తెరాస ప్రతినిధి TV9 లో : "భారత రాజకీయాలు ఒక తులసి వనం అయితే, కాంగ్రెస్ అందులో ఒక కలుపు మొక్క"
పిచ్చి పుల్లయ్య : వార్నీ నీకు మన రాజకీయాలు తులసీ వనంలా అగుపిత్తాన్నాయట్రా...ధూ...మన రాజకీయాలను పేడతో పోలిస్తే పిడకలు అలుగుతాయి, గొబ్బెమ్మలు నీలుగుతాయి. మిమ్మల్ని గాడిదలతో పోలిత్తే అవి సేస్తున్న పని మానేసి పారిపోతాయి. మీకు ఇంకొకిరితో పోలికేంది సామీ..మీరందరూ మీకు మీరే సాటి. అందరూ ఆ తాను ముక్కలే.
నరేంద్ర విజయ దరహాసంతో : "కరీంనగర్ ప్రజలు తెలంగాణా పోరాటానికి ఒక కొత్త అర్ధం చెప్పినారు, ఈ ఫలితం చాలు తెలంగాణా సాధనకు"
పిచ్చి పుల్లయ్య : పులి బాబు గారు, మరక్కడ ఏభై శాతమే పోలయినాయంట గందా? గుర్తింపు కార్డున్న ఓటరులెంతమంది? అందులో ఏభై శాతం ఎంత మంది? ఈ ఏభై శాతంల రిగ్గుంగు ఎవరూ (అంటే తవరు గాదు, ఎగస్పార్టీ వాళ్ళు..అట్టా గుర్రుగా సూడమాకండి బావు) సెయ్యనేదంటారా? పోలీసులు జనాల్ని బయపెట్టేసినారంట గందా? సారా, దుడ్డుకోసరమని పోలీసులకు బయపడకుండా లగెత్తుకొచ్చిన జనాలు ఓటేసేటప్పుడు బయపడ్డమేంది సెప్మా? అహా...నాకు సిన్న డౌటండి సారు.ఇవన్నీ తీసేత్తే అసలు మనస్పూరకంగా ఓటేసినోల్లెంతమందండి బాబు?
కరుణానిధి : "అతనికి టెండూల్కర్ అని పేరు రావటానికి కారణం అతని పరుగులన్నీ పది లోపల ఉండటమే"
పిచ్చి పుల్లయ్య : మరి తమరి పేరు లోని "కరుణ" ఎంత ? నిధి ఎంత సారు? తమరికి ఆ జయ అమ్మాయిగోరి చీరూడిపించిన సెరిత్ర ఉంది గందా...
తెరాస ప్రతినిధి TV9 లో : "మాకు వస్తున్న అభినందనల ఫోన్ కాల్స్ లో చాలా మంది కాంగ్రెస్, తెలుగు దేశం కార్యకర్తలు ఉన్నారు. వారు వారి పార్టీలకు ప్రచారం చేసినా మాకే ఓటేసారంట. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఎవరు గెలుస్తారో"
పిచ్చి పుల్లయ్య : ఆచ్హెర్యంగా ఉంది సామి. తవరి ఆనందం సూత్తే నవ్వాల్నో, ఏడవాల్నో తెలియగుందుండి. చానా మంచిది. కానీ అట్టాంటి నీచ్ కమీన్ కుత్తే కార్యకర్తలని తవరు పార్టీలోకి పొరపాటన రానీకండి సామీ...తమరి వీపు ఎప్పుడో ఇలానే విమానం మోత మోగించేత్తారు...
