ఈ టపా లేఖిని అభిమానుల కోసం. ఇప్పుడు లేఖినిని విండోస్ లైవ్ రైటర్లోనే వాడుకునే విధంగా చిన్న ఆడ్-ఆన్ ని తయారు చేశాను. ఒక గంటలోనే ఇది రాయటం అయిపోయినా, హంగులు, బగ్గు ఫిక్సులు అన్నీ అయ్యే సరికి కొంత సేపు పట్టింది. మంచి బగ్గులు పట్టుకున్న కిరణ్ చావా కు, జ్యోతి గారికి ధన్యవాదాలు. పూర్తి సహాయ సహకారాలందించిన లేఖినిపిత వీవెన్కు నెనర్లు.
ఇక విషయానికొస్తే, దీనిని వ్యవస్థాపితం చేసుకోదలచిన వారు పాటించాల్సిన సోపానాలు..
౦౧. విండోస్ లైవ్ రైటర్ ని మొదట వ్యవస్థాపితం చేసుకోవాలి. (ఇదిగో లంకె)
౦౨. క్రింద ఇవ్వబడిన DLL file ను దిగుమతి చేసుకోండి.
౦౩. ఆ ఫైల్ ను తాపీగా "C:\Program Files\Windows Live\Writer\Plugins" అనే ఫోల్డర్ లోనికి కాపీ చెయ్యండి. (మీరు లైవ్ రైటర్ ను "D" డ్రైవ్ లో install చేసివుంటే "D:\Program Files\Windows Live\Writer\Plugins" అనే ఫోల్డర్)
అంతే....ఇక విండోస్ లైవ్ రైటర్ మొదలు పెట్టండి.
మీరు మొదటగా (అన్నీ సుబ్బరంగా పని చేస్తే...) దిగువన చూపినట్లుగా ఒక ఐకన్ ను గమనిస్తారు. దానిని క్లిక్ చెయ్యండి. ఇక లేఖిని మీ ముందు ప్రత్యక్షం.
లేఖిని ఈ రకంగా మీకు కనిపిస్తుంది.

లేఖిని ఈ రకంగా మీకు కనిపిస్తుంది.
ఇక మిగిలిన విషయాలు నేను చెప్పనక్కరలేదు కదా :-). ఎప్పుడైనా మీరు ఇక రాయటం అయిపోయిందనిపిస్తే "ఫినిష్" నొక్కండి. లేదా "Append & Continue" నొక్కండి.
ఏవైనా బగ్గులు కనిపిస్తే తెలుగు బ్లాగుల సమూహంలో ఫిర్యాదు చెయ్యండి.
12 comments:
సుధాకర్ గారూ,
ఎన్నాళ్ళకెన్నాళ్ళకి బ్లాగ్దర్శనం. అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఉపకరణంతో బ్లాగ్లోకంలోకి మళ్ళీ వచ్చారు. సంతోషం. మీకోసం(అదేనండీ మీ పోస్టుల కోసం) కళ్ళుకాయలు కాసేలా ఎదురు చూశామంటే నమ్మండి.
యికపైనైనా మీరు తరచుగా పోస్టుతారని ఆశిస్తూ.
మంచి ప్రయత్నం. అభినందనలు....
welcome back! :)
సుధాకర్ గారు మీ రాక చాలా సంతోషంగా ఉంది. :)
chaala manchi prayatnam andi ,danyavadamulu............
శోధన మామకు సుస్వాగతం!-సుహాస్:-)
మంచి ప్రయత్నం. అభినందనలు....
Thanks for this blog.
Please continue writng per atleast 2weeks.
and see my blog,at http://rkm-writes.blogspot.com
very nice blog in our language telugu...Thank u sudhakar ...
నేను విందోస్ యక్స్.పి-2 వాడుతున్నాను. మీరు చెప్పినట్లుగా ప్రోగ్రాం ఫైల్స్‌లో విండోస్‌లైవ్ లేదు.క్లారిఫై చేయగలరు.
very useful information...
ఈ బ్లాగు వల్ల నాకు చాలా విషయాలు తెలిసినాయి
teluguvaramandi.net
Post a Comment