Friday, September 28, 2007

హాలో మూడు...ఆటల ప్రపంచంలో అమ్మకాల రికార్డులు బద్దలు

ఈ అమెరికోల్లకి కంప్యూటర్ ఆటల పిచ్చి కొద్దిగ ఎక్కువ అని తెలుసు గానీ, ఇంత ఎక్కువని తెలీదు. XBOX 360 కోసం తయారయిన Halo 3 ఆట విడుడలయిన ఇరవై నాలుగ్గంటలలో 170 మిలియన్ల డాలర్లు అమ్మకాలు జరిగి, కంప్యూటర్ ఆటల రంగంలో కొత్త రికార్డు సృష్టించింది.

అంతే కాక అదే రోజు ఇంకో రెండు రికార్డులు...అత్యధిక ముందస్తు అమ్మకాలు, అత్యధిక అంతర్జాల ఆటగాళ్ళు ఆడిన ఆటగా రికార్డులకెక్కింది.

ఇక్కడ మీరు కధనం చదవవచ్చు.

ప్రతిష్టాత్మక MIT విశ్వవిద్యాలయం విద్యార్ధులు Halo 3 విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సరదా విగ్రహం

Thursday, September 27, 2007

సెప్టెంబరు నెలలో పదివేల దర్శనాలు

ఈ సంవత్సరం తెలుగు బ్లాగులను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సెప్టెంబరు నెలలోనే నా బ్లాగు దర్శనాల సంఖ్య పది వేలు దాటేసింది. వావ్...

Tuesday, September 25, 2007

ప్రపంచ ఇరవై-ఇరవై : మరిచిపోలేని మధుర క్షణాలు

ఇండియా, పాక్ ని ప్రపంచ వరల్డ్ కప్ మొదటి బౌల్ - ఔట్ లో ఓడించిన మధుర క్షణాలుయువరాజ్ సింగు వరుసగా ఆరు బంతులకు ఆరు ఆర్లు బాదిన మధుర క్షణాలు (విలువ : కోటి రూపాయల బహుమతి)
ఫైనల్ పోటీలో మిస్బా ఉల్ హక్ కు జోగిందర్ వేసిన చివరి మూడు బంతులు

Monday, September 17, 2007

సమాల్‍ చేసింది తప్పా ఒప్పా?

దేశంలో తొలి సారిగా ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద తేనె తుట్టెనే రేపారు. ప్రభుత్వ రంగంలో అంతులేని అవినీతి వున్నదనేది ఎవరూ కాదనలేని నిజం. అంతే కాదు ఈ అవినీతికి కొమ్ము కాసే వారు సాక్షాత్తు రాజకీయ నాయకులేననీ అందరికీ తెలుసు. చిన్న చిన్న విషయాలలో కూడా తల దూర్చి కాంట్రాక్టుల కమీషన్లు కొట్టడం మన ఎమ్.ఎల్.యే లకు అలవాటే. దీనిలో అన్ని పార్టీలతో సహా ఎవరికి మినహాయింపు లేదు. ఒకరికి ఒకరు సాటి.అయితే ఇప్పుడు సమాల్ ఆరోపణలు విషయానికొస్తే...నాకు వచ్చిన ఆలోచనలు ఇవి..
  • అధికారంలో వుండగా అసలు అందరినీ వణుకు పుట్టించేలా రిపోర్టులు ఇవ్వొచ్చు..ఎందుకు చెయ్యలేదు ?


  • విజిలెన్సు రిపోర్టును అసెంబ్లీకి సమర్పిస్తారు. సమర్పించవచ్చు కదా?


  • ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఏ.సీ.బికి గానీ, ముఖ్యమంత్రికి గానీ రహస్య నివేదిక సమర్పించవచ్చు కదా?


  • ప్రభుత్వ విజిలెన్సు డాటా ను రిటైర్మెంటు తర్వాత పత్రికలకు ఇవ్వటం ఎంతవరకూ సమంజసం?


  • మూడు సంవత్సరాలుగా విజిలెన్సు నివేదికలు ఇవ్వకపోతే, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?


  • హఠాత్తుగా ఇప్పుడు సమాల్ మీద అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న వారు ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నారు?


