Thursday, July 28, 2005

నువ్వు వస్తానంటే నే వద్దంటానా???????

కలియుగం ఖర్మ మన దేశానికి పట్టినట్లు వుంది... వర్షానికి పట్టణాలపై ప్రేమ ముంచుకొచ్చింది
హైదరాబాదు ....ఇంకొక ౩ నెలలకు గాని తేరుకోలేని రహదారులు, ౩ వేల కోట్లు ఖర్చు అయ్యే డ్రయినేజి మరమ్మత్తులు కంట్రాక్టర్లకు పండగే పండగ :-)

ముంబయి : ఇక చెప్పనక్కర లేదు...భీభత్సం అంటే ఏంటో చవి చూసారు ముంబయి ప్రజలు...

ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు కాని, ఈ వైపరీత్యాల నుంచి అతి త్వరగా తేరుకునే రక్షణ వ్యవస్థ మన దేశం శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి.

Thursday, July 21, 2005

నా ఫోటో బ్లాగు ...

హమ్మయ్య...మొత్తానికి నా ఫోటో బ్లాగు ను బాగు చెయ్యగలిగాను... ఇంక జన్మలో "హెల్లో" తో ఫోటో బ్లాగు చెయ్యకూడదు..:-)

Wednesday, July 13, 2005

మనస్సు నియంత్రించు కోవటానికి ఒక మార్గం

నేను టెన్షన్స్ లో మనస్సు నియంత్రించు కోవటానికి ఒక మార్గం కనిపెట్టా. అది నాకొక్కడికే పరిమితం కావచ్చు. కాబట్టి ఎవరూ ప్రయత్నించవద్దు దయచేసి :-)

అదేమిటంటే ...బైక్ ని 70+ KMPH లో నడుపుతూ మంచి ఇలయరాజా మెలొడి హమ్ చెయ్యడం :-)
దీని వలన మనస్సుకు parallel processing (multi threading) సమర్ఢవంతంగా చెయ్యటం అలవాటు అవుతుందని నా ఆశ

Monday, July 11, 2005

అందమైన జీవితాలు...అమరావతి కథలు

ఈ సారి నా పుట్టిన రోజున చాలా గుర్తు పెట్టుకునే బహుమతులు వచ్చాయి...
అందులో అందమైనది నాకు కాబోయే బావ ఇచ్చిన పుస్తకం..
సత్యం గారి "అమరావతి కథలు" చదువుతుంటే అనిపిస్తూ వుంది, వంశీ తన పసలపూడి కథలకు
అక్షరాభ్యాసం ఇక్కడి నుంచి చేసాడా ? ఏంటి అని :-)

ఎన్నాల్లకెన్నాల్లకు...

ఎంత కాలానికి మళ్ళీ వాన వచ్చింది ?
సిగ్గు పడుతున్నట్లే వచ్చి ధరణి సిగను తనివి తీరా తడుపుతోంది

Tuesday, July 05, 2005

ఒక జోకు...

9 వ తరగతి తెలుగు పరీక్ష

ప్రశ్న 1 : భీముడు బకాసురుడిని ఎలా చంపాడో కనీసం 5 వరుసలలో రాయండి ? (5 మార్కులు)
Question 1 : Please explain in minimum of 5 lines, how bheema killed Bakaasuraa ? (5 Marks)

జవాబు : భీముడు బకాసురుడిని గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది
గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది
గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది
గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది
గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది చంపాడు.
About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name