Friday, August 31, 2007

ఎంతకాలం ఈ ఆత్మ ద్రోహం ?

పని వత్తిడి వలన ఇంతకాలం కొన్ని టపాలు చదవలేకపోయాను. అందులో ఈ మంచి టపా ఒకటి. చదివితే కొంతమంది బాధపడినా, అది నిప్పులాంటి నిజాన్ని ఒప్పుకోమని చెప్పగలిగిందనేది వాస్తవం. అవన్నీ చూసి, నిష్టూరాలు వేసే ముందు మొదట భారతదేశ సమీకరణాన్ని చూద్దాం, చరిత్ర చూద్దాం...ఎందుకు, ఏమిటి, ఎలా అనే మూడు చదువుదాం.

(CIA Fact Book, July 2007 లెక్కల ప్రకారం)

భారత దేశ ప్రస్తుత జనాభా : 1,129,866,154

మతాల పరంగా చూస్తే

హిందువులు : 80.5%

ముస్లిములు : 13.4%

క్రిష్టియన్లు : 2.3%

సిక్కులు : 1.9%

మిగిలిన వారు : 1.8%

అయితే భారతదేశం రాజ్యాంగపరంగా ఈ శాతాలను వేటినీ పరిపాలనా సిద్ధాంతాలకు ప్రాతిపదికగా తీసుకోజాలదు. మనది ప్రజాస్వామ్య లౌకిక సార్వభౌమ దేశం కాబట్టి. పాకిస్తాన్, బంగ్లాదేశాలలో ఈ శాతాలు మొత్తం ప్రభుత్వాలనే మత ప్రాతిపదికగా ఏర్పరిచాయి. ఆ దేశాలలో మైనారిటీల గోల వేరు. బాధలు వేరు. వారిని ఎవరూ పట్టించుకోరు. ఒక పట్టించుకుని ఎవరన్నా చిన్న పుస్తకం రాస్తే దేవుడి పేర తల తీసెయ్యమని ఒక ఫత్వా ప్రపంచవ్యాప్తంగా జారీ అయుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవడో ఒకడు దానిని అమలు చేసెస్తాడు.

ఇక మన దేశంలో....మైనారిటి చట్టాలు ఎలా వుంటాయంటే, వారిని భారతదేశ పౌరులమేనా మనం అనే రకంగా భావించుకునేటట్లుగా నిర్ణయింపబడ్డాయి. వారి చట్టాలు వేరు, నిధులు వేరు, ఎండోమెంటు పనులు వేరు, స్త్రీల చట్టాలు వేరు, స్కూళ్ళు వేరు, ఆఖరికి కాలేజీలు కూడా వేరే. మన దేశంలో ఇంకా ఫత్వా అనేదానికి అర్ధం వుంది. అది ఒక ఇమామ్ జారీ చేసాడు కూడా. అదే ఫత్వాలో సగం తీవ్రతతో ఒక వాఖ్య ఏదైనా ఎవడైనా ఒంకొకడు చేస్తే పార్లమెంటు దుమ్మెత్తిపోతుంది. పార్టీలు పోటీలు పడి మైనారిటీ ప్రేమను చూపిస్తాయి. ఆ అన్నవాడికి మతతత్వాన్ని అంటగట్టేస్తాయి. ఈ డ్రామా చాలా రోజులనుంచి ఇలానే జరుగుతుంది. 

అలా అని ఈ దేశంలో హిందువులేమి తక్కువ కాదు. వారిలోనూ అతివాదులున్నారు. వెధవ పనులూ చేసారు, ప్రాణాలూ తీసారు. కానీ దేశంలో ఎంత మంది వారికి చేయూతనిస్తున్నారు? వారి  నెట్వర్క్ ఏమిటి? మహా అయితే ఒకటి రెండు రాజకీయ పార్టీలు. అవి కూడా దేశ రాజ్యాంగానికి లోబడినవి. వీరి నుంచి అన్య మతాలకు కొద్దిగా ఇరకాటాలుంటాయి, కానీ దేశానికి చిచ్చు మాత్రం పెట్టరు. అంటే పార్లమెంటు మీద దాడి చెయ్యటం లాంటివన్న మాట.

ఇక మిగిలిన శాతం చూద్దాం. 13.4% శాతంలో మహా అయితే 1.0 % శాతం మాత్రమే అతివాదులుంటారు. కానీ ఈ ఒక్క శాతం ఎంత ప్రమాదకరంగా మారుతుందో అందరికి తెలిసిందే. దానిని ఎవడూ ఒప్పుకోడు. ఒప్పుకుంటే వోట్లు రాలవన్న భయం. అసలు నాకర్ధం కానిది, "అఫ్జల్" గాడిని వురి తీస్తే మన దేశంలో ముస్లింలు ఎందుకు ఓట్లు వెయ్యరు? అలా అని రాజకీయపార్టీలు ఎందుకనుకుంటున్నాయి? ఆ లెక్కన మన దేశంలో ముస్లింలు దేశభక్తి ఏమన్నా లేని వారా? అద్భుత కళాకారులు, రాజ్యాంగ నిపుణులు, వైద్యులు అన్ని రంగాలలో స్రష్టలు వున్నారు కదా? మరి ఎక్కడుందీ సమస్య? ఎవరు ఈ ఇమేజ్ ను మన దేశపు ముస్లిములకు అంటగడుతున్నారు? ఎందుకు ఇస్లామిక్ తీవ్రవాదానికి మన దేశంలో చేయూత లభిస్తుంది?

బహుశా ఇవి కొన్ని కారణాలు కావచ్చు...

౦౧. ప్రభుత్వాలు, మదరస్సాలు వారిలో అవిద్యను పెంచి పోషించటం
౦౨. ప్రభుత్వపు సవతి తల్లి ప్రేమ
౦౩. అధిక స్థాయిలో పేదరికం
౦౪. పాత తరపు చాందస వాద ఇస్లామిక్ పార్టీల పట్టు

పైన పేర్కొన్న నాలుగు కారణాలు ఇస్లామిస్ తీవ్ర వాదులకు మన దేశం, ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరాలు పెట్టని కోటగా మారుస్తున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికి పాత నగరం కానీ, ఇతర ప్రాంతాలలో చిన్న రోడ్డు ప్రమాదం జరిగితే, ఆ చేసిన వాడు పారిపోవాలి, లేక పోతే వాడిని నడి రోడ్డులో చంపేసినా చంపేస్తారు. వాహనాలు తగలబెడతారు. ఈ కార్యక్రమంలో సాక్షాత్తు ఆ ప్రాంతపు ఎమ్మెల్యేనో, ఎంపీనో పాల్గొంటారు. భాగ్యనగరంలో అయితే పాత తరపు రజాకర్ల పార్టీలు ఇంకా ఆ ప్రాంతాలను ఏలుతున్నాయి. ఒక అభివృద్ది వుండదు. అసెంబ్లీలో వారినుంచి ఒక్క ప్రశ్న వుండదు. ఎవరూ ఏ తనిఖీకి పాతనగరం వెళ్ళలేరు. వెళ్తే వస్తారో రారో చెప్పలేం. ఇలా వుంది పరిస్థితి. దీనిని సరి చెయ్యటానికి ఏ పెద్ద పార్టీ కూడా ప్రయత్నించదు. ఎందుకంటే మైనారిటీలు రాజకీయపరంగా చైతన్యం పొందితే వారికి చాలా ప్రమాదం. ప్రస్తుతానికి వారికి కావలిసింది మాస్ వోటింగు సరళి. అంటే ఏదో ఒక తెగ నాయకుడిని మంచి చేసుకుంతే, ఆ తెగ అందరూ ఆ పెద్ద చెప్పినట్లు వోట్ వెయ్యటం లాంటిదన్నమాట. ఆ రకంగానే మైనారిటీ వోట్లు ఈ రాజకీయ పార్టీలకు కావాలి. అంతే కానీ వారి అభివృద్ధి గానీ, విద్య గానీ అస్సలు పట్టదు.

పైన చెప్పిన జాడ్యాలన్ని తీవ్రవాద పార్టీలకు అచ్చంగా మన ప్రభుత్వం ఇచ్చిన వరాలు. ప్రస్తుతం పరిస్థితి ఎలా వుందంటే ఒక తీవ్రవాది దొరికితే వాడికి శిక్ష కూడా వోట్ల రాజకీయాల బట్టి అమలు చేస్తున్నారు.

ఈ మతం మత్తునుంచి దేశం ఎప్పుడు బయట పడుతుంది? తీవ్రవాది, దేశ ద్రోహి అన్నాక ఏ మతమైనా ఒకటే. మతాన్ని దానికి జోడించి ప్రకటనలు ఎందుకు చేస్తారో అర్ధం కాదు. ఇది ఇలానే జరిగుతూ పోతే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు దేశ భావ స్రవంతి నుంచి క్రమంగా దూరమైపోతారు. తమ దేశంలోనే పరాయిగా బతుకుతారు.

ఎంతకాలం ఇలా మనం స్వీయమోసం చేసుకుంటాం? ఒక జాతి, ఒక జాతి అని లక్ష సార్లు అరిచేకంటే, ఒక్క జాతిగా బతికి చూపితే మంచిదేమో?  

14 comments:

Anonymous said...

బాగ విశ్లేషించారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనం మాది గొప్ప ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం అని జబ్బలు చరుచ్కుంటూ ఉంటాం, కానీ ప్రజాస్వామ్యాన్ని మనకన్నా ఎవరు గొప్పగా అపహాస్యం చేస్తున్నారు అని.

కోర్టులు అంటే లెక్కలేదు. బందులు చేయటం చట్టవిరుధ్ధం అన్నా వినే నాధుడుండడు.

ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట మాట్లాడితే నిరశనలు, ట్రాఫిక్ జాంలు.

బి.జే.పి చర్యల్ని నేను పూర్తిగా సమర్దించక పోయినా, అప్పుడప్పుడు అనిపిస్తుంది, బి.జే.పి లేకపోతే, ఈ పాటికి హిందువులని ఈ కుహానా లౌకిక పార్టీలు ఏనాడో నట్టేట ముంచేసేవని. లేకపోతే, మీరన్నట్లు ఆ అఫ్జల్ ని ఉరికంభం ఎక్కించటానికి ఎంత తాత్సారం చేస్తున్నారో. మరో పక్క, ఇక్కడ పోలిస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ హంతకుణ్ణి వదిలేశారు.

ఇదింతే బాసూ........

"It happens only in India"

జ్యోతి said...

CONGRATUATIONS SUDHAKER FOR 200TH POST... ALL THE BEST FOR A GREAT JOURNEY...

spandana said...

సుధాకర్ గారూ,
నేను చదువరి బ్లాగుతో పూర్తిగా ఏకీభవించకున్నా మీ ఈ బ్లాగుతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

ఒక అఫ్జల్‌ను వురితీయడం లేదా ఓ ఒవైసీని అరెస్టు చేయడం ముస్లిముల ఓట్లు రావన్ని ఎందుకు ఈ రాజకీయపక్షాలు భ్రమిస్తున్నాయో అర్థం కాదు. అలాగే మీరన్నట్లు ముస్లిములను ఒక అభద్రతా భావంలోనో, పరాయీతనంలోనో వుంచితేనే ఈ మతఛాందసుల పార్టిలకు ఓట్లు రాలేది. అందుకనే పాతబస్తీని అభివృద్ది చెందనీయరు, విద్యను పెరగనీయరు. ఈ ముస్లిం నాయకులు, వారి ప్రాపకానికి చొంగకార్చే కాగ్రసు లాంటి రాజకీయ పక్షాలే ఇప్పటి పరిస్థితికి కారణాలు.

నిన్న ఆగ్రాలో ఏమి జరిగిందో చూడండి. ప్రమాదవశాత్తూ ఓ లారీ నలుగురు ముస్లిం వ్యక్తుల మరణానికి కారణమైతే, ఆ వర్గం దహనాలకు పాల్పడింది. మన రోడ్లమీద ప్రమాదాలు కొత్తనా? మరణాలు కొత్తనా? అలాగని మరో మతస్థులు ఇలా దహనాలకు పాల్పడ్డ ఘాటన నాకు తెలియదు. ముస్లిముల్లో వున్న మైనారిటీ స్పృహ, అభద్రతా వారిని ఇలా పురికొల్పుతున్నాయి. ప్రతి చిన్న ఘటననీ భుతద్దంలో చూసుకొని ఆ వర్గం మీదనే దాడి అనుకొంటున్నాయి.

అలాగే మొన్న బంగారు గొలుసు దొంగిలించాడని ఒకన్ని విపరీతంగా కొట్టి మోటార్ సైకిలుకు కట్టి ఈడ్చిన పోలీసుల అకృత్యాన్ని ఆ బాధితుడు ఎవరన్న దానితో నిమిత్తం లేకుండా యావజ్జాతి విస్మయంతో చూసి నిర్ఘాతపోయి ఖండించింది. అయితే ఆ వ్యక్తి ఓ ముస్లిం అని ముస్లిం సంఘాలు నిరసన ప్రదర్షనలు జరపడం అవసరమా? ఇదంతా వారిలో "తము వేరు" అనే విషభిజాలు నాటే కార్యక్రమం. ఆపేరుతో ఓట్లు దండుకోవచ్చనే కుటిల నాటకం.

--ప్రసాద్
http://blog.charasala.com

Dr.Pen said...

"తీవ్రవాది, దేశ ద్రోహి అన్నాక ఏ మతమైనా ఒకటే. మతాన్ని దానికి జోడించి ప్రకటనలు ఎందుకు చేస్తారో అర్ధం కాదు"- నేను చెప్పేది అదే!మీ నుంచి మరో మంచి వ్యాసం. ప్రసాద్ చెప్పినట్లు మన రాజకీయులే వారిని దూరంగా ఉంచుతున్నారు. వారు ఎంత అభద్రతాభావంతో ఉంటే అన్ని ఎక్కువ ఓట్లు రాలుతాయి. రాజకీయులు అలా ప్రవర్థిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ కోర్టులు అలాగే చేయాల్సిన అవసరం ఏముంది? నేరం నిరూపణ అయిన నిందితులకు శిక్ష తప్పనిసరి! అలాగే గుజరాత్ మారణకాండలో ఎందరికి శిక్ష పడింది? ఈ భాగమూ రాసి ఉంటే ఇంకా పరిపూర్ణంగా ఉండేది.ఇక ఈ రుగ్మతకు చికిత్స ఉంది అది "చదువు"-"విజ్ఞానం" అది అందిస్తే ఏ ముల్లా చెప్పిందో గుడ్డిగా నమ్మడం కాకుండా కాస్త తమ బుర్రను పెట్టి ఆలోచిస్తారు. 'మెదడుకు మోత'(Brainwashing) కాక 'మెదడుకు మేత' పెట్టాలి...But words are things, and a small drop of ink, Falling like dew, upon a thought, produces That which makes thousands, perhaps millions, think. -George Byron

Anonymous said...

స్వీయమోసం ఏమిటండీ బాబు, ఆత్మవంచన అన్న పదం ఉండగా!

Burri said...

బాగుంది, వీటి అన్నిటికి ములకారణం మన ము-డ మోపి రాజకీయమే కాని మన గొప్ప ప్రజాస్వామ్యం కాదు. మన చట్టం కాలం అనుకూలం గా మార్చవచ్చు, కాని అపని చేయటానికి ఒక డేరింగ్ & డాష్ గ్ నాయకుడు కావాలి. బి.జే.పి. హిందువులు లకు చేసినా దానికంటే ఎక్కువ హిందువులు బి.జే.పి. కి చేసిన్నారు, కాని వాళ్లు మాములు అధికార దాహాం కలిగిన రాజకీయ నాయకులే. ఆద్వాని పాకిస్తాన్ పలుకులు, కే.సి.ర్. నిజాం నవాబు పలుకులు వినలేదా! మనకు లోకం తెలిసిన నాయకుడు కావాలి. ఆయన ఆధికారాన్నికి దాసోహం కాకూడదు.

-మరమరాలు
http://maramaraalu.blogspot.com/

రానారె said...

"అంటే ఏదో ఒక తెగ నాయకుడిని మంచి చేసుకుంతే, ఆ తెగ అందరూ ఆ పెద్ద చెప్పినట్లు వోట్ వెయ్యటం లాంటిదన్నమాట. ఆ రకంగానే మైనారిటీ వోట్లు ఈ రాజకీయ పార్టీలకు కావాలి. అంతే కానీ వారి అభివృద్ధి గానీ, విద్య గానీ అస్సలు పట్టదు." - ఈ సంగతిని భారతీయులందరూ గ్రహించవలసి ఉంది. ఆంగ్లేయులు పాటించిన "విభజించు-పాలించు" అనే క్షుద్రమంత్రమే ఇప్పటి మన రాజకీయనాయకులనే మాయలఫకీర్లను బ్రతికిస్తోంది. మైనారిటీ హక్కులు, మాదిగ హక్కులు, మాలహక్కులు, కులసంఘాలు, వర్గ పోరాటాలు... ఇలా అంతర్గత విభేదాలలో మునగడం తప్ప, మనల్నిలా విభజిస్తున్న రాజకీయ క్రీడాకారుల జిత్తులను తిప్పికొట్టి, మనమంతా భారతీయులమనే ధోరణి అలవరచుకోవాలి. విశ్వవిద్యాలయాలు, కళాళాలల విద్యార్థుల్లోనే ఈ విభేదాలూ విషబీజాలూ నాటి దేశపు ఆయువుపట్టుమీదనే దాడిచేస్తోంది ఈ క్షుద్రమంత్రం. కులపోరాటాల్లోనూ, మతపోరాటాల్లోనూ ఏదో ఒక దానిలో చేరిపోవలసిందే అనే పరిస్థితులను కల్పిస్తున్నారు. ఒకో వర్గానికి ఒకో రాజకీయపార్టీ నాయకత్వం. ఆ వర్గపు ఓట్లన్నీ ఆ పార్టీ పెట్టెలోకి చేరడం ఖాయం. ఈ మూర్ఖత్వాన్నుంచీ విద్యార్థులే ముందుగా బయటపడాల్సి ఉంది. బ్లాగులు అందుకు తగిన సాధనం కాగలవేమో!?

Burri said...

బాగుంది, వీటి అన్నిటికి ములకారణం మన ము-డ మోపి రాజకీయమే కాని మన గొప్ప ప్రజాస్వామ్యం కాదు. మన చట్టం కాలం అనుకూలం గా మార్చవచ్చు, కాని అపని చేయటానికి ఒక డేరింగ్ & డాష్ గ్ నాయకుడు కావాలి. బి.జే.పి. హిందువులు లకు చేసినా దానికంటే ఎక్కువ హిందువులు బి.జే.పి. కి చేసిన్నారు, కాని వాళ్లు మాములు అధికార దాహాం కలిగిన రాజకీయ నాయకులే. ఆద్వాని పాకిస్తాన్ పలుకులు, కే.సి.ర్. నిజాం నవాబు పలుకులు వినలేదా! మనకు లోకం తెలిసిన నాయకుడు కావాలి. ఆయన ఆధికారాన్నికి దాసోహం కాకూడదు.

-మరమరాలు
http://maramaraalu.blogspot.com/

cbrao said...

ఆలొచింపచేసే రచన ఇది.సరిఐన పంధాలో ఉంది. Messages moderation ఏమయ్యింది? రఘునాధ రెడ్డి బుర్రి ఉత్తరం రెండు సార్లు వచ్చింది?

Unknown said...

మంచి వ్యాసం. రానారె చెప్పిన దాంతో కూడా నేను ఏకీభవిస్తున్నా...

ఈ కుటిల రాజకీయ నాయకుల పంధా అంతా విభజించు, పాలించు అనేదే. ఎంతగా ప్రజలను చీల్చగలిగితే అంతగా వోటు బాంకులను అభివృద్ధి చేసుకోవచ్చు అనే వెధవ ఆలోచన.

చదువు, విజ్ఞానం పెంచుకోవడం వల్ల కొంత వరకూ సమస్య తీరవచ్చు ఇస్మాయిల్ గారన్నట్టు.

కానీ ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమయిన సమస్య రాజకీయ నాయకులు కొందరు చదువుకున్న వారయినా తమ స్వలాభం కోసం ఈ అస్త్రాన్నే ఉపయోగించడం. వైఎసార్ నే తీసుకోండి, సడన్ గా ఎక్కడ లేని ప్రేమా ముస్లిముల మీద పుట్టుకొచ్చి రిజర్వేషన్లో, మైనారిటీలో అని మొత్తుకుంటున్నాడు.

ఇక్కడ అవసరం కన్నా వోటు బాంకు రాజకీయాలే ఎక్కువ మరి...

Sudhakar said...

@ ఎనానిమస్
"స్వీయమోసం" బాగా లేదంటారా? "ఆత్మ వంచన" అనేది నా బుర్రలో తట్టింది కానీ, అది వ్యక్తిగత వచనంలో వాడేది కదా? మన ప్రభుత్వానికి, దేశానికి "ఆత్మ" అనేది వుండదు కదా? ఇక "ఆత్మ వంచన" అని ఎలా వాడగలను? :-) అందుకని స్వీయమోసం అని వాడా.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఆత్మవంచనే సరైన వాడుక.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఆత్మ అంటే soul అని అర్థం కాదు. అది సంస్కృతంలో ఒక సర్వనామం (pronoun).

ఆత్మా - తాను (self)
ఆత్మానౌ - తామిద్దరూ
ఆత్మాన: - తాము

నామవాచకంగా వాడే సందర్భం :

పరమాత్మా - విశ్వమంతటా వ్యాపించిన తాను Universal Self

ఆత్మవంచన - తనని తాను మోసం చేసుకోవడం
ఆత్మహత్య - తనని తాను చంపుకోవడం.
ఆత్మవిమర్శ - తనని తాను విమర్శించుకోవడం
ఆత్మగౌరవం - తానని తాను గౌరవించుకోవడం
ఆత్మజ్ఞానం - తనని తాను తెలుసుకోవడం మొ.
ఆత్మనిందాపూర్వకం - తనని తాను నిందించుకుంటూ (self-deprecatory)

అందుకనే ఆత్మవంచన సరైన పదం అని రాశాను. ఈ పదాల్ని "స్వీయ" తో ప్రతిక్షేపించడం (replacing) సాధ్యం కాదు.

ఆత్మవంచన లో ఉన్న ఫోర్సూ సద్యో అర్థ స్ఫురణా స్వీయమోసంలో ఉండదు. స్వీయమోసం అంటే (ఇతరుల సహాయం లేకుండా) తాను చేసిన తన సొంత మోసం అని స్ఫురిస్తుంది తప్ప తనని తాను మోసం చేసుకోవడమనే అర్థం రాదు.

లోగుట్టు said...

ఆ గణాంకాలు ప్రభుత్వ లెక్కలు.
క్రైస్తవ మతం లోనికి మారడం ప్రస్తుత ట్రెండ్.
ఇది కొన్నేళ్లు కొనసాగితే హిందువులు మైనార్టీలుగా మారతారు.
అప్పుడు ఓట్ బ్యాంక్ గా మారతారు. ఫండ్స్, పథకాలు.. అన్ని పార్టీలు హిందువుల వెనకే. ఎర్ర బాబులతో సహా. హిందువులకూ మంచి రోజులు వస్తాయి.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name