తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ప్రయాణిస్తున్న దిశ చూస్తే నవ్వు వస్తుంది. ఇది కొన్నాళ్లకు ఎన్.ఆర్.ఐ పెట్టుబడుల సంఘంగా మారుతుందేమో అన్న సందేహమూ వస్తుంది. ఇప్పుడు అది అమెరికా రాజకీయాలలో దూరేంతవరకూ పోయింది. సోనియాను ఇటాలియన్ అని తిట్టే చంద్ర బాబు, తెలుగు జనాలు అమెరికా రాజకీయాలలోనికి దూరటాన్ని ఎలా సమర్ధిస్తాడో మరి. ప్రతి రాజకీయ ప్రతినిధి అమెరికా వెళ్లడం, అక్కడి వారిని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమనటం. పెట్టుబడులు తప్ప మరేమి చెయ్యలేరా వారు? సిలికానాంధ్ర లాంటి సంస్థలు ఎలాగు మన రాజకీయనాయకులకు పట్టవు.
హిల్లరీ క్లింటన్ ఎన్నికలకు ఒక మిలియన్ డాలర్లు తానా తరుపున ఇవ్వబోతున్నారంట. అంటే దాదాపు నలభై కోట్లు. ఆ డబ్బుతో ఎంత మంది తెలుగు రైతులకు విత్తనాలు కొనివ్వవచ్చు? ఎంతమంది వరద బాధితులను ఆదుకోవచ్చు? అసలు మన రాష్ట్రంలో వరదలు, తుఫాన్ సంగతి వారికి అసలు పట్టిందా? లేదా విడుదలవ్వబోయే చిరంజీవి సినిమాకు అమెరికా హక్కుల మీదే ఆలోచనా?
తెలుగు భాషగా కాక సంస్కృతిగా మారినందువలన, వారిని ఎవరూ తెలుగు వారు కాదనటం లేదు. కానీ కనీసం మిగిలన దేశాల కాలనీలు, వలస వెళ్లిన జనాల సంస్కృతి, మాతృ దేశం మీద ఆరాటం, సేవ తెలుసుకుంటే చాలు.
[కొసరు] : తలో గ్రామం దత్తత తీసుకోండి. - ప్రవాసాంధ్రులతో చంద్రబాబు (ఇక్కడ చూడండి)
ఏమి చెయ్యలేని రాజకీయనాయకుల్లా కాకుండా, కాస్త మానవ సేవ కూడా చూడండి అని చెప్పకనే చెప్పినట్లుంది. చంద్రబాబు చాలా గుణ పాఠాలు నేర్చుకున్నట్లుందే? క్రితం సారి పెట్టుబడులు అడిగినట్లు గుర్తు
27 comments:
agreed.
Well said Sir, TANA instead of concentrating on their political ambitions should concentrate on upliftment of poor.
వెల్, ఈ సంఘాలని మొదట ఎవరో ఒక సదుద్దేశ్యంతో స్థాపిస్తారు. తరువాత ఆధిపత్య పోరాటాలు, కుల పోరాటాలు, ఆర్దిక అనుమానాలు, వ్యక్తిగత ఆదిపత్యాలు మొదలవుతాయి. తరువాత చీలుతాయి. పోట్లాటలు, పటాటోపాలు మొదలవుతాయి. అన్నింటికంటే దిగజారుడు రాజకీయాలు మామూలవుతాయి. ఇందులో కొత్త ఏముంది ? మన భారతీయులకు ఇది మాములే కదా !!!
టైటిల్ చాలా బాగుంది. పెట్టుబడులు పెట్టడంతప్ప ఇంకేమీ చెయ్యలేరా తానావారు - అన్న ప్రశ్నబాగుంది. తుఫాను బాధితులకు డబ్బులిచ్చినా మధ్యలో గద్దలు తన్నుకెళ్తాయోమోననే అనుమానంకూడా రాకపోదు. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వానికి వరదబాధితులకు అందవలసిన సహాయం సరిగా అందేలా చూసే చిత్తశుద్ధి కనిపిస్తే కదా!? ప్రజాసేవాకార్యక్రమాలు కాకున్నా ఈమధ్య వంగూరిఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచతెలుగుమహాసదస్సు లాంటివేవైనా చెయ్యొచ్చు. అదీ ఒక విధమైన సమాజ సేవేకదా? చివరి రెండువాక్యాలూ నాకు సరిగా అర్థంకాలేదు.
మరో కోణంలో ఆలోచిద్దాం!
అమెరికా రాజకీయాలలో దూరడంలో తప్పేముంది?
తానా వాడు విత్తనాలు ఎందుకు కొనివ్వాలి? అసలు ఎవడో వచ్చి ఏమో చెయ్యాలని ఇంకా ఎంత కాలము మనము ఆలోచిస్తాము? మన రాష్ట్రంలో ఏమి జరిగితే వారికెందుకు వారు దేశాన్ని ఎప్పుడో వదిలి వెళ్ళిపొయినారు ఏదో సోషల్ నెట్వర్కింగు కోసం తెలుగు జాతి అని చెప్పుకుంటారు వారికి కావలసింది వారి భద్రత, వారి పిల్లల భవిష్యత్తు అమెరికాలో ఆ దిశగా బాగానే వెళ్తున్నారు కదా.
అమెరికా రాజకీయాలలో దూరడం మనకు తప్పులేదు,కానీ పక్క జిల్ల్లా వాడికి మాత్రం పనిచేసుకోడానికే సవాలక్ష రూల్లు కదా? ఇదే రెండు నాల్కలంటే మరి :-)
తానా వాడు విత్తనాలు కొనక్కరలేదు, తెలుగు వాళ్ళు కొంటే చాలు. మన రాష్ట్రంలో ఏది జరిగినా వారికవసరం లేనప్పుడు హైదరాబాదులో తొంభై శాతం భూమి ఇప్పుడు వారి చేతుల్లో ఎందుకుంది? ఎందుకుండాలి? ఎన్నారై రాయతీలు ఎందుకు?
వారు బాగానే వెళ్తున్నారు కదా అన్నారు...బాగా వున్న వాడినే ఏదైనా చెయ్యమనేది. అమెరికాలో అడుక్కునే వాడిని ఇక్కడ రైతులకు ఎందుకు సాయం చెయ్యమంటాం?
దీనిబట్టి మీకోవిషయం అర్ధమయ్యింటుంది..ప్రవాసాంధ్రులకు, ఆంధ్రులకు పెద్ద తేడా ఏమీలేదని..మనీ సినిమాలో కోట అన్నట్టు సేం పీపుల్, సేం కాస్ట్స్ సేం టు సేం పాలిటిక్స్ ఓన్లీ ప్లేసేస్ డిఫరెంట్. ఒక "అగ్ర" కులం తానా జెండా ఎత్తుకుంటే ఇంకో "అగ్ర" కులం ఆటా అన్నది. జండా లెత్తారుగా..తర్కబద్ధమైన పర్యవసానంగా (లాజికల్ కాన్సీక్వెన్స్) ఇక రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారంతే..
వీళ్లకి ఆంధ్రలో లాగే మనుషులూ పట్టరూ..భాషా పట్టదు..
హైదరాబాదులో భూమి..వ్యాపారం స్వామీ..రేప్పొద్దున టింబక్టూలో భూమికి బాగా గీరాకీ పెరిగే అవకాశముందనుకుంటే అక్కడా కొంటారు..అందులో తప్పేమీ లేదు..ప్రవాసులకు రాయితీలు ఇవ్వాలా లేదా అన్నది రాష్ట్ర ప్రబుత్వ ఆర్ధిక నిర్ణయం..సరికాదానిపిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ...??? విత్తనాలు కొనివ్వగల సత్తా ఉన్నవాళ్లు ఆంధ్రలో లేరా??
అంతా బాగానే వుంది కానీ,
"సిలికానాంధ్ర లాంటి సంస్థలు ఎలాగు మన రాజకీయనాయకులకు పట్టవు." అనగా మీ ఉద్దేశ్యమేమై ఉంటుందీ అన్నది ఆలోచనకు అందలేదు. మీకు వీలైతే వివరించగలరు.
గిరి
అంతా బాగానే వుంది కానీ,
"సిలికానాంధ్ర లాంటి సంస్థలు ఎలాగు మన రాజకీయనాయకులకు పట్టవు."
అనగా మీ ఉద్దేశ్యమేమై ఉంటుందీ అన్నది ఆలోచనకు అందలేదు. మీకు వీలైతే వివరించగలరు.
గిరి
Nice comments andi..
meeku Association ane word ki definition telusu anukuntanu!.
Inka pote valla service gurinchi annaru kadaa, adi kuda Association objectives ni achive chesede.
Those are ppl who are ambitious and we should appreciate that.
మరి కొన్ని నెల్లల్లో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, ప్రవాసాంధ్రుల ఓట్ల కోసం క్లింటన్ ఈ సభలకు రావడంలో పెద్ద వింతేమీ లేదు. అందునా పిలిచి మిలియన్ డాలర్ల ఎలక్షన్ ఫండ్ ఇస్తామమంటే ఎవరైనా ఎందుకు వద్దంటారు?
క్లింటన్ రాక ను చూసి తానా సభ్యులు ఇంతలా పులకించిపోయి, రోజూ తెలుగు పత్రికల్లో అంతంత పెద్ద అడ్వర్టైస్మెంట్లు ఎందుకు ఇస్తున్నారో అర్ధం కాదు...
పైగా "క్లింటన్ గారికి షేక్ హాండ్ ఇవ్వడానికి మా పిల్లలు ఎన్నాళ్లుగానో ఉవ్విళ్లూరుతున్నారంటూ" చెప్పుకోవడం.
పిల్లలకు ఏ విశయం లోనయినా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వగల మనిషేనా క్లింటన్?
పిల్లలకు ఏ విశయం లోనయినా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వగల మనిషేనా క్లింటన్???
why not ? a millionaire cricketer who wants tax exemption for his car, a movie badshah declaring as poor farmer, a movie star involved in land scams, a software giant who advises nothing but corporatizing every thing in india, a national level heroine who says nepal is in india, a narcisistic top notch biology researcher, positive mind set highly corrupted ex/would be chief minister .... aren't these our icons ?
Btw, you forgot that US lives on celebrity culture (read paris, spears, lohan's ). NRIs are no better.
Dil గారిలా అన్నారు:
పిల్లలకు ఏ విశయం లోనయినా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వగల మనిషేనా క్లింటన్?
నేనడుగుతున్నాను:
ఎందుకు కాదు? క్లింటన్ లో అన్నీ నెగెటివ్ లేనా? పిల్లలు నేర్చుకోదగ్గ పాజిటివ్ అంశాలు లేవా?
క్లింటన్ ఇన్స్పిరేషన్ (ప్రేరణ) కలిగించే వ్యక్తి కాదని మీరెలా చెప్పగలరు?
Giri
సుధాకర్ గారు,
నేను మీ తొ ఏకీభవిస్తున్నాను. తానా, రాను రాను ఒక కుల సంఘం క్రింద తయారు అవుతుంది. ఈ సంవత్సర తానా సభలు తెలుగు సభలు గా కాకుండా,తెలుగుదేశం పార్టీ అమెరికా మహనాడు క్రింద తయరు అయ్యాయి.
తానాని అమెరికా తెలుగ్వాళ్ళని తప్పు పట్టడం ఫేషనల్లే ఉంది. ఈ టపాలోనూ కొన్ని వ్యాఖ్యల్లోనూ లేవనెత్తిన ఫిర్యాదులకి కారణమైన వ్యక్తులతో సందర్భాలతో నాకు కొంత పరిచయం ఉంది కాబట్టి ఈ కింది విషయాలు నేను గట్టిగానే చెప్పగలను.
1. తానా సమాజ సేవ - తానా ఫౌండేషను ద్వారా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివరాలు తానా పత్రిక ఏ సంచికలోనైనా చూడచ్చు. లేదా తానా ఫౌండేషను సభ్యులకి రాయొచ్చు.
2. క్లింటన్ని తానా సభలకి తీసుకురావడం ఒక వ్యక్తి కన్న కల. మిల్యన్ డాలర్లు పోగు చేసి ఇవ్వడం (అంతా ఆవిడ ఎన్నికల నిధికి ఇవ్వడానికి ఇక్కడి ఎన్నికల నియమాలు ఒప్పుకోవనుకుంటా) ఇతరుల ప్రమేయం సహాయం కొంత ఉండొచ్చు గానీ ఇది ముఖ్యంగా కాట్రగడ్డ కృష్ణ ప్రసాదు గారి వ్యక్తిగత కల. తానా ఒక వేదిక ఐంది అంతే.
3. ఎవరో అన్నట్టు మనమంతా సెలెబ్రిటీ మాయా ప్రపంచంలో బతుకుతున్నాం. క్లింటన్ అందుబాటులో ఉంటే డబ్బిచ్చి మరీ ఆయనతో షేకాండిస్తున్నట్టు ఫొటో దిగడం మనవాళ్ళకి వేలం వెర్రి ఐతే దానికి కృష్ణప్రసాద్ బాధ్యులు కారు.
4. సదరు కృష్ణప్రసాద్ తమ స్వగ్రామంలో తన స్వంత ఖర్చుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా రైతులకి ఉపయోగపడేట్టు ఇంటర్నెట్ మరియు ఇతర సదుపాయాలు కల్పించారు. ఈ పనుల గురించి ఆంధ్రజ్యోతిలోనూ, ఈనాడులోనూ ప్రముఖంగా రాశారు.
విమర్శ వొద్దనడం లేదు - దేన్ని విమర్శిస్తున్నామో పూర్వాపరాలు తెలుసుకుని చెయ్యడం విజ్నత.
దిల్ గారి ప్రశ్న:పిల్లలకు ఏ విశయం లోనయినా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వగల మనిషేనా క్లింటన్?
మనోళ్ళ వేలం వెర్రి పక్కన పెట్టండి - అధ్యక్షునిగా గద్దె దిగినాక సభలలో మాట్లాడేందుకు ఒకసారికి లక్ష డాలర్ల ఫీజులిచ్చి తీసుకెళ్తున్నారు కార్పొరేట్లు, విశ్వవిద్యాలయాలు, స్వఛ్ఛంద సంస్థలు, విదేశాల్లో కూడా. మరా మనిషిలో ఏదో విశేషం ఉందనేగా అర్థం!
అమెరికా తెలుగోల్లని తప్పుపట్టటం ఫ్యాషన్లా కనిపిస్తే...
౦౧. క్లింటన్ని తెలుగు వారి సభలకు తీసుకురావటం ?
౦౨. ఇలియానా లాంటి నాట్యగత్తెలు(అభినయం పక్కనుంచితే)ఆహ్వానం అందుకోవటం? (భారీ డబ్బులుచ్చుకుని మరీ)
౦౩. తెలుగు సినిమా రంగం అతివీర దరిద్రంగా వున్న ఈ తరుణంలో వీర విహారంగా బిరుదులు ? (ఇదీ కలేనా...)
౦౪. అతి కష్టంగా ముద్దు ముద్దుగా అక్కడక్కడా తెలుగు మాట్లాడటం?
ఫ్యాషనా కాదా అనేటపుడు, ఒక్క సారి ఆలోచించి, అసలు ఎందుకు మొదలయింది, ఏమి చేస్తున్నారు అనేది ఆలోచించండి. ఆ మాటకొస్తే ఆంధ్ర ప్రజలు అమెరికా తెలుగోల్ల నుంచి ఏదైన ఆశించటం కూడా తప్పే..కానీ పేరులో తెలుగు పెట్టుకుని పక్కా అమెరికా పనులు చేస్తేనే మండేది. మా ఇండియా తెలుగోల్లకు క్లింటనంటే అంత ఇదేం లేదు లెండి. మాకు కలలో కూడా అతను రాడు...మోనికాని అడగండి, బహుశా అవిడకి ఇంకా వస్తుండొచ్చు...
వ్యక్తులను మీరు అనవసరంగా ఇందులోకి లాగేరేమో? అతని వ్యక్తిగత కలకి, క్లింటన్ తో ఫోటో దిగాలనుకునే అమాయక పిచ్చోల్లని బలిచేయటం ఎందుకు? అతనే ఆ మిలియన్ డాలర్లు ఇవ్వొచ్చుగా? తానా వ్యక్తిగతాలకు అతీతం కాదా?
ఇక దిల్ గారి వ్యాఖ్యలకు మీ వ్యాఖ్య సమంజసంగానే వుంది గానీ కొద్దిగా బేస్ లెస్ గా వుంది..ఏ చీరల దుకాణం ప్రారంభమయినా హీరోయిలు ఒక ముగ్గురు రడీగా వుంటారు...ఒకొక్కరికి పది లక్షలు ఇచ్చుకోవాలి. ఏ సినిమాలు లేని హీరోయిన్లను కూడా తీసుకెల్తున్నారు...అంటే వారిలో ఏదో విశేషం వుందనా?
హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్ష పదవిలో లేకపోతే ఎవ్వడూ మన బిల్ గారి మొహం కూడా చూడడు...అదీ సంగతి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు ? :-)
వ్యక్తిగతం - అవును, బహుశా అతని పేరు చెప్పకుండా నా పై వ్యాఖ్య రాసి ఉండొచ్చు. చెప్పిన విషయంలో రహస్యమేంఈ లేదు కాబట్టి పేరు చెప్పాను. భారతీయ కేంద్ర ప్రభుత్వమూ, అమెరికా ఫెడరల్ ప్రభుత్వమూ వ్యక్తిగతాలకి అతీతం కానప్పుడు తానా వంటి చిన్న వ్యవహారాలు, వ్యక్తిగత దాతల దాతృత్వం మీద ఆధారపడి బతికే వ్యవస్థలు వ్యక్తిగతం కాకూడదని ఆశించడం అత్యాశే.
బట్టల షాపుల ప్రారంభోత్సవాలకీ మిషిగన్ విశ్వవిద్యాలయంలో స్నాతకోపన్యాసం ఇవ్వడానికీ చాలా తేడా ఉందనుకుంటున్నాను. తానా సభలో ఇచ్చిన ఉపన్యాసం గురించి కూడా బాగా మాట్లాడేడనే విన్నాను.
క్లింటన్ పాప్యులారిటీ విషయంలో మీరు పొరబడ్డారనుకూంటాను.
క్లింటన్ హ్యాండ్ షేక్ గురించి చదివినపుడు ఓ సంగతి గుర్తొచ్చింది. అధ్యక్షుడిగా ఆయన భారత్ వచ్చినపుడు మన పార్లమెంటు నుద్దేశించి మాట్టాడాడు. ఆరోజు ఆయన హ్యాండ్ షేక్ కోసం మన ఎంపీలు తోపులాడుకున్నారు. ఫోటోలూ వచ్చాయి పేపర్లలో!
మొదటగా మిలియెన్ డాలర్లు నాలుగు కోట్లే నలభై కోట్లు కాదు.
కాట్రగడ్డ సోదరులు తానా వేదిక మీద చెప్పారు తెలుగు వాడు ప్రెసిడెంట్ అవ్వాలని. ఆయన మాట్లాడినప్పుడు నాకు ఎబ్బెట్టుగా అనిపించింది. ఎందుకంటే అది జరగాలంటే ఇంకె వందేళ్ళు పట్టోచ్చు (ఆర్నాల్డ్, ఆస్ట్రియా వాడు కాలిఫోర్నియా గవర్నరు). ఇప్పుడు కొత్తపాళి గారి చెప్పిన తరువాత అర్థమయింది ఆయనెవరో అని వారి ఊరికోసం చాలా అభివృద్ది కార్యక్రమాలు చేశారు. ఇంకా చెయ్యొచ్చు కూడా.
ఇప్పుడు పరిస్థితులెలా వున్నాయంటే ఎవడు మంచి వాడు అన్నది కాదు ముఖ్యం. ఎవడు తక్కువ చెడ్డ వాడు అన్నది ముఖ్యం. ఇక్కడ సంపాదించిన డాలర్లు ఎక్కడా ఎవ్వరి జీవితాలను నాశనం చేసి సంపాదించినవి కాదు ఇండియాలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు లాగా. వీళ్ళ డబ్బును ఎన్నింటికో వినియోగిస్తారు ఇలాంటి విరాళాలతో సహా.
ఎన్నారైలు కేవలం సంస్కృతినే కాపాడటం కాదు వారి సొంత దేశాలకు కూడా సాయపడొచ్చు, సాయపడుతారు, సాయప్డుతున్నారు కూడా. తానా, ఆటాలు ఎంతో కొంత రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూనే వున్నాయి. సిలికానాంధ్ర లాంటివి ఎక్కువగా సాహితీ సంస్కృతిక కార్యకలాపాలకు సాయ పడతాయి. ప్రతిదీ వాటి పరిధి లో చేస్తున్నాయి.
ఇక క్లింటన్ విషయానికొస్తే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పార్లమెంటులో పందుల్లాగా తోసుకున్న జనాలు కొందరు. ఒక ఆడ ఎం.పి. "క్లింటనుకు ఇచ్చిన ఈ షేక్ హ్యండును నేను వారం రోజుల దాకా కడుక్కోను" అని స్టేట్మెంట్. ఇంకో సినీ నటి ఎం.పి. కూడా "క్లింటన్ స్పర్శ తో నా చేతికి జన్మ ధన్యమైంది" అని ఒక స్టేట్మెంట్.
సుధాకర్ గారు,
ముందుగా, హిల్లరి క్లింటన్ దేశాధ్యక్ష పదవిలో లేరు, కేవలం ఇంకా ఎలక్షను ప్రైమరి రేసు లోనే వున్నారు. ఈ ఎలక్షను రేసుకి, బిల్ క్లింటన్ పాపులారిటి కి సంబంధం లేదు. క్లింటన్ ఉపన్యాసాల కోసం ఎన్నో పేరుపొందిన యూనివర్సిటీలు, విద్యార్ధులు ఆహ్వానిస్తారు. చీరల దుకాణాలకు, ఈ యూనివర్సిటీలకు పోలిక పెట్టటం మీ వంటి పెద్దలకు తగదు.
ఇకపోతే,తానా సభలో క్రిష్ణ ప్రసాద్ గారు ఇచ్చిన మిలియన్ డాలర్లు క్లింటన్ సొంతానికో, ఎలక్షనులకో కాదు. క్లింటన్ ఫౌండేషన్ కోసం. ఒక మంచి పని కోసం.
విహారి గారు అన్నట్లు, ఈ డబ్బులు ఈ భూ ఆక్రమణ లోనో, కాంట్రాక్టుల వాటాలలోనో, అక్రమ వ్యాపారాల లోనొ సంపాదించినది కాదు. అమెరికా లో వున్న తెలుగు వారు, కొందరు సొంతంగా, మరి కొందరు వివిధ సంఘాల ద్వారా మాతృ దేశానికి ఎంతోకొంత సాయం చేస్తున్నారు.
అమెరికా లో వున్న వివిధ తెలుగు వారి సంఘాలు, ఫౌండేషనులు, వారు చేస్తున్న పనులు గురించి గుగుల్ లో ఒక గ్రూప్ మొదలుపెట్టి చర్చించితే బాగుంటుంది.
విహారి గారు,
తెలుగు వాడు అమెరికా దేశాక్షుడు అవటం అన్నది వినటానికి ఎబీట్టుగాను, నవ్వులాట గానే వుండవచ్చు, కాని ఆ దిశలో అడుగులు మొదలు పెడితే కనీసం సెనేటర్లు గానో, గవర్నరు గానో చేరుకోవచ్చు కదా.
-నేనుసైతం
Every thing starts with one single step. When they are American citizens, they have the complete right to contest for any political position, unlike Sonia Gandhi who refused to take Indian Citizen ship and wanted to be a Prime Minister.
And why should TANA worry about seeds to the farmers. Why the present Government can not provide it. Why can't it give the permission for industries as quick as they did it for Cuddapah Steel plant. It is all politics. If any Government is serious and sincere about farmers, we would not be having these many deaths in farmer community. TDP neglected farmers and Congress is cheating farmers as usual
I am not a member of TANA and I haven’t attended TANA.
I really think there is tons of positive outcome from TANA meet.
TDP leader clearly mentioned its not a political ground and made not a single political comment. They did collected huge amount of money for Cancer hospital trust in Hyderabad.
If some guy donates his own money to some guy's foundation, first of all there is nothing wrong second of all he still did it for a good cause.
A little positive thinking might help here..
Note: A million means four crores not forty crores.
One million dollars ante 4 crores kadandi. 40 ani rasarenti?
Post a Comment