Thursday, August 25, 2005

వికిపీడియా లో నా మొదటి రోజు

ఈ రోజు వికిపీడియా లో కొన్ని మార్పులు జత పరిచాను. చాలా సంతృప్తి కలిగింది :-)

నా మొదటి రోజు పదాలు
వంశధార ఒరిస్సా రాష్త్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం ౨౩౦ కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది. ఇందులో ౧౫౦ కిలోమీటర్లు ఒరిస్సా లో వుంది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా వద్ద ప్రవేశించి కళింగపట్నం అనే చోట బంగాళాఖాతం లో కలుస్తుంది. వంశధార దాదాపుగా ౧౧,౫౦౦ చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా ఉపయోగించబదుతుంది. గొట్టా (శ్రీకాకుళం జిల్లా) అనే ప్రదేశం లో దీని ఏకైక ఆనకట్ట వుంది.

Thursday, July 28, 2005

నువ్వు వస్తానంటే నే వద్దంటానా???????

కలియుగం ఖర్మ మన దేశానికి పట్టినట్లు వుంది... వర్షానికి పట్టణాలపై ప్రేమ ముంచుకొచ్చింది
హైదరాబాదు ....ఇంకొక ౩ నెలలకు గాని తేరుకోలేని రహదారులు, ౩ వేల కోట్లు ఖర్చు అయ్యే డ్రయినేజి మరమ్మత్తులు కంట్రాక్టర్లకు పండగే పండగ :-)

ముంబయి : ఇక చెప్పనక్కర లేదు...భీభత్సం అంటే ఏంటో చవి చూసారు ముంబయి ప్రజలు...

ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు కాని, ఈ వైపరీత్యాల నుంచి అతి త్వరగా తేరుకునే రక్షణ వ్యవస్థ మన దేశం శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి.

Thursday, July 21, 2005

నా ఫోటో బ్లాగు ...

హమ్మయ్య...మొత్తానికి నా ఫోటో బ్లాగు ను బాగు చెయ్యగలిగాను... ఇంక జన్మలో "హెల్లో" తో ఫోటో బ్లాగు చెయ్యకూడదు..:-)

Wednesday, July 13, 2005

మనస్సు నియంత్రించు కోవటానికి ఒక మార్గం

నేను టెన్షన్స్ లో మనస్సు నియంత్రించు కోవటానికి ఒక మార్గం కనిపెట్టా. అది నాకొక్కడికే పరిమితం కావచ్చు. కాబట్టి ఎవరూ ప్రయత్నించవద్దు దయచేసి :-)

అదేమిటంటే ...బైక్ ని 70+ KMPH లో నడుపుతూ మంచి ఇలయరాజా మెలొడి హమ్ చెయ్యడం :-)
దీని వలన మనస్సుకు parallel processing (multi threading) సమర్ఢవంతంగా చెయ్యటం అలవాటు అవుతుందని నా ఆశ

Monday, July 11, 2005

అందమైన జీవితాలు...అమరావతి కథలు

ఈ సారి నా పుట్టిన రోజున చాలా గుర్తు పెట్టుకునే బహుమతులు వచ్చాయి...
అందులో అందమైనది నాకు కాబోయే బావ ఇచ్చిన పుస్తకం..
సత్యం గారి "అమరావతి కథలు" చదువుతుంటే అనిపిస్తూ వుంది, వంశీ తన పసలపూడి కథలకు
అక్షరాభ్యాసం ఇక్కడి నుంచి చేసాడా ? ఏంటి అని :-)

ఎన్నాల్లకెన్నాల్లకు...

ఎంత కాలానికి మళ్ళీ వాన వచ్చింది ?
సిగ్గు పడుతున్నట్లే వచ్చి ధరణి సిగను తనివి తీరా తడుపుతోంది

Tuesday, July 05, 2005

ఒక జోకు...

9 వ తరగతి తెలుగు పరీక్ష

ప్రశ్న 1 : భీముడు బకాసురుడిని ఎలా చంపాడో కనీసం 5 వరుసలలో రాయండి ? (5 మార్కులు)
Question 1 : Please explain in minimum of 5 lines, how bheema killed Bakaasuraa ? (5 Marks)

జవాబు : భీముడు బకాసురుడిని గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది
గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది
గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది
గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది
గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది చంపాడు.

Tuesday, June 07, 2005

రాజధాని సిత్రాలు...

