చాలా రోజులకు ఒక రెండు సినిమాలు ఇంట్లో చూసే భాగ్యం దక్కింది. అది కూడా లాప్ టాప్లో మాత్రమే. ఒక సిడాడే డి డ్యూస్ (సిటీ ఆఫ్ గాడ్స్) అనే బ్రెజిలియన్ సినిమా. గ్యాంగ్‍స్టర్ సినిమాలలో ఒక రేంజి వున్న సినిమా ఇది.
రియోడి జెనీరోలో శరణార్ధుల శిబిరాల్లో పుట్టే బాల గ్యాంగ్‍స్టర్ ముఠాలపై తీసిన సినిమా ఇది. చాలా మంది నటులు నిజజీవితపు పాత్రలనే ఇందులో పోషించారు. అద్భుతమైన టెక్నిక్ ఈ సినిమా సొంతం. కధను వెనక నుంచి మొదలు పెట్టి
అంతం తాలుకా ఆరంభం అనే స్టయిల్లో చెప్పిన కధ ఇది. వీలయితే మీరు చూడండి. పద్దెనిమిది ఏళ్లు దాటని వారు చూడకూడని హింస వుంది ఈ సినిమాలో, కాబట్టి పిల్లల్తో జాగ్రత్త.
E! మ్యాగజైన్ దీనిని Movies to watch before you Die అనే పట్టికలో మూడో స్థానంలో చేర్చిందంటే ఈ సినిమా స్థాయి అర్ధం అవుతుంది. అంతే కాక Times దీనిని All Time Top 100 సినిమాలలో చేర్చింది.
ఇక రెండో సినిమా "ఐ యామ్ లిజెండ్". ఇది సినిమా హాలు లోనే చూడల్సిన సినిమా. విల్ స్మిత్ అభిమానిగా ఈ సినిమా చూసాను. స్పెషెల్ ఎఫెక్ట్స్ పరంగా బాగానే వుంది కానీ, తప్పక చూడాల్సిన సినిమా అయితే కాదు.
ఇక టీవి సినిమాలు చెప్పుకోవాలంటే జీ స్టూడియో, హెచ్.బీ.ఓ, స్టార్ మూవీస్, పిక్స్ ఎప్పటిలానే పాత చింతకాయ పచ్చళ్లతో చెడుగుడాడుకున్నాయ్. చెత్త సినిమాలను అసలు పదే పదే ఎందుకు వేస్తార్రా బాబు :-(
0 comments:
Post a Comment