Friday, June 29, 2007

కొత్త ఆపిల్ మొబైల్ - విశేషాలు

ఇంకొన్ని గంటలలో ఆపిల్ తన సరికొత్త సమ్మోహనాస్త్రాన్ని ప్రపంచం మీద ప్రయోగించబోతోంది. ఐపాడ్ తో ఆపిల్ సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. దాదాపు మూసేస్తారేమో అనుకున్న ఆపిల్ కంపనీ ఊపిరి పీల్చుకుని నిలబడటానికి కారణం ఐపాడే. మానవ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగిన సంగీత ఉపకరణం ఐపాడ్ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఐపాడ్ విజయంతో ఊపిరి పీల్చుకున్న ఆపిల్ ఇక మిగిలిన అవకాశాల వైపు దృష్టి సారించింది. ఐఫోన్ తో ఇప్పుడు ముందుకొచ్చింది. ఈ ఐఫోన్ మీద జరిగిన హడావిడి ఇంతా అంతా కాదు. ఈ మధ్య ఒక చిత్రానికి జరిగిన హంగామా స్థాయిలోనే ఇది కూడా జరిగింది.

ఈ రోజు సాయింత్రం ఆరు గంటలకు (పసిఫిక్ కాలమానం) విడుదలవ్వబోయే ఈ ఫోన్ కొనుక్కునేందుకు ఒక న్యూయార్క్ ఆపిల్ దుకాణం ముందర బారులు తీరిన జనాలను చూడండి. మనం అమెరికా వీసాలకు కాన్సులేట్ల ముందర ఒకానొక కాలంలో ఇలా ఎదురు చూసే వాళ్లం కదా? Hee hee.

చిత్రం : ఏ.బీ.సి సౌజన్యంతో

అయితే ముందర ఈ ఐఫోన్ వివరాలు,అది ఎలాంటి సేవలు అందిస్తుందో చూద్దాం...

స్టోరేజీ సామర్ధ్యం : 4 లేదా 8  గిగాబైట్ల ఫ్లాష్ డ్రైవ్
ఫోన్ బ్యాండ్ : జీ.యస్.యమ్ క్వాడ్ బాండ్
టాక్ సమయం : ఎనిమిది గంటలు
స్టాండ్ బై సమయం : రెండు వందల ఏభై గంటలు
ఇంటర్నెట్ సమయం : ఆరు గంటలు
వీడియో సమయం : ఏడు గంటలు
నిర్వహణ వ్యవస్థ : ఓ.యస్.ఎక్స్ (మాక్)|
కెమరా : 2 మెగా పిక్సెల్స్
వైర్లెస్ వ్యవస్థ : వై.ఫీ, ఎడ్జ్, బ్లూ టూత్
శబ్ధ వ్యవస్థ : AAC, MP3, AIFF, WAV
దృశ్య వ్యవస్థ : H.264, M4V, MOV

బరువు : 138 గ్రాములు

 

ఇది పాకెట్ పీసీ స్థాయిలో తయారు చేసిన వినూత్నమైన ఫోన్ లా కనిపిస్తుంది. చాలా తేలికగా, అందరికి అర్ధమయ్యే రీతిలో తయారు చేసిన అందమైన నిర్వహణ వ్యవస్థతో లభించనుంది. దీనిలో ఇప్పటి వరకు ఏ ఫోన్ లో లేని సేవలు ఏమీ పెద్దగా లేవు గానీ ఉన్న వాటినే చాలా ఆకర్షణీయంగా తయారు చేసింది ఆపిల్. ఇప్పటికే పాకెట్ పీసి తెగ వాడిన వారికి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. అయితే దీనిలో వున్న ఐపాడ్ ఈ పరికరానికే ఒక పెద్ద ఆకర్షణ.

ఈ ఫోన్ను, ఇప్పటికే చలామణిలో వున్న ప్రముఖ ఫోన్లతో పోల్చితే

ఇప్పటికి ఈ వివరాలు చాలనుకుంటా :-)

తరువాయి టపాలో అసలు ఐఫోన్ కు అంత సీన్ వుందా? లేదా అనేది రాస్తా...

5 comments:

rākeśvara said...

ఈ మధ్య ఒక సినిమా అంటే శివాజీ నా ?

గిరి Giri said...

చిన్న సవరణ - ఆరు గంటలు పెసిఫిక్ కాదు, ఈస్టన్ టైం

శరత్ said...

తదుపరి టపా కోసం వేచి చూస్తూంటాను..

Anonymous said...

let's practically think that really a mobile require all these features...

And the latest news is about 5+ lakhs of instruments are sold out during the firest week...

What a mad crowd are they ...

raj said...

ఈ ఫోన్ ఇండియా లో ఎప్పుడు release చేస్తున్నారు
ఈ ఫోన్ ఇండియా లో పని చేస్తుందా దీని వేల దాదాపు గా ఎంత ఉంటుంది మీరు ఈ blog creating ki ఏ software వాడారు
నాకు www.quilpad.in/telugu easyఅనిపించింది

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name