  • కుల ప్రసక్తితో సమాల్ మీద ఎదురు దాడికి దిగటం అంత అవసరమా? లేదా ఇంకో దారి దొరకక ఈ వ్యాఖ్యలకు తెగబడుతున్నారా?


  • ప్రతిపక్షాలు తెగ అల్లరి చేస్తున్నాయి ఇప్పుడు...గానీ వారు పక్షంలో జరిగిన వాటి మీద ఎప్పుడయినా చర్యలు తీసుకున్నారా? ఈ మూడేళ్ల లోనే హఠాత్తుగా అవినీతి కొండంతగా పెరిగిందా?


  • సమాల్ బయట పెట్టిన విషయాలు ప్రతి పక్షాలకు ఇప్పటి వరకూ తెలియదా? వాటికి ఆ మాత్రం లాబీయింగ్ నెట్వర్కు ప్రభుత్వంలో లేదా?ఏది ఏమైనా అందరూ కలసి సామాన్యుడి జీవితాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అపహాస్యం చేస్తున్నారనేది నిర్వివాదాంశం. అది కాంగ్రెస్ అయినా, తెలుగు దేశం అయినా, సీపియమ్ లేదా భాజపా అయినా పెద్దగా తేడా లేదు. మనుషులే మారతారు. ఈ ఐ.ఏ.యస్ లు, ఐ.పీ.యస్ లు, రాజకీయ నాయకుల పంచన చేరి వారికి కుక్క సేవ చెయ్యకా మానరు. మన విస్తరిని చించకా మానరు.

Saturday, September 15, 2007

శోధనను కాలచక్రంలో ప్రతిశోధిస్తే...

ఈ రోజు ఈనాడులో తెలుగు బ్లాగుల మీద వ్యాసం వచ్చింది. చాలా సంతోషం. కొత్తగా వచ్చే వాళ్లకు నీ బ్లాగులో టపాలు ఎక్కువ కనిపించవు కదరా...ఎలా చదువుతారు అనడిగాడు మా ఫ్రెండొకడు. అందుకని గత రెండు సంవత్సరాల నుంచి రాసిన 200 పైగా వున్న టపాల నుంచి కొన్ని (బాగా హిట్లు వచ్చినవి, ఆదరణ పొందినవి) ఇక్కడ పెడుతున్నా...(పాతవి ముందర)

రాజధాని సిత్రాలు

భీముడు, బకాసురుడు...తెలుగు పరీక్ష

ఎవరు నేర్పారమ్మ ఈ పల్లెకూ?

అయ్యా అధ్యక్షా

మన సినిమా హాస్యం నిజంగా హాస్యమేనా

నీ కోసం ఎదురు చూసే వారెవరు?


హాయ్ నా పేరు గణపతి...౧
హాయ్ నా పేరు గణపతి...౨


హిందూ ఎక్కడి నుంచి పుట్టింది?

అంతా మన మంచికే

మరో పద్మ వ్యూహమా

బాబోయ్ TV9

నేను నష్ట పోయాన్రా బాబు

పిచ్చి భారతం

పావుకిలో పేరు మార్చాలి

మెగా ఆ(టో)గడాలు

తెలుగు సినిమా వజ్రోత్సవాలు,,,హీరోలు...జీరోలు - ౧
తెలుగు సినిమా వజ్రోత్సవాలు,,,హీరోలు...జీరోలు - ౨

అందమైన జీవితమా? అందమైన సెల్ ఫోనా


దేశ ముదురు (A)

ఇది నవ్వే విషయమా?

సీమాస్ పై (సీ)లిపి సాహసం

క్రికెటాభిమానులు...జర భద్రం

భారతీయులు, క్రీడా స్ఫూర్తి

ప్రాణ సంకట బాదు

పిల్లికి చెలగాటం...ఎలుకకి ప్రాణ సంకటం

నేనూ ఒక కవినే...

రామా? సేతువు కట్టావా లేదా?

గుర్తుకొస్తున్నాయి...గుర్తుకొస్తున్నాయి

తానా తందానా

ఎంతకాలం ఈ ఆత్మద్రోహం

నీకా ఛాన్స్ ఇవ్వను

సాఫ్ట్వేర్ రంగంలో బుర్రలు ఎంత వేడెక్కి జుత్తు రాలి బట్ట తలలు వచ్చేసినా, ప్రతీ పనిలోను వెతుక్కుంటే కుప్పలుగా వినోదం దొరుకుతుంది. కంగారులో, ఆతృతలో బయటపడే వినోదమన్నమాట. ఎలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుని పగలబడి నవ్వుకుంటాం. అలాంటిది ఒకటి... నేను ఎప్పుడూ మర్చిపోలేనిది ఇది...

అవి నా కెరీర్ మొదటి సంవత్సరపు రోజులు. ఒక చిన్న కొత్త కంపనీలో ఉద్యోగం. అది కూడా మా ఫ్రెండు గాడి ఎన్నారై చుట్టాలది, అందువలన మేమే దానికి ఆద్య్లులం, ఆర్యులం కూడా. మా ఎనిమిది మంది స్నేహితులు అక్కడే పని చేసేవాళ్లం. అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చామో ఏమో, బాగా ఏపుగా పెరిగిన తోటకూర పొలంలోనికి బర్రెను తోలి..ఇక నీ ఇష్టం, తిను పో అన్నట్లుగా వుండేది మా పరిస్థితి. ఏది దొరికితే అది చదివెయ్యటం, ఇంటర్నెట్ను పీల్చి పిప్పి చెయ్యటం, రోజులు పద్దెనిమిది గంటలు పని చెయ్యటం అలవాటయిపోయాయి. కంపనీ నుంచి ప్రోత్సాహం అలానే వుండేది మరి. మేమందరం కలసి విబి, ఒరాకిల్ కాంబినేషన్ లో ఒక కంటెంట్ పోర్టల్ నడుపే సాఫ్ట్ వేర్ రాస్తుండే వాళ్లం. చాలా పెద్ద ప్రాజెక్టు అది. అందులో డాటా కూడా చాలా ముఖ్యమైనది.

ఒక రోజు నా స్నేహితుడు, ఆ సిస్టంలో వున్న పనికిరాని డాటాని తీసేసే ప్రోగ్రామ్ చాలా దీక్షగా రాస్తున్నాడు. సాధారణంగా ఎవరూ డాటాని తొలగించరు, దానిని ఇంకొక చోటకు తరలించెయ్యటమో, ఫ్లాగ్ చెయ్యటమో చేస్తారు. అది మాకు ఆ రోజులలో తెలియదు. వాడు ప్రోగ్రామ్ రాసేసాడు. మా ఇంకొక ఫ్రెండుని పెల్చి ఒరే ...ఇక నువ్వు టెస్టు చేసుకో..ఇటీజ్ డన్...యూనో అని రిలాక్స్ అయ్యాడు. వాడొచ్చి అప్లికేషన్ మొదలుపెట్టి, పనికి రాని డాటా అంతా వెతికి అంతా సెలెక్టు చేసుకుని "Delete Selected Data" అనే బటన్ నొక్కాడు. అప్పుడు వాడికి ఈ విధంగా స్క్రీన్ మీద కనిపించింది.(నేను దానిని మరలా తయారు చేసి పెట్టాను ఇక్కడ)ఇది చూసాక టెస్ట్ చేస్తున్న మా ఫ్రెండు గాడికి డాటా బ్యాకప్ తీసుకుంటే మంచిదేమో అన్న ఆలోచన వచ్చింది.వాడు..కానీ అక్కడా "Cancel" బటన్ వుంటేగా? ఒకే ఒక్క ఆప్షన్.వెనుతిరిగే ఛాన్సే లేదు :-) వాడు వెనక్కు తిరిగి అయోమయంగా, అదో రకంగా మా వాడి వైపు నవ్వాలా, ఏడాలా అన్నట్లు చూసాడు. వాడిదీ అదే పరిస్థితి. కంగారులో "Cancel" పెట్టలేదు వాడు. అయితే ఇంకేం చేస్తాం...ఇక్కడ "Ok" బటన్ నొక్కకుండా వదిలేసి, డాటా సర్వర్ మీద నుంచి కాపీ చేస్తా ఒక్క నిముషంలో అని పరిగెత్తాడు. గబ గబా క్వెరీలు అవీ రాసి ఆ డాటా వెతకటం మొదలు పెట్టాడు. ఎంతకూ దొరకదే...

తీరా అనుమానం వచ్చి ఆ అప్లికేషన్ కోడ్ చూస్తే...

డాటా అంతా చెరిపేసాకే మా వాడు ఆ సందేశం ("Are you sure..") చూపిస్తున్నాడు. అదీ ఒక్క బటన్ తో...

ఇక ఆ రోజంతా కడుపు నొప్పొచ్చేలా నవ్వుకున్నాం...ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వొస్తూనే వుంటుంది.

Tuesday, September 11, 2007

ఐ టీ ఉద్యోగుల ఆగష్టు నెల బాధలు

ఆగష్టు, సెప్టెంబరు నెలలు సమీపించే కొద్ది సాఫ్టువేరు ఇంజనీర్ల పనితనం ఒక్క సారిగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ నెలలలోనే తమ పనితనం తాలుకా మూల్యాంకనం జరిగి కొత్త జీతాలు నిర్ణయిస్తారు కాబట్టి. ఎవడి వైపు చూసినా చాలా ప్రో యాక్టివ్ గా పని చేసేస్తుంటారు. వార్నీ..ఈడి పొట్టలో అణు రియాక్టరు వుందా అని అనుమానాలు వస్తాయి వాళ్ల వైపు చూస్తే...ఇంతా చేస్తే అసలు పిలకంతా మేనేజరు చేతిలోనే వుంటుంది. మేనేజరును రకరకాల కోతి వేషాలు వేసి, సోపు రాసి ఆనందింపచెయ్యటం కొంతమంది చెయ్యగలుగుతారు. ఆ చేష్టలు ఈ టైములో ఎక్కువవుతాయన్నమాట. శుభ్రంగా బాగా పని చేసుకునే వాళ్లు మాత్రం అమాయకంగా ఎదురుచూస్తూ వుంటారు...నా మేనేజరు ఈ సారి ఏ కహాని చెప్తాడా అని. ఈ బాధలపై నితిన్ శ్రీ వాస్తవ్ అనే మన బోటి సాఫ్టు వేర్ నిపుణుడు గీసిన కార్టూన్ చూడండి. కడుపుబ్బా నవ్వుకోండి.


Sunday, September 09, 2007

ఇది ఒక తగలబడుతున్న రోమ్

ఇదేనా భాగ్యనగరం అనుకుని పదిహేను రోజులయ్యిందేమో...మరికొంత మంది అభాగ్యులు కన్ను తెరిచేలోపు ప్రాణాలు వదిలేసారు. ఎప్పటిలానే మన ఎక్స్ గ్రేషియా రాజకీయం రంగప్రవేశం చేసింది. ప్రతి రాజకీయ నాయకుడు పరిగెత్తుకొచ్చేసి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించేసారు..ఎంత దయార్ద హృదయులు? వారికి చెందిన పార్టీల కార్యకర్తలు ఒక్కడొస్తే ఒట్టు. ఒక్క నాయకుడైనా తమ పార్టీ తరపున ఒక్క లక్ష ఎక్స్ గ్రేషియా ప్ర్రకటిస్తారేమో అని చూసా? ఛ ఛ అంత పని మన వాళ్లు చెయ్యటమా? నాయకుల సభలకు బ్యానర్లకు పెడతారు కోట్లు..మరి ఇక్కడ ఏం అడ్డు వస్తుందో వీళ్లకు?


మొత్తానికి ఒకటి అర్ధం అయ్యింది. మనకు ప్రత్యేకంగా ఎక్స్ గ్రేషియా మంత్రిత్వ శాఖ వుండాల్సిందే. ప్రతి నెలా క్రమం తప్పకుండా చనిపోతున్న రైతులు, అభాగ్యులు, పోలిస్ బాధితులు మొదలైన వారికి సక్రమంగా ఈ డబ్బులు అందచెయ్యటం అప్పుడు సులభం అవుతుంది.


మొన్నామధ్య ఈ నగరానికి ఏ.వన్ హోదా ఇచ్చినపుడు నాకు తిక్క రేగింది. అసలు ఏ.వన్ హోదా ఎందుకు, ఏ నగరానికి ఇస్తారో నాకు తెలియదు కానీ, మామూలు స్థాయి నుంచి అతి దరిద్ర స్థాయికి చేరుకున్న నగరాలకు ఇవ్వరని మాత్రం నాకు గట్టి నమ్మకం వుండేది. ఆ నమ్మకం ఆ రోజుతో పోయింది.ఇక్కడ వర్షం పడితే ఒకరిద్దరు చనిపోతారు...మాన్ హోల్లలో పడి. దీనిని ఎవడూ బాగు చెయ్యలేడు. చేతులెత్తేసారు.ఇక్కడ తీవ్ర వాదులు హాయిగా పాస్ పోర్టులు, రేషన్ కార్డులు తీసుకోవటానికి వస్తారు. ఇక్కడే సురక్షితంగా మకాం చేస్తారు.ఇక్కడ చినుకు పడితే ట్రాఫిక్ నరకం. పోలీసులు మాత్రం మాయంచలానాలతోనే సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం సంపాదిస్తారు ఇక్కడి పోలీసులు.ఇక్కడ రోజుకు మద్యం విక్రయం ఒకటిన్నర కోటి.ఎక్కడ బాంబుకు పేల్తాయో తెలియదు. ఎవరు పేల్చారో ప్రభుత్వానికి అంతకన్నా తెలియదు.నాసి రకం రోడ్లు, స్కూల్లు, పార్కింగులు కూడా లేని షాపింగు మాల్లు..
ఇంకా చెప్పాలంటే ఇది ఒక భూలోక అవినీతి నరకంగా తయారయింది.


ఇది ఒక తగలబడుతున్న రోమ్
దేవుడా మా నీరో శేఖరుడికి కాస్త మెదడును, ప్రజలను పాలించే ప్రజ్ఞను ప్రసాదించు తండ్రీ..రవీంద్రుని మాటలలో..ఎక్కడ ప్రభుత్వం ప్రజలను తన వాళ్ళనుకుంటుందోఎక్కడ అవినీతి అడ్రస్ లేకుండా పోతుందోఎక్కడ అధికారులు, తమ పదవులను సేవాతత్పరతతో నిర్వహిస్తారోఎక్కడ ప్రజలు తాము సురక్షిత సమాజంలో వున్నామని భావిస్తారోఅక్కడా నా దేశాన్ని మేల్కొలుపు తండ్రీ

Sunday, September 02, 2007

ఇది అన్యాయం ..చాలా అన్యాయం :-(

ఇది అన్యాయం. చాలా అన్యాయంగా అంకితా మిశ్రా ని సోనీ ఇండియన్ ఇడోల్ పోటీల నుంచి మరొకసారి బయటకు పంపేసారు. నా అభిమాన గాయకుడు అమిత్ పాల్. అయినా ప్రస్తుతం మిగిలిన నలుగురు పోటీదారులు (అమిత్ పాల్, ప్రశాంత్, ఈమన్ ఛటర్జీ, అంకిత) లో అంకితా ఒక విలక్షణమైన గాయని. పాటొక్కటే కాదు, హావభావాలు, స్పోర్టివ్‍నెస్ లలో అంకితాకు సాటి ఎవ్వరూ లేరు. ఈ చెత్త నిర్ణయానికి sms లు తమ వంతు కృషి చేసాయి. ఎలాంటి పాటనైనా పవర్ హౌజ్ గొంతుతో అద్భుతంగా పాడటం అంకితకే సొంతం. అలాంటి మంచి గాయనిని ఇండియన్ ఐడోల్ కార్యక్రమం కోల్పోయింది అని చెప్పక తప్పదు. నాకైతే ప్రశాంత్ ని ఇంటికి ఎప్పుడు పంపుతారా ఎప్పుడూ అనిపిస్తుంది.

ఏది ఏమైనా నాకు చాలా బాధగా వుంది. ఈ లెక్కన అమిత్ పాల్ ని కూడా పంపేస్తారేమో :-(

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name