Wednesday, January 09, 2008

వెబ్ లో ఆడియో ఇప్పుడు ఎంత సులభమో....యాహూ....!

యాహూ గాడిని ముద్దెట్టు కోవాలి. ఆడియోను వెబ్ సైట్లలో పెట్టుకోవటాన్ని ఇంత సులభం చేసినందుకు. చెయ్యాల్సిందంతా ఆడియో ఫైల్ ఒక చోట పెట్టి దాని లింకు ఇవ్వటమే. మిగతాదంతా యాహూ మీడియా ప్లేయరే చేసిపెడుతుంది.

ఆడియోను ఎక్కడికి అప్లోడు చెయ్యాలి?

01. Windows Live SkyDrive సైట్ కి వెళ్ళండి. సైన్ ఇన్ అవ్వండి. (ఏ ఫైల్ స్టోరేజీ సైటైనా వాడవచ్చు)

02. మీకు నచ్చిన mp3 పాటను పబ్లిక్ ఫోల్డర్లోకి ఎక్కించండి

03. పాట పుటకు వెళ్ళి క్రింద చూపిన బొమ్మ మీద Right Click చేసి Copy Shortcut చెయ్యండి.

04. ఇప్పుడు మీ దగ్గర మీ పాట లంకె వున్నది. లంకె నుంచి "?Download" తీసెయ్యండి.

05. మీకు నచ్చిన చోట ఈ HTML కోడ్ ను పెట్టండి (example.mp3 బదులుగా మీ పాట లంకె)

<a href="example1.mp3">My first song</a>

06. తరువాత మీ బ్లాగు/సైటు HTML కోడులో క్రింద ఇవ్వబడిన కోడు చివరిగా పెట్టండి. (</body> ముందర)

<script type="text/javascript" src="http://mediaplayer.yahoo.com/js"></script>

అంతే. మీరు ఎన్ని ఆడియో లంకెలు పెట్టినా, అవన్నీ అక్కడికక్కడే వినేలా యాహూ మీడియా ప్లేయర్ చూస్తుంది. (క్రింద చూపిన విధంగా)

మచ్చుకి ఈ పాట వినండి.

2 comments:

కొత్త పాళీ said...

బానే ఉంది గానీ .. ఇప్పటికే మనలో చాలా మంది ఉపయోగిస్తున్న esnips మీద దీని అదనపు సౌకర్యం ఏమన్నా ఉందా? మీరిచ్చిన వివరన చూపిస్తే రెండూ ఒకలాంటివే అనిపించింది నాకు.

Sudhakar said...

వుందండి. ఒక సారి కోడ్ పెడితే చాలు. మీరు ఇక చెయ్యాల్సింది కేవలం mp3 లంకెలు పెడుతూ పోవటమే. ఒక పేజీలో వున్న లంకెలన్నీ ఒక పాటల చిట్టాలా వినే సౌకర్యం దీనిలో వుంది. ప్రతీ పాటకు ఒక రేడియో (widget) పెట్టనక్కర్లా..

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name