad from hyderabad .
can u tell me how to create blogs in telugu
Post a Comment