Saturday, August 25, 2007

ఇదేనా భాగ్య నగరం ?

దాదాపు నలభై మంది వరకూ మృతి. వంద మందికి పైగా క్షతగాత్రులు...

బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం, ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ..ఇవీ ఈ నగర ప్రజల వినే ప్రభుత్వపు చివరి పలుకులు.

బహుశా వారి పని కావచ్చు...బహుశా వీరి పని కావచ్చు..ఇవి పోలిసుల అరిగిపోయిన రికార్డులు...

ఇది పిరికిపందల చర్య ...పనికి రాని కేంద్రం..

ఛీ మనదీ ఒక సమాజమేనా? ఇక్కడ ప్రాణాలకు విలువ ఐదు లక్షలా? అన్ని రకాల ఇంటలిజెన్స్ నివేదికలూ పోలీసులను ముందుగానే హెచ్చరిస్తాయి..గానీ అక్కడ వినటానికి నిజమైన పోలీస్ వుంటేగా...ప్రతీ ఒక్కడు ఎన్నెన్ని లక్షలు పోసి ఇక్కడకు పోస్టింగులు చెయ్యించుకుంటారో చెత్తనా వెధవలు....అందరూ వాళ్లే వుంటే ఇక నిజమైన పోలీసులు ఎక్కడ? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ప్రభుత్వానికి ఎప్పుడు పడుతుంది?

పేలుడు తరువాతి దృశ్యాలు చూస్తుంటే అసలు మన దేశంలో క్రైమ్ సీన్ అనే దానికి అర్ధం వుందా? అనిపించింది. శవాల మధ్యన తిరుగుతున్న పది పదిహేను జతల కాళ్ళు...ఏ క్లూ ఎవడి కాళ్ల క్రింద నలిగిపోతుందో అర్ధం కాదు. ఒక పోలీస్ సెక్యూరిటీ లైన్ అంతకంటే లేదు.

అంబులెన్సులు గంట తరువాత వచ్చాయి....మరి ఎలా రాగలవు? మనది అద్భుతమైన ట్రాఫిక్ కదా? ఎలా వస్తాయి?

సీ.యన్.యన్ ఐబి యన్ ఒక్క ముక్కలో మన నగర పరిస్థితి చెప్పింది.... హైదరాబాదుకు సెక్యూరిటి కల్చర్ లేదు.

అవును ఒప్పుకోవాల్సిందే...అస్సలు లేదు.

తమకు సంబంధించని వైషమ్యాలలో, తమకు తెలియని సమాజం జరిపిన దాడిలో, తమకు తెలిసేలోపే అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్న మన  సమాజ పౌరులకు సిగ్గుతో తలవంచుకుని శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.

6 comments:

ప్రవీణ్ (నంద) said...

నేను ఏ ఒక్క వాఖ్యంతోనూ మీ బాధను ఆపలేను... మరొక్క వాఖ్యంతో మీ బాధను తక్కువ చేయలేను... భాగ్యనగరవాసిగా బాధపడడం తప్పు వేరే ఎమీ చేయలేను...

Anonymous said...

I am afraid after listening this news, because My friend and I usually visit Necklace Road almost every weekend. (Luckily this week not).
Our so called officials / Government should rethink about Greater Hyderabad security, traffic and drainage.
This has become like serial killing rather serial blasts. Couple of months back blasts in mosque, then had Mudigonda firing, today again blasts. I think our CM is using lot of time to think about which schemes or places or projects can be re named to Rajiv/Indira Schemes.
Hopefully he will get sometime in restroom to think about state affairs that too about capital city.

చదువరి said...

అభాగ్యులం, తీవ్రవాద బాధితులం, అప్రభుత్వ, నిష్ప్రభుత్వ బాధితులం

సునీత said...

మన రాస్ట్ర ధౌర్భాగ్య స్థితి ఇది... మన దేశ పరిస్థితి కూడా ఇలానే ఉంది!!

శరత్ said...

"తమకు సంబంధించని వైషమ్యాలలో, తమకు తెలియని సమాజం జరిపిన దాడిలో, తమకు తెలిసేలోపే అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్న మన సమాజ పౌరులకు సిగ్గుతో తలవంచుకుని శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను."
మీరన్నది నిజం. ఎవరి తప్పుకు ఎవరు బలయ్యారు. ఈ పాపంలో ఉదాసీనతది సింహ భాగం. ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పందించలేని ఉదాసీన వ్యవస్థదీ సింహ భాగం.

ఉదయ్ said...

అసలు వున్న పొలీసు అధికారులలొ సగం మన చెత్త రాజకీయ నాయకుల వెనుక కుక్క కాపలా పనులు చెయ్యటానికి , లెకపొతే ప్రతిపక్షం వళ్ళ మీద దొంగ కేసులు బనాయించటానికి వాడుకుంటుంటే ఇంక నగర ప్రజల బద్రత చూడటానికి ఎవరు వుంటారు చెప్పండి?..కానిస్టేబుల్ కి ఇచ్చే జీతం మన callcenter టాక్సి నడిపే వాడి జీతం లొ సగం. వాళ్ళ కి ఇంక ప్రొత్సాహకాలు ఎక్కడ నుండి వస్తాయి, అదికారం లొ వున్న వారికి స్వామి భక్తి చూపిస్తు గడుపుతే ఎదొ అప్పుడప్పుడు కొంచం బక్షాలు దొరుకుతాయి అని ఆశతొ పని చెస్తూ వుంటారు.
మన అంతరంగిక బద్రత కూడ సైన్యం చూసుకుంటే బాగుంటుంది ఎమో.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name