మసక బారిన నకిలీ ఐ.ఎస్.ఐ మార్కు హెల్మెట్ అద్దం చికాకు పెడుతోంది
దారి పొడవునా ఇసుక అందరి కళ్సల్లో జల్లుకుంటూ ఒక డొక్కు లారీ ముందుకు పోయింది
అడ్డం పడుతూ పరిగెడుతున్న రోడ్దు బాలలు, దేశ భవిష్యత్తును వెక్కిరిస్తున్నట్టు...
సరిగ్గా రోడ్దు మలుపులో తీరిగ్గా ఆటో ఆపి చుట్ట వెలిగించిన తెలుగు సినిమా నిర్మాతల హీరో

రోడ్దంతా కళ్లాపి జల్లుతూ మన ఘన జల వనరులని వెక్కిరిస్తున్న ఒక తుప్పు టాంకర్
దారి లేదని తెలిసినా మొండిగా, పిచ్చిగా హార్న్ మోగిస్తు ముందున్న వారిని విసిగిస్తున్న మధ్య తరగతి బైకు జీవులు
నాన్న గారి బహుమతి 'పల్సార్' తో జనాలని థ్రిల్ చేస్తున్న కుర్రాల్లు
రోడ్ల పై అనుభవించే రక్త పోటు వ్యవహారాలు...
అడ్దంగా రోడ్లు తవ్వేస్తున్న ప్రయివేటీకరణ, కప్పేదెవెడో మనకర్ధం కాదు

ఎవడో మంత్రి గాడు, ఎన్నికయ్యాక ప్రజలలో తిరగటానికి భయపడి అదే రోడ్దుని బ్లాక్ చేసి పోతున్నాట్ట….
వాళ్ళు నడిస్తే పల్లె బాటలు బ్లాకు...కారులో వెలితే నగర బాట బందు...ప్రజాభిమానం అంతే మరి
ఎవడికి కోపం వచ్చినా చలో నగరం...ఆనందం వచ్చినా చలో నగరం
మరి వీరందరు రైతు జపం నగరం లో ఎందుకు చేస్తారో మన బుర్రకు అందని బ్రహ్మ పదార్ధం
రౌడీ చస్తే రణరంగం చేసి బస్సులు తగల పెట్టేస్తాం, మరి రైతు చస్తే ?

Wednesday, May 25, 2005

ఫ్జయిర్ర్ ఫాక్సు పోస్తు

ఈ పోస్తు నేను ఫ్జయిర్ర్ ఫాక్సు తెలుగు ప్ల్గగిన్ నుంచి ఛేసాను.

Friday, May 20, 2005

నా సింగపూర్ పర్యటన ... అనుభూతులు

Scrappers

Withdancers

అందాన్ని అందంగా ఎలా వర్ణించాలి?

ఇలా....

నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా! ఆ కట్టుబడికి తరించె పట్టుపురుగు జన్మ..ఓ పుత్తడి బొమ్మా !

Friday, April 08, 2005

ఉగాది మళ్లీ వచ్చింది...

అందరికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. :-)

టెలుగు థెలుషుకో...

నాకు చిరాకు పుట్టించే కొన్ని తెలుగు ఖూనీలు....

షివ (Siva)
షైలు (Sailu)
షంకర్ (Sankar)
షసి (Sasi)

మనోల్లు "మనిసి" అనే పదాన్ని పల్లె పదంగా చూస్తారు...మరి ఈ తాగుబోతు శబ్దాలను ఏమంటారో...

Tuesday, April 05, 2005

మన చుట్తూ పిచ్చి వెధవలు....

మందుల షాపులు అన్ని బందు.... వాళ్లకు జనఘోష ఎమీ పట్టినట్లు లేదు. వాళ్లు షాపులు మూసేశారు సరి గదా, ఉస్మానియా మెడికల్ షాపుని కూడా మూసివేయించడానికి తయారయ్యారు. దీని బట్టి ఏమిటి అర్ఢం అవుతుంది తమ్ముడూ అంటే? జనాభా బాగు చెయ్యలేనంతగా చెడిపొయారు అని. ఒక మంచి లేదు, మానవత లేదు. వాళ్ల స్వార్ధం వాళ్ళది. మరి ఇప్పుడు చెప్పు, ఇంకా నేను నా దేశం, నా ప్రజలు, నా జన్మభూమి అనుకోవడం లో ఎమైనా అర్ధం పర్ధం వుందా? ఒక ముక్కలో చెప్పాలంటే "ఎవడి గోల వాడిది, ఎవడి స్వార్ధం వాడిది". మనోల్లు వాళ్ల పిచ్చి వెధవ లాంటి సినిమా హీరో కోసం చస్తారేమో గాని, తోటి, సాటి మనిషి గురించి ఆలోచించే ఇంగితం ఈ జన్మలో పొందలేరు...

Thursday, March 31, 2005

నా తొలి బ్లాగు

ఇది నా తొలి బ్లాగు. ఈ రోజు నేను కిరణ్ గారి బ్లాగు చూసాను. చాలా బాగుంది. అది నాకు ప్రేరణ అని చెప్పవచ్చు.
About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name