Sunday, February 03, 2008

కంప్యూటర్లో తెలుగు రాయటం కష్టమా?

ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. ఈనాడులో వ్యాసం చదివిన వారికెవరికైనా ఈ ఆలోచన వస్తే ఈ టపా ఉపయుక్తంగా వుంటుందని రాస్తున్నా...

నిజానికి మూడేళ్ళ క్రిందట నాకూ ఈ భయం వుండేది. తెలుగులో టైపింగ్ నేర్చుకోవాలేమో అనుకునే వాడిని. కానీ ఒక సారి మొదలెట్టాక తెలిసింది. చాలా వీజీ అని :-)

మామూలుగా విండోస్ ఎక్స్ పి లో అయితే తెలుగు చదవటానికి ఏ ప్రత్యేక పరిష్కారం అవసరం లేదు. ఈ తెలుగు యూనికోడ్ అనే ప్రత్యేక యూనివర్సల్ ఫాంట్ తో రాయబడినవి. అంటే ఈ తెలుగును చదవటానికి మీకు ప్రత్యేకంగా ఫాంట్లు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్న మాట.

అయితే తెలుగులో సులభంగా రాయాలంటే చిన్న చిన్న సాఫ్ట్ వేర్లు ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు.

Windows XP లో తెలుగు పని చెయ్యాలంటే ఏమి చెయ్యాలో ప్రవీణ్ తయారు చేసిన ఈ వీడియోను చూడండి.

అంతర్జాలం (ఇంటర్నెట్) లో తెలుగు రాయటం రెండు రకాలు...

01. తెలుగుని ఇంగ్లీష్ లో రాయటం (చాలా మందికి ఇది అలవాటు). SMS, Chat లలో విరివిగా వాడుతుంటారు.
      eppudu vastunnaav ayithe? అని రాస్తుంటాం కదా? ఇదే రకపు రాతను రాస్తే తెలుగులోనికి మార్చే సాఫ్ట్ వేర్లు వున్నాయ్. కాకపోతే దీర్ఘాలకు, వత్తులకు మీరు Capitals వంటివి వాడితే సరిపోతుంది.

ఈ క్రింద చెప్పినవి చూడండి. తెలుగు రాయటం ఎంత సులభమో అర్ధం అవుతుంది.

పైన చెప్పిన ఉపకరణాలు, మీరు ఎలా రాసినా సాధ్యమైనంత వరకూ అర్ధం చేసుకుని మీకు తెలుగును అందిస్తాయి. మీరు ఆ తెలుగును ఈ-మెయిల్, డాక్యుమెంట్లు వంటి వాటిలో కాపీ, పేస్ట్ చేసుకోవచ్చు.

ఇది కాక, మీకు తెలుగును, ఇంగ్లీష్లో రాయటం బాగా వచ్చి, ధీర్ఘాలు, వత్తులు వంటివి కూడా మీరే రాసే అలవాటుంటే మీరు RTS అనే శైలి వాడుతున్నట్లు లెక్క. ఎలా RTS వచ్చినవారు చాలా వేగంగా రాస్తారు. నేను ప్రస్తుతం దానిలోనే రాస్తున్నాను. ఈ శైలి వచ్చిన వారు క్రింద చెప్పిన ఉపకరణాలు వాడవచ్చు.

02. తెలుగును తెలుగు మాధ్యమంలో రాయటం

దీనిలో రాయాలంటే మన కీబోర్డ్ లో తెలుగు అక్షరాలు వూహించుకోవాలి. అంటే తెలుగులోనే టైపింగ్ అన్న మాట. దీనిని ఇన్ స్క్రిప్ట్ అంటారు. మొదట్లో కష్టంగా వుంటుందేమో కానీ, ఇది వచ్చిన వారు మాత్రం సూపర్ వేగంగా తెలుగు రాసి పడేస్తారు :-)

 

అదండీ తెలుగులో రాత. మొదలు పెడితే మీకే తెలుస్తుంది. ఇది ఎంత సులభమో. ఏ ఫాంట్లు అక్కరలేదు. తెలుగు టైపింగ్ రానక్కరలేదు. ఇంకా మిగతా విషయాల కోసం మా ఈ-తెలుగు సహాయ కేంద్రాన్ని సందర్శించండి.

ఈ తెలుగు సహాయ కేంద్రం

ఇవి కాక మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మీకు సహాయం చెయ్యటానికి మీలానే తెలుగు రాయటం మొదలుపెట్టి, చక్కగా బ్లాగులు రాస్తున్న తెలుగు బ్లాగర్ల సమూహం వుండనే వుంది. తెలుగు బ్లాగర్ల సమూహంలో చేరండి.

10 comments:

Unknown said...

హల్లో!

అందరికీ శుభొదయం. నేను ఈ రోజే మన తెలుగు బ్లాగ్ ల సమహారం చూసేను. దాని ప్రెరణే ఈ చిరు ఉత్తరం.

ఇక మీదట రెగ్యులర్ గా కలుస్తుందాం.

మీ

గరమోశర్మ

Sudhakar said...

ధన్యవాదాలు. సుస్వాగతం :-)

rākeśvara said...

౨ లో
తెలుగు కీబోర్డులు లభిస్తాయని, లేక పోతే స్టిక్కర్లు కొనుక్కోవచ్చనీ, లేకపోతే overlays కూడా దొరుకుతాయనీ తెలిపితే బాగుండేది.

Anjali said...

namastE sudhaakar gaaru,

nEnu tElugulO blaagu raayaalani chaalaa rojulanunDi anukunTunnaanu. ee rOjE eenaadulO lEkhini gurinchi choosaanu. kaanee daanni naa hOm pEjlO elaa vaaDukOvaalO artham kaavadam lEdu. meeru sahaayam chEyagalarani aasistunnaanu. mundastu dhanyavaadamulu.

iTlu
Ramakanth.D.Reddy

Anjali said...

Hi Sudhakar,

Could you help me in linking my blog page with lEkhini. I tried, but in vain. Thanks in advance.


Regards,
Ramakanth

Anonymous said...

మీకు తెలుసో, తెలీదో కాని మన లేఖిని పద్మ లాగే గూగుల్ లో కూడా తెలుగులో టైపు చేసే సదుపాయముంది. నేను ప్రస్తుతం అదే వాడుతున్నాను. ఇక పోలిక విషయానికి వస్తే గూగుల్ లోనే కాస్తంత సులభంగా వుంది. ఉదాహరణకు నా బ్లాగ్ లో నా మొదటి సందేశాన్ని, దీన్నీ పోల్చి చూడండి.

మీరూ ప్రయత్నించి చూడండి. గూగుల్ లింక్ ' http://www.google.com.transliterate/indic/telugu '. మీలో ఎవరైనా గూగుల్ వాడి చూసాక, మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందేమో. ఇకపోతే మొన్నటి ఈనాడు వ్యాసం చదివాక నాక్కూడా ఉత్సాహం వచ్చేసి ఒక బ్లాగ్ తెరిచాను. దాని లింక్ ' http://telugupadam.spaces.live.com '. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం.

Anonymous said...

ముంబాయి లో నివసిస్తున్న తెలుగు వారి కోసమని ప్రారంభించిన బ్లాగ్ 'http://in.groups.yahoo.com/groups/mumbaitelugupraja'. ఒకసారి ఈ బ్లాగ్ ని సందర్శించి మమ్మల్ని ప్రోత్సహించండి.

Anonymous said...

తెలుగు లో టైపు చేసి వెబ్ లో వెతకండి

krishna rao jallipalli said...

google.com.transliterate/indic/telugu లో టైపు చేసి కాపీ చేసి యాహూ మేస్సేంజేర్ లో అతికిస్తే అవతల వారికీ గదులు కనబడుతున్నాయి. పరిష్కారం చెప్పగలరా

KUMAR AKUMALLA said...

హై ఫ్రెండ్ మీ వెబ్‌సైట్ నాకు ఎంతో సహాయపదింధీ ..మీ వెబ్‌సైట్ చాలా బాగావుంధీ ...ఇంత వరకు తెలుగు లో రాయటం ఇంత సులబం అనుకోలేదు ..థాంక్స్ యూ వెరీ మట్చ్ మై ఫ్రెండ్

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name