Monday, September 17, 2007

సమాల్‍ చేసింది తప్పా ఒప్పా?

దేశంలో తొలి సారిగా ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద తేనె తుట్టెనే రేపారు. ప్రభుత్వ రంగంలో అంతులేని అవినీతి వున్నదనేది ఎవరూ కాదనలేని నిజం. అంతే కాదు ఈ అవినీతికి కొమ్ము కాసే వారు సాక్షాత్తు రాజకీయ నాయకులేననీ అందరికీ తెలుసు. చిన్న చిన్న విషయాలలో కూడా తల దూర్చి కాంట్రాక్టుల కమీషన్లు కొట్టడం మన ఎమ్.ఎల్.యే లకు అలవాటే. దీనిలో అన్ని పార్టీలతో సహా ఎవరికి మినహాయింపు లేదు. ఒకరికి ఒకరు సాటి.



అయితే ఇప్పుడు సమాల్ ఆరోపణలు విషయానికొస్తే...నాకు వచ్చిన ఆలోచనలు ఇవి..




  • అధికారంలో వుండగా అసలు అందరినీ వణుకు పుట్టించేలా రిపోర్టులు ఇవ్వొచ్చు..ఎందుకు చెయ్యలేదు ?


  • విజిలెన్సు రిపోర్టును అసెంబ్లీకి సమర్పిస్తారు. సమర్పించవచ్చు కదా?


  • ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఏ.సీ.బికి గానీ, ముఖ్యమంత్రికి గానీ రహస్య నివేదిక సమర్పించవచ్చు కదా?


  • ప్రభుత్వ విజిలెన్సు డాటా ను రిటైర్మెంటు తర్వాత పత్రికలకు ఇవ్వటం ఎంతవరకూ సమంజసం?


  • మూడు సంవత్సరాలుగా విజిలెన్సు నివేదికలు ఇవ్వకపోతే, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?


  • హఠాత్తుగా ఇప్పుడు సమాల్ మీద అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న వారు ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నారు?


  • కుల ప్రసక్తితో సమాల్ మీద ఎదురు దాడికి దిగటం అంత అవసరమా? లేదా ఇంకో దారి దొరకక ఈ వ్యాఖ్యలకు తెగబడుతున్నారా?


  • ప్రతిపక్షాలు తెగ అల్లరి చేస్తున్నాయి ఇప్పుడు...గానీ వారు పక్షంలో జరిగిన వాటి మీద ఎప్పుడయినా చర్యలు తీసుకున్నారా? ఈ మూడేళ్ల లోనే హఠాత్తుగా అవినీతి కొండంతగా పెరిగిందా?


  • సమాల్ బయట పెట్టిన విషయాలు ప్రతి పక్షాలకు ఇప్పటి వరకూ తెలియదా? వాటికి ఆ మాత్రం లాబీయింగ్ నెట్వర్కు ప్రభుత్వంలో లేదా?



ఏది ఏమైనా అందరూ కలసి సామాన్యుడి జీవితాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అపహాస్యం చేస్తున్నారనేది నిర్వివాదాంశం. అది కాంగ్రెస్ అయినా, తెలుగు దేశం అయినా, సీపియమ్ లేదా భాజపా అయినా పెద్దగా తేడా లేదు. మనుషులే మారతారు. ఈ ఐ.ఏ.యస్ లు, ఐ.పీ.యస్ లు, రాజకీయ నాయకుల పంచన చేరి వారికి కుక్క సేవ చెయ్యకా మానరు. మన విస్తరిని చించకా మానరు.

18 comments:

Anonymous said...

మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి. కాని గత ప్రభుత్వాల కంటే యీ ప్రభుత్వంలో చాలా మంది ఉద్యోగులు,రాజకీయనాయకులు,కాంట్రాక్టర్ ల ఆగడాలకు అంతేలేకుండా పోతుంది.

కందర్ప కృష్ణ మోహన్ - said...

అపహాస్యం - నిజమే, అదొకటే మిగిలేది...
పాపం శాంతమ్...

Naga Pochiraju said...

మీరు మరీ అండీ......
గత ప్రభుత్వానికీ,ఇప్పటి ప్రభుత్వానికీ అన్నీ తెలుసండీ.
ఈ పాపం లో అందరికీ కొంత వాటా ఉంది
ఏడం వైపు ఒకటి లబ్ డబ్ అని అరుస్తూ ఉంటుంది.దాని మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి మన రాష్ట్రం లో అవినీతి లేదని.
ఎవరి వల్లా కాదు.
ఉపయోగం లేదని సమాల్ ఇదివరకు బయట పెట్టలేదేమో.
అందరికీ తెలుసండి యే సీ బీ వగైరా కు కేసులు వెళ్ళాయంటే ఒక పట్టానా తేలవని.
ఇదంతా రెండు రోజుల హంగామ.మళ్ళీ షరా మామూలే

Unknown said...

చివర సారాంశం చక్కగా సెలవిచ్చారు. ఇంతకీ సమాల్ ఎవరు? ఏమా కథ? (రాముడికి సీత ఏమయ్యిందని అడిగినందకు క్షమించండి)

Sudhakar said...

సమాల్ ఎవరని అడిగారా? :-)

సమాల్...రామచంద్ర సమాల్ (బా.జే.బాండ్ తరహాలో, పొగలు కక్కుతున్న వెపన్ తో)...

ఈనాడు చదవండి మీకే తెలుస్తుంది

cbrao said...

పంజగుట్ట వంతెన కూలడం తో subcontractors ఎవరి బంధువులో, నిర్లక్ష్యం, అవినీతి ఏ స్థాయిలో ఉందో అవగతమౌతుంది.

cbrao said...

పంజగుట్ట వంతెన కూలడం తో subcontractors ఎవరి బంధువులో, నిర్లక్ష్యం, అవినీతి ఏ స్థాయిలో ఉందో అవగతమౌతుంది.

ramya said...

'అవినీతి' అనే పదం విని విని అందరికి అది చాలాసహజంగా అనిపిస్తున్నట్టుంది ఇప్పుడు. టివిలోయాంకర్ మాటలు వినేవుంటారు సమాల్ చేసిన ఆరోపనలు నిజమేనని అందరికి తెలుసు కానిఅతను చేసినంత ఎక్కువ అవినీతి జరిగిందాలేదా అనేదే ముఖ్య విషయం అని ఆ యంకర్ గొప్ప గొంతు తో చెపుతోంది, అంటే అవినీతి లో ఎక్కువ అవినీతి తక్కువ అవినీతి అని రెండు వుంటాయా,(కర్ర తో చంపితే తక్కువ తప్పు కత్తి తో చంపితే ఎక్కువ తప్పు అన్నట్టుంది.

చదువరి said...

మనం నిదరపోతున్నాం.
ఇంట్లో దొంగలు పడ్డారు. కాపలావాడిని చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు.

భయం చేతో, మరో కారణం చేతో కాపలావాడు అరవలేదు, మనల్ని లేపలేదు. (సరే, నిదరోయాడనే అనుకుందాం)
వాళ్ళకు దూరం కాగానే (పోనీ మెలకువ రాగానే) కేకలు వేసి మనలను లేపాడు.

ఇప్పటి దాకా ఏం చేసావురా అని కాపలావాడి మీద పడతామా? దొంగ సంగతి చూస్తామా?

ఇందాకటి దాకా మాట్టాడకూండా ఇప్పుడు అరుస్తావేంటి అని దొంగలు కాపలావాణ్ణి బెదిరిస్తోంటే.. ద్రోహులెవరో ఆమాత్రం పోల్చుకోలేమా!?

S said...

I am sorry I don't knwo how to type in telugu. But you secodn last point is not entirely valid. I am of the firm belief that though there was a lot of corryption before, it has increased a lot in the last three years. If it didnt, you wouldnt hear so much about it. Also, regarding our politicians, if any party (congress here) is otu of power for 9 years and then get power, you can only imagine the plunder that will happen. Its like leaving a starving lion into a small fenced yard containing tiny little young sheep.

Anonymous said...

కే.ఎ.పాల్ లా కాకుండ సమల్ తన నిజాయితీ నిరుపిచుకొవలి

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

శ్రీ రామచంద్ర సమాల్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మనం ప్రశ్నించడంలో తప్పులేదు కాని ప్రశ్నించే ముందు వాటి జవాబులు మనకూ తెలియవని ఒప్పుకుని ప్రశ్నించాలి.

పదవిలో ఉన్నప్పుడు నివేదికలిచ్చి ప్రయోజనం లేదనుకుంటా. ముందు ఆ నివేదికలిచ్చినవాడి అంతు చూస్తారు-కేంద్రంలో కూడా తమ పార్టీనే ఉంది కదాని ! సమాల్‌కే స్వార్థముండి ఉంటే అధికారంలో ఉన్నవాళ్ళతో పెట్టుకోడు.

ఏమడిగినా ఒక ఆవు కథ చెప్పడం శేఖర్‌దాదాకి అలవాటైపోయింది. కాసేపు "తొమ్మిదేళ్ళ తెలుగుదేశం హయాంలో"అని ఎత్తుకుంటాడు.మరికాసేపు" దీని వెనక నాయుడి హస్తముంది"అంటాడు."అయ్యా ! అధికారంలో ఉన్నది తమరైతే జనం నాయుడి మాట విని మీ మీద ఎందుకు అభాండాలేస్తున్నారు ?" అని అడిగితే సమాధానం ఉండదు.

spandana said...

చదువరీ,
మీ సమాధానం అదిరింది. మనక్కావలిసింది సమాల్ ఎందుకు చేశాడు? ఎప్పుడు చేశాడు? ఎవరు అతని వెనుక వున్నారు? అని కాదు. అతను చెబుతోంది నిజమా? కాదా? నిజమయితే ఈ ప్రభుత్వం ఏమి చేయనుంది?

--ప్రసాద్
http://blog.charasala.com

cbrao said...

పంజగుట్ట వంతెన కూలడం తో subcontractors ఎవరి బంధువులో, నిర్లక్ష్యం, అవినీతి ఏ స్థాయిలో ఉందో అవగతమౌతుంది.

siva said...

Nenu prasad gaarito eekibhavistunnanu. Asalu avineeti vundaa leda annadi charcha.

Siva

Burri said...

మీకు మరియు చదువరి గారికి వచ్చిన ఆలోచనలు చాలా బాగున్నాయి. మీరూ నమ్ముతారో లేదో కాని సమాల్ ఆరోపణలు తరువాత నాకు మరాల "Hera Pheri(2000)" చూసినట్లు ఆయినది. తారగణం, సమాల్: Akshay Kumar(రిటైర్మెంటు: No heroin), ఇప్పటి ప్రభుత్వం: Suniel Shetty, గత ప్రభుత్వం: Paresh Rawal (ముసలితనం: అధికారం లేదు), మన ప్రజలు: Tabu (ఇప్పటి ప్రభుత్వానికీ heroin) ఇప్పుడు అ సినిమా చూడండి, చివరిగా దొంగలు దొంగలు ఊరులు పంచుకొంటాయి. సుఖాంతము: No news from Newspapers.

-మరమరాలు

dr.mohan said...

samaal visirina savllaki okate jawaabu untundi.oka supreme court sitting judge tho enquiry cheyinchandi leda aayanagaru mottam service lo ekkadaia eppudaina thappu chesademo adi veliki teesi atanni irikinchandi. aa rendu meeku saadhyam kani panlu ori neecha nikrushta raja keeya nayakullara. ee savaal elaundi? dr mohan. hyderabad.
9848035045

Unknown said...

for telangana samethalu
>visit now

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name