అప్పిచ్చువాడు....వైద్యుడు వున్న వూరిలో వుండాలని పెద్దలెపుడో చెప్పారు.
అలానే అనుకుని పాపం అమాయక ప్రజలు నమ్మారు...
కోకొల్లలుగా వూరిలో మకాం పెట్టేసారు...
వూరిని నగరంగా మార్చేసారు....
నగరంగా మారిన వూరు కూడా ఒళ్లు విరుచుకుని గర్వపడింది....దాని రాబడి కూడా పెరిగింది.
దాంతో నగరం పక్కదారులు పట్టింది.
ఇక వైద్యుడు తన అసలు పని మానేసి రాజకీయాలలో ఆరితేరాడు..
ప్రజలు తనను నమ్ముకున్నారనే విషయాన్ని పూర్తిగా మర్చాడు.
క్రమంగా అందరూ రాజకీయులే ఆ నగరానికి అన్ని దిక్కులయ్యారు...
ఏడీ వైద్యుడు కనిపించడే....అలా అని ఉన్న వూరిమీద మమకారం ప్రజలను వదలదే...
ఆ మమకారంతో ప్రజలు నగరాన్ని వదలటం లేదు...
అప్పిచ్చువాడు..అప్పు ఇస్తూనే నగరాన్ని దోచుకోవటం మొదలుపెట్టాడు...కుటుంబాలు చితికిపోయాయి
నగరానికి పట్టిన రోగంలో మాడి మసయిపోయిన ప్రజలను పట్టించుకునే వైద్యుడు ఎలాను లేడు...ఇంకేముంది నగరంలో కొల్లొలుగా రాబందులు తయారయ్యాయి.
శవాలపైన ఎగరుతూ వారి బంధువులను ఓదార్చడమే పనిగా పెట్టుకున్నాయి.
వైద్యుడు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు....ప్రస్తుతం వైద్యం మానేసి పోష్టుమార్టమే చెయ్యటం మొదలెట్టాడు
ఇప్పుడు అతడు ఎవరు ఎందుకు చనిపోయారో మాత్రమే చెప్పగలడు...అతికష్టం మీద...
రక్షించు మహాప్రభో అంటే...ఎక్కడో దేహంలో దాడి జరిగితే నా కళ్లకు ఎలా కనిపిస్తుంది అని అమాయకంగా అడుగుతాడు..
నేను వైద్యం చెయ్యలేనందుకు .... నీకు ఎక్స్ గ్రేషియా ఇస్తానంటాడు.
ప్రజలు పైన పెద్దలు చెప్పిన పద్యాన్ని మరొకసారి చదువుకున్నారు.
ఏమీ తోచలేదు...ఎక్కడకు పోవాలో సమఝవ్వలేదు...
మన బతుకింతే అని పద్యాన్ని మార్చి రాసేసుకున్నారు...
పిల్లలకూ అదే నేర్పారు...
అమ్మా, నాన్నలతో వుంటే అన్నింటి కంటే సురక్షితమనుకునే పిల్లలకు ఇవి అర్ధం కాలేదు.
వారు పెద్దయ్యాక కూడా ఇంకా వారు పాత పద్యాన్నే నమ్మసాగారు...
నగరం మాత్రం నవ్వుతూ తన శరీరాన్ని అమ్ముకుంటూ పెంచుకుంటూనే వుంది.
దానికిప్పుడు ఈ రోగాలు పెద్దగా పట్టవు...వైద్యుడి అవసరం అంతకన్నా లేదు....
2 comments:
అమెరికా బాంబు దెబ్బలకు ఇక్కడ మందులు దొరకవు. కావాలంటే డబ్బులిస్తాం. ఉద్యోగాలిస్తాం...అంతే మరి..
నాకు ఎవరిని వైద్యుడు అని మనసులొ వుంచుకుని రాశారొ తెలియదు కాని, నాకు మనసులొ వున్న మనిషి తొ ఇది బాగా అతికింది. నాకు మనసులొ వున్నా మనిషి రైతులకి ఉచిత విద్యుత్తు ఒక్కటి తప్ప ఇంక చెప్పుకొవటానికి ఎమి చెయ్యని గొప్ప వైద్యుడు.
Post a Comment