Thursday, October 05, 2006

గురజాడ పై గుర్రు

చదువరి గారు అందించిన ఈ వ్యాసం చదువుతుంటే కొంచెం నవ్వు, ఆలోచనా, చిరాకు కలిగి నా అభిప్రాయం రాయలనుకుంటున్నాను. నాకు తెలుగు భాషా శిల్పం, అది ఎలా ఉండాలి? ఇది ఇలా ఉండాలీ ..ఇవన్నీ తెలియవు కానీ గురజాడ రాసిన నవలను చదివిన సామాన్యుడిగా నా అభిప్రాయం ఇది..

నా మొదటి అభిప్రాయం : ఈ వ్యాస రచయత పక్కా కమ్యూనిష్టులా రాశాడు. అసలు తన సమస్య ఏంటో సూటిగా చెప్పకుండా ఎవరినో ఎందుకు తిడుతున్నామో తెలియకుండా తిట్టాడు. బాగానే ఉంది. నాకు అర్ఢం కానిది ఏమిటంటే, జాతి సంస్కృతి విధ్వంసం ఒక్కటే...అసలు గురజాడ కన్యాశుల్కం జాతిని ఏమైనా ఉద్ధరించిందా? లేదు కదా ! మరి ఈ విధ్వంసం ఏమిటి? కొంప తీసి వరకట్నం తీసుకోవటం గురజాడ వలన మొదలయ్యిందటారేమో మన నవరసాల గారు. (వీరిలో పిరికితనం, భయం అడుగడుగునా కనిపిస్తూ ఉంది...అసలు పేరుతో రాయొచ్చు కదా?). దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఒక విధ్వంసకారుడు ఎలా రాయగలడు...?

అసలు ఒక పక్క అప్పట్లో బలమైన వర్గమైన బ్రాహ్మణ వర్గ ఆచారాలపై కన్యాశుల్కం లో విరుచుకు పడిన తీరు చూస్తే పిరికితనం, భయం ఎక్కడ కనిపించాయో అర్ధం కావటం లేదు. గురజాడ పనికట్టుకుని ఏమి రాయలేదు, అప్పటికి ఏంటి ఖర్మ, ఇప్పటికీ మనం చాలా అరుదుగా కన్యాశుల్కంలో హాస్యానికి వాడుకున్న ఘట్టాలను చూడవచ్చు.

 

గురజాడ బ్రిటీషు వారిని కీర్తించాడు అన్నారు...బ్రిటీష్ వారు నయవంచకులు, విభజించి పాలించ వారు అన్నారు..మరి వారు మన దేశాన్ని పరిపాలించక మునుపు ఉన్న రాజులు ఏమి చేస్తున్నారు? జనాలను నాలుగు ప్రధాన కులాలుగా విభజించి పరిపాలించడానికి కారకులెవ్వరు? రాజుల పంచన వేల సంవత్సరాల నుంచి బతుకుతున్న ప్రధాన సామజిక వర్గమేది ? సీ.పి బ్రౌన్ ఎవరు? ఆర్ధర్ కాటన్ ఎవరు?

 

కాంగ్రెస్ ను అవహేళన చేశాడన్నారు, మరి ఎలానో రాయలేదు. విమర్శ అనుకోవచ్చుగా? అయినా కాంగ్రెస్ అంత కడిగిన ముత్యమేమీ కాదే? గురజాడ పతితలను వెనెకేసుకొస్తాడు అని నవరసాల గారి ఉవాచ. అతను ఒక్క  సారి "కన్యక" కావ్యం చదివితే మంచిది. పతిత అని ఒకరిని సంభోదించడంలో వినిపించే మగ దురహంకారం, భ్రష్టత్వం నాకు గురజాడ "జాతి విధ్వంసకర" కన్యాశులంలో కనిపించలేదేంటబ్బా?

2 comments:

spandana said...

చిన్న పిల్లలని పెద్ద ముసలి వాళ్ళు చేసుకోవటం. కన్యాశుల్కానికి ఆశపడి చిన్న పిల్లలనే అమ్ముకోవడం..ఇలాంటి వాటిని వ్యతిరేకించడం సంస్కృతీ విద్వంసం ఎలా అవుతుందో ఆయనకే తెలియాలి. పతితలను వెనుకేసుకు రావటం అంటే ఈయనగారు వివరించి వుంటే బావుండేది, మనం కూడా వివరంగా గడ్డి పెట్టి వుండవచ్చు. అసలు పతితలు ఎవ్వరు? పదేళ్ళ బాలికను పెళ్ళి చేసుకున్న అరవై ఏళ్ళ శ్రేష్ట బ్రాహ్మణుడు పతిత కాదా? డబ్బులకు ఆశపడి చిన్న పిల్లను ముసలికిచ్చి చేసిన తండ్రి పతిత కాదా?
దొంగ చాటుగా బార్యను మోసం చేసి లంజె పంచను చేరేవాడు పతితా? బహిరంగంగా తన వళ్ళు తను అమ్ముకొని బతికే వేశ్య పతితా?
ఈయన దృష్టిలో ఎవ్వరు పతితలో వాళ్ళను ఉద్దరించకపోతే ఇంకెవ్వరిని ఉద్దరించాలి?
నాకు తెలిసి ఈయనో కులపిచ్చిగాడు అయ్యుంటాడు.

--ప్రసాద్
http://charasala.com/blog/

Anonymous said...

నిస్సందేహంగా! నేను ఆంధ్రభూమి సంపాదకునికి ఒక ఈ-లేఖ రాశాను..బ్లాగుల లంకెలతో...ఇంకా జవాబు రాలేదు..పాత్రికేయులకు ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసనుకుంటా :-)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name