Tuesday, September 11, 2007

ఐ టీ ఉద్యోగుల ఆగష్టు నెల బాధలు

ఆగష్టు, సెప్టెంబరు నెలలు సమీపించే కొద్ది సాఫ్టువేరు ఇంజనీర్ల పనితనం ఒక్క సారిగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ నెలలలోనే తమ పనితనం తాలుకా మూల్యాంకనం జరిగి కొత్త జీతాలు నిర్ణయిస్తారు కాబట్టి. ఎవడి వైపు చూసినా చాలా ప్రో యాక్టివ్ గా పని చేసేస్తుంటారు. వార్నీ..ఈడి పొట్టలో అణు రియాక్టరు వుందా అని అనుమానాలు వస్తాయి వాళ్ల వైపు చూస్తే...ఇంతా చేస్తే అసలు పిలకంతా మేనేజరు చేతిలోనే వుంటుంది. మేనేజరును రకరకాల కోతి వేషాలు వేసి, సోపు రాసి ఆనందింపచెయ్యటం కొంతమంది చెయ్యగలుగుతారు. ఆ చేష్టలు ఈ టైములో ఎక్కువవుతాయన్నమాట. శుభ్రంగా బాగా పని చేసుకునే వాళ్లు మాత్రం అమాయకంగా ఎదురుచూస్తూ వుంటారు...నా మేనేజరు ఈ సారి ఏ కహాని చెప్తాడా అని. ఈ బాధలపై నితిన్ శ్రీ వాస్తవ్ అనే మన బోటి సాఫ్టు వేర్ నిపుణుడు గీసిన కార్టూన్ చూడండి. కడుపుబ్బా నవ్వుకోండి.










4 comments:

Anonymous said...

సుధాకర్ గారూ, వాస్తవ పరిస్థితులకు దర్పణం పడుతూ, చాలా హాస్యచతురతతో కూడిన కార్టూన్లని జతచేసి పోస్ట్ రాశారు, చాలా బాగుంది.
- నల్లమోతు శ్రీధర్

మేధ said...

hahaha.. even i got this mail nearly 2weeks back ...
anyway, our appraisal cycle is already over.. so no worries for the time being :)

రాధిక said...

టూ మచ్ వుంది.బయట నుండి చూసేవాళ్ళకి వీళ్ళందరికీ పనీపాటా లేకుండా హాయిగా ఎంజోయ్ చేస్తూ వేలకి వేలు జేబులో వేసుకుంటూ తిఉగుతున్నట్టు వుంటుంది.శారీరక కష్టం వుండకపోయినా మానసికం గా వీల్లకి వుండే టెంక్షన్స్ ఏ వుద్యోగాల్లోనూ వుండవట.

రవి said...

సుధాకర్ గారు బాగ చెప్పారు. ఈ జోక్ ఎవరో ఫార్వర్డ్ చేసారు కానీ మీరు చెప్పిన డిటైల్స్ తెలీవు. ఇంకా కాస్త ఎలాబొరేట్ గా రాసుంటే ఇంకా బాగుండేది.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name