సేతుసముద్రం పై చర్చలు, నిరసనలు ఇప్పుడు వూపందుకున్నాయి. సేతు సముద్రం గురించి తరువాత చెప్తా గానీ, ఈ వివాదానికి కారణమైన రామ సేతు (ఆడమ్స్ బ్రిడ్జి) ని గూర్చి మాట్లాడుదాం.
రామ సేతు గురించి తెలియని వాడు భారతదేశంలో ఎవరూ వుండక పోవచ్చు, మతాలతో సంబంధం లేకుండా. మన పురాణాల ప్రకారం సీత ను రక్షించడానికి రాముడు, వానరసేన సహాయంతో లంకకు కట్టిన వారధి ఈ రామ సేతు. సముద్రంపై తేలే బండలతో కట్టినట్లు చెప్తారు కొంతమంది. ఏది ఏమైతేనేం రామాయణ కాలంలో (మూడు లక్షల సంవత్సరాల క్రితం) ఇది కట్టబడింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పాక్ జలసంధి అని పిలుస్తున్నారు.
ప్రస్తుతం మనకు ఇది ఉపగ్రహ చిత్రాల ద్వారా కనిపిస్తుంది. క్రింద చూపబడిన విధంగా…
నమ్మడానికి ఎంత బాగుందో అని పాడుకోవాలనిపిస్తుంది కదా? :-) కానీ నాసా, మన పురావస్తు శాఖ వారితో చేసిన పరిశోధనల ప్రకారం ఈ సేతువు మానవమాత్రులెవరూ నిర్మించినది కాదని, అది కేవలం ఇసుక రాళ్ల సమూహం అని అర్ధం అయ్యింది. అది కూడా కేవలం మూడు వేల ఏళ్ల క్రితం మాత్రమే ఏర్పడినది అని కార్బన్ డేటింగు ద్వారా తేల్చారు.
నాసా అయితే ఏకంగా రామాయణ కాలంలో (మూడు లక్షల ఏభై వేల ఏళ్ల క్రితం) ఈ భూభాగం మీద మానవులు నివసించే ఆధారమేదీ లేదని కొట్టి పారేసారు. హిందు పత్రిక కూడా దