Sunday, September 09, 2007

ఇది ఒక తగలబడుతున్న రోమ్

ఇదేనా భాగ్యనగరం అనుకుని పదిహేను రోజులయ్యిందేమో...మరికొంత మంది అభాగ్యులు కన్ను తెరిచేలోపు ప్రాణాలు వదిలేసారు. ఎప్పటిలానే మన ఎక్స్ గ్రేషియా రాజకీయం రంగప్రవేశం చేసింది. ప్రతి రాజకీయ నాయకుడు పరిగెత్తుకొచ్చేసి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించేసారు..ఎంత దయార్ద హృదయులు? వారికి చెందిన పార్టీల కార్యకర్తలు ఒక్కడొస్తే ఒట్టు. ఒక్క నాయకుడైనా తమ పార్టీ తరపున ఒక్క లక్ష ఎక్స్ గ్రేషియా ప్ర్రకటిస్తారేమో అని చూసా? ఛ ఛ అంత పని మన వాళ్లు చెయ్యటమా? నాయకుల సభలకు బ్యానర్లకు పెడతారు కోట్లు..మరి ఇక్కడ ఏం అడ్డు వస్తుందో వీళ్లకు?


మొత్తానికి ఒకటి అర్ధం అయ్యింది. మనకు ప్రత్యేకంగా ఎక్స్ గ్రేషియా మంత్రిత్వ శాఖ వుండాల్సిందే. ప్రతి నెలా క్రమం తప్పకుండా చనిపోతున్న రైతులు, అభాగ్యులు, పోలిస్ బాధితులు మొదలైన వారికి సక్రమంగా ఈ డబ్బులు అందచెయ్యటం అప్పుడు సులభం అవుతుంది.


మొన్నామధ్య ఈ నగరానికి ఏ.వన్ హోదా ఇచ్చినపుడు నాకు తిక్క రేగింది. అసలు ఏ.వన్ హోదా ఎందుకు, ఏ నగరానికి ఇస్తారో నాకు తెలియదు కానీ, మామూలు స్థాయి నుంచి అతి దరిద్ర స్థాయికి చేరుకున్న నగరాలకు ఇవ్వరని మాత్రం నాకు గట్టి నమ్మకం వుండేది. ఆ నమ్మకం ఆ రోజుతో పోయింది.



ఇక్కడ వర్షం పడితే ఒకరిద్దరు చనిపోతారు...మాన్ హోల్లలో పడి. దీనిని ఎవడూ బాగు చెయ్యలేడు. చేతులెత్తేసారు.



ఇక్కడ తీవ్ర వాదులు హాయిగా పాస్ పోర్టులు, రేషన్ కార్డులు తీసుకోవటానికి వస్తారు. ఇక్కడే సురక్షితంగా మకాం చేస్తారు.



ఇక్కడ చినుకు పడితే ట్రాఫిక్ నరకం. పోలీసులు మాత్రం మాయం



చలానాలతోనే సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం సంపాదిస్తారు ఇక్కడి పోలీసులు.



ఇక్కడ రోజుకు మద్యం విక్రయం ఒకటిన్నర కోటి.



ఎక్కడ బాంబుకు పేల్తాయో తెలియదు. ఎవరు పేల్చారో ప్రభుత్వానికి అంతకన్నా తెలియదు.



నాసి రకం రోడ్లు, స్కూల్లు, పార్కింగులు కూడా లేని షాపింగు మాల్లు..




ఇంకా చెప్పాలంటే ఇది ఒక భూలోక అవినీతి నరకంగా తయారయింది.


ఇది ఒక తగలబడుతున్న రోమ్




దేవుడా మా నీరో శేఖరుడికి కాస్త మెదడును, ప్రజలను పాలించే ప్రజ్ఞను ప్రసాదించు తండ్రీ..



రవీంద్రుని మాటలలో..



ఎక్కడ ప్రభుత్వం ప్రజలను తన వాళ్ళనుకుంటుందో



ఎక్కడ అవినీతి అడ్రస్ లేకుండా పోతుందో



ఎక్కడ అధికారులు, తమ పదవులను సేవాతత్పరతతో నిర్వహిస్తారో



ఎక్కడ ప్రజలు తాము సురక్షిత సమాజంలో వున్నామని భావిస్తారో



అక్కడా నా దేశాన్ని మేల్కొలుపు తండ్రీ

10 comments:

Anonymous said...

ఎప్పుడూ తెగ మాట్లాడే చంద్రశేఖర్ రావు కనిపించలేదే? రాత్రి అయితే తాగి పడిపోతాడనే నరేంద్ర మాటలే నిజమా?

srinivas said...

Agreed!, and condemn the poor administration.
-Srinivas Ivaturi.

VENKATA SUBA RAO KAVURI said...

kavuri mata
sir,
neenu pushkara kalamgaa patrika ramgamlo panicheestunnaanu. computorpie antagaa pattu ledu. telugu bhashapie manchi praveenyam undani peerunna neenu aa kaaranangaa sonta blogunu blogaleekapoyanu. telugillu, todu needa peerita prayatnyam sagamloonee... meeru naku sayam chestaraa???

Anonymous said...

తోడు-నీడా గారు,

తప్పకుండా..ఇలా సాయం చెయ్యడానికే తెలుగు బ్లాగర్ల గుంపు ఒకటి వుంది. http://groups.google.com/group/telugublog ద్వారా మీరు కూడా సభ్యులు కావచ్చును. మీకు వచ్చిన సందేహాలన్ని అడగవచ్చు. ప్రస్త్తుతం ఈ గుంపులో దాదాపు ఎనిమిది వందల మంది సభ్యులున్నారు.

ప్రస్తుతానికి www.lekhini.org చూడండి. తెలుగులో రాయటం చాల సులభమని మీకే అర్ధం అవుతుంది.

GKK said...

సుధాకర్ అన్నా! మీరు అప్పుడప్పుడు నిరాశావాదం అనే నల్ల కళ్ళజోడుతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. రెండురోజులాగి చూడండి.శిధిలాలక్రిందనుంచి ఒక పిచ్చిమొక్క పుట్టుకొస్తుంది. అదే విధికి తలవంచకపోవటమంటే.

Sudhakar said...

తెలుగాభిమాని తమ్ముడూ...నాక్కూడా కొన్ని సార్లు నిరాశావాదం అనిపిస్తుంది...కానీ ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది అది కాదని. ప్రతీది ఆశావాదంలో చూస్తుపోతే మనకు తెలియకుండానే మన పంచె లాక్కుపోయే రేంజిలో సమాజం తయారయ్యాక ఇక కళ్లజోళ్లు ధరించక తప్పదు.

శిధిలాల క్రింద పిచ్చి మొక్కలు నాకొద్దు...పచ్చికలపై గడ్డి పూలయనా చాలు.

spandana said...

ప్చ్ అని నిట్టూర్చడమేనా మనం చేయగలం?!

--ప్రసాద్
http://blog.charasala.com

madhavi latha said...

kanapadite kaalecheyyalani undi kameeshnlakosam kaakurthipade kaantractersni

Malleeswari said...

Really wonderfull blog. I came to know about this through eenadu. Before that I didn't even know that there are some realy nice blogs in telugu. Keep up the good work! All the best!

shiva said...

hi naa peru siva nenu oka shipping
companylo office boyga chestunanu
nenu office ki kotaga vachetapudu nakemi computer gurinchi teliyadhu
naku computer nerchukovalani chala ashaga vundedhi kani nenekadiki velli nerchukune time ledu alla ani nenu chaduvukunedhi 9th class
nakemo english radu alla maa officelo andharu computer mundhu kurchuni work chestunte naku cheyalani pinchide nenu roju naa work ipogane valadagarakelli chustundevani evarini adigina chepevaru kadu nenu oppkatho chusi nerchukune vani alla computer nerchukunanun eepudu nenu a\c chustunanu denikaina oppika kavalantaru ade naku paniki vachidhi pryatniste edi rakunda vundadhu kasda

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name