Friday, February 01, 2008

ఆంధ్రానా? తెలంగాణా?

తెరాసా రాగం మళ్లీ మారుస్తోందా? ఇన్నాళ్ళు ఆంధ్రులంటే చెప్పిన అర్ధాలను తిరగరాయబోతుందా? ఇప్పటి వరకూ చెప్పిన కొన్ని అర్ధాలు..గంజి మెతుకులు తింటూ వచ్చి, బిర్యానీలు తినేవారి కడుపు కొట్టేవారు....ఇక్కడి భూములను కొల్లగొట్టి బంగళాలు కట్టినవారు....ఆనపకాయను సొరకాయనే వాళ్ళు..ఇలా చాలా చాలా వున్నాయి. ఉద్యోగులు చాలా మందిని పంపించేసారు....కొంతమందిని బతిమాలే నెపంతో బెదిరించారు కూడా..

ఇప్పుడు చిరంజీవి హఠాత్తుగా వీరికి తెలంగాణా మనిషి ఎలా, ఏ రూలు ప్రకారం అయ్యాడు చెప్మా? బంగళాలు అన్నీ అతనికి ఇక్కడే వున్నాయే? అదీ తెలంగానా ఆత్మ గౌరవ సభలో చెప్పటం కొసమెరుపు.

ఇదంతా బాగానే వుంది....ఇంతకీ ఆంధ్రులెవరు? పొట్టకూటి కోసం చిన్న చిన్న వుద్యోగాలు చేసుకునే వాళ్ళు, ’విశ్వ’ విద్యాలయాల్లో చదూకోడానికొచ్చిన పిల్లలూనా?

5 comments:

Kalidasu said...

ఆంధ్రావాల్లు అంటే ఆంధ్రా పాలకులు. వీరిని ఆంధ్రా వరకు తరిమికొట్టాలి. విద్యార్థులు, పొట్టకూటికి వచ్చిన వాల్లను కాదు.

స్వేచ్ఛా విహంగం said...

తెలుగు తల్లి గురించి కుడా వ్యంగంగా మాట్లాడుతున్నారు.
ఇవన్నీ అందరూ హర్షిస్తారనుకుంటే పొరపాటే.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

"ఆంధ్రావాల్లు అంటే ఆంధ్రా పాలకులు. వీరిని ఆంధ్రా వరకు తరిమికొట్టాలి."

భేష్ ! నిజమే. తెలంగాణావాళ్ళెవరూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో లేరు. అందరూ ఆంధ్రావాళ్ళే ఉన్నారు. తెలంగాణా నుంచి పార్లమెంటుకు ఎంపీలెవరూ లేరు. అందరూ ఆంధ్రావాళ్ళే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో తెలంగాణా మంత్రులెవరూ లేరు. అసలు తెలంగాణా వాళ్ళెప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచెయ్యలేదు.

మంచిదే, అలాగే తరిమి కొట్టండి చేతనయితే !

Anonymous said...

ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మూడు రాష్ట్రాలు తొందర్లోనే రావాలని చాలా మంది తెళంగాణా వాళ్ళలాగానే చాలా మంది ఆంధ్రావాళ్ళు కోరుకుంటున్నారు.

Anonymous said...

evaraina swathanthra desham swaparipalana kavalanukuntaru ee rendinti korake ee bhumi pi yuddalu jaruguthunnai

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name