Monday, January 28, 2008

అన్నయ్యనంటారా హన్నా...

ఈ టపా చదివే తమ్ముళ్ళందరికీ (అలా చెప్పుకుంటున్న వారికి) ఒక విన్నపం. మన భారతదేశం ఒక పచ్చని ప్రజాస్వామిక దేశం (రాజకీయ నాయకులు అనే చీడ పురుగులను పక్కన పెడితే). ఇక్కడ ప్రభుత్వం అందరికీ పుట్టిన వెంటనే ప్రాధమిక హక్కులు ప్రసాదిస్తుంది. ఇది మనకు ఐదవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠాలలోనే చెప్పడం జరిగింది. వ్యక్తిగతపరంగా అందరికీ కుల, మత సంబంధం లేకుండా దక్కే హక్కు వాక్స్వాతంత్రం. ఇది మనకు రాజుల, బ్రిటీష్ వారి కాలంలో వుండేది కాదు. ఎవరైనా ఏమైనా నచ్చనిది మాట్లాడినా, పత్రికలలో రాసిన అది రాజద్రోహమే. వారి మీద నిష్కారణంగా దాడి చేసి జైల్లో పెట్టేది ప్రభుత్వం. దీనికి పెద్ద పెద్ద నాయకులే బలి అయ్యారు. జనరల్ డయ్యర్ కూడా చరిత్రలో ఇలాంటి అణిచివేత వలనే చరిత్రలో నిలిచిపోయాడు.

ఇక విషయానికొస్తే...

అభిమానం హద్దులు దాటడమనే ప్రమాదకర స్థితిని ఈ రోజు రాజశేఖర్...కాదు కాదు, చిరంజీవికి రుచి చూపించారు మన తమ్ముళ్ళు. రాజకీయకంపును రుచి చూపించారు. గత ఇరవై సంవత్సరాలుగా మెట్లు ఎక్కడమేగానీ దిగటం తెలియని అతను ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పుకోవటం చాలా బాధాకరం. ఈ దాడి చేసిన వారి వికృత మనస్తత్వం చిరంజీవికి భవిశ్యత్తులో చాలా ప్రమాదకరం. ఇలా జరుగుతూ పోతే చిరంజీవి జీవితమంతా క్షమాపణలు చెప్పుకోవడంతోనే సరిపోతుంది.

రాజశేఖర్ అన్నది పెద్ద విషయం కూడా కాదు. వున్న మాటే కదా? దానిని పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా? అవును చిరంజీవి కి రాజకీయ అనుభవం లేదు, రాజకీయాల్లోనికి రాకుండా అది ఎలా వస్తుంది? ఇది పచ్చి నిజం. చిరంజీవి అది స్వయంగా ఒప్పుకున్నారు. ఒక వేళ నిజంగా ఈ దాడి చేసిన వెధవలు ఫ్యాన్సే అయితే, చిరంజీవి మాత్రం బహుశా అలాంటి ఫ్యాన్స్ ఉండటాన్ని పక్కలో ముల్లుగానే భావిస్తారు.

ఇక ఇలాంటి విషయాలు చిరంజీవిని పార్టీ స్థాపించాలనే వుద్దేశాన్ని దెబ్బ తీస్తాయా? ఏమో?

ఇలాంటి అభిమానులుంటే చస్తే ఎవడూ చిరును విమర్శించడానికి సాహసించడు. కాకపోతే ప్రజాస్వామ్యం మరొక్క సారి మానభంగానికి గురవుతుంది అంతే...

తమ్ముళ్ళూ మన రాష్ట్రాన్ని మరో తమిళనాడు చెయ్యకండి. ఒక్క సారి ఆలోచించండి. మీ తల్లి తండ్రుల మీద మీరిలాంటి అభిమానాన్ని ఎప్పుడైనా ప్రదర్శించారా? వారిని ఎవరైనా లంచం ఆడిగితే ఎప్పుడైనా అడిగిన వాడి మీద దాడి చేసారా? కనీసం పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? మనం చాలా అభిమానించాల్సిన వారు చాలా మంది మన ఇంట్లోనే వుంటారు. ముందర వారిని సరిగా చూసుకుందాం. తరువాత బయటి వారి గురించి బాధపడొచ్చు. మన వీర వెర్రాభిమానం మనం అభిమానించే నటులకు బాధ కలిగించకుండా వుంటే చాలు.

ఏమంటారు?

11 comments:

Rajendra Devarapalli said...

నిజం సుధాకర్ గారు మీరు చెప్పింది.నెను ఇంతకు ముందు చాలా సార్లు రాసాను.వ్యక్తుల చుట్టూ వ్యవస్తను తిప్పే యత్నాలు సాగవని.1947-2008 కి మధ్య చాలా వ్యత్యాసాలు వచ్చాయి అది ఈ నాయకులు కానున్న నాయకులూ గుర్తించటం లేదు .

Anonymous said...

బాబూ రాజేంద్రా నువ్వొక పెద్ద పుడ్డింగ్ లా ఇవన్నీ నేనెప్పుడో చెప్పేశాను అని చెప్పకు

వ్యక్తులచుట్టూ వ్యవస్థ తిరగడం అనేది ఎప్పుడూ జరుగుతుంది.వ్యక్తి లేకుండా వ్యవస్థ లేదు. ఒక్క AP లోనో ఇండియాలోనో ఉన్నది కాదు అది. అదేమీ జాడ్యం కాదు. అదొక రాజకీయపరమయిన దశ. 1947 నుండి ఇండియాలో మాత్రమే ఉంది అని అర్ధం వచ్చేలా, 1947 ని కొలబద్దగా తీస్కుని వాగేయకు. 1947 కి ముందు వందల సంవత్సరాలపాటు, ఈ రోజుకీ ప్రపంచదేశాల్లో అమల్లులో ఉన్న పధ్ధతే అది. నిన్నటి బేనజీర్, మొన్నటి సద్దాం, నేటి బుష్, ఇలా చెప్పుకుంటూ పోతే వందల పేర్లొస్తాయి.

THe political system across the world is moving from a hereditary leadership to charismatic leadership to scientific-rational leadership. ఆ మూడో వ్యవస్థ ప్రపంచంలో ఇంకా ఎక్కడా పూర్తిగా రాలేదు.

ఏదయినా మిడి మిడి జ్ఞానంతో పోస్ట్ చేయకు.

Anonymous said...

అనామకా,

అది కాస్త మర్యాదగా చెప్పచ్చు కదా? ఇక పోతే వ్యవస్థ ప్రజల చుట్టూ తిరగాలి. ఒక వ్యక్తి కేవలం వ్యక్తిగా మిగలకుండా ఒక వ్యవస్థగా (ఆమ్టే లాంటి వారు) మారితే వారి చుట్టూ తిరగటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. సహనం వహించండి తమ్ముల్లూ (అని చిరు ఆడుగుతున్నారు)

Anonymous said...

పార్టీ పెట్టక ముందే చిరు ఫాన్స్ రౌఢీల్లా ప్రవర్తిస్తున్నారు. ముందు ముందు ఏమి చేస్తారో.

Anonymous said...

RaviKumar garu,

I have been observing in almost every blog. This guy just comments as if he is a all-know and talks nonsense irrelevant to the topic. Just uses some jargon and parades as a self-styled intelligentia. Just couldn't tolerate his hallf-baked knowledge and a shameless display of the same. Sorry if I sounded rude.

Rajendra Devarapalli said...

@ బాబూ అనాధా,నీకు తల్లితండ్రి,మొదలైన వారు లేరంటే,నీకంటూ ఒక చిరునామా,ఒక బ్లాగు లేదు అంటే,అర్ధం చేసుకోగలను,కానీ కనీసం పేరు కూడాలేదా?ఉంది కాని దాస్తున్నావు,నువ్వు నిజం అనుకుంది చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నావ్? ఇంతకు ముందు చెప్పానూ అంటే నాబ్లాగులో,ఇతరత్రా పత్రికల్లో,కామెంట్ల ద్వారా. “ పెద్ద పుడ్డింగ్ లా " "వాగేయకు. “ “మిడి మిడి జ్ఞానంతో పోస్ట్ చేయకు " ఇదీ నీ సంస్కారం..ఇంత చెత్త నోట్లో,చేతిలో,మెదడులో పెట్టుకున్న నువ్వు scientific-rational గుర్తించి మాట్లాడటం అసహ్యంగా లేదూ?

Rajendra said...

sudhaakar,

meeru cheppindi chaalaa karekT anDi. annayya abhimaanulu anna manaserigi pravartinchanDi.

చదువరి said...

ఇన్నాళ్ళూ ఈ అభిమానులే చిరంజీవికి పెద్ద ఆస్తేమో గానీ, ఇక మీద ఇలాంటి అభిమానులు పెద్ద అడ్డంకవుతారు. చిరంజీవి వీళ్ళను ఎలా నిభాయించుకెళ్తాడో గానీ, అతనికదో సవాలే!

ఒక తటస్థుణ్ణ్ఝి తీసుకోండి.. ఏంటీ అభిమానుల గోల అని చిరాకు కలుగుతుంది, సహజంగానే. వీళ్ళ అతి పట్ల అసహనమూ కలుగుతుంది. చిరంజీవి వీళ్ళను ఇలా సమర్థించుకుంటూపోతే తటస్థులు వ్యతిరేకులయ్యే అవకాశం లేకపోలేదు.

Anonymous said...

Rajendrakumar,

Mr observer did not use correct language. I don't like his way. But if you don't think otherwise, you always finger with others. You may tell that it is your opinion. But it is like you are the only one with great knowledge and other bloggers and readers have no knowledge. I think you should reduce this.sorry for saying this.
Aditya

Rajendra Devarapalli said...

aditya,
let me remind you one thing,this is not my blog.it is meangingless to discuss about my merits and demerits here.you are most welcome to do the same at my blogs and it would be morw appropriate if you mentions what were the 'fingerings'. i never consider the comments from the anonymous who are almost equivalent to dead and non-existitent,frustrated,failed souls.by the way i never heard about uou,and ravikmuar,the other rajendra nor about your blogs,and other writings.enlighten me about the same.

Anonymous said...

అందరూ రెచ్చి పోయిన తమ్ముళ్ల గురించి వ్రాస్తున్నారు గాని, అసలు ఈ కథ అంతా ఎవరో వెనకనుండి నడిపించారు అని అనిపించడం లెదా? వేరే వాళ్లు వచ్చి లొంగి పోవడం ఏమిటి? చిరు ను రెచ్చ గొడుతున్నారు అని, సడెన్ గా, జోగయ్య లెగవడం ఏమిటి? కేసు లు లేకుండా చేయమని చిరు తరుపున అడగడమా అని నా అనుమానము. ఏది ఏమయినా, జరిగింది మాత్రం తటస్తుల ద్రుష్టిలో, చిరు ఇమేజి, దెబ్బ తిన్నది అని చెప్పవచు. ముఖ్యం గా, కర్ర విరగకుండా, పాము చావకుండా, మాట్లాడిన మాటలు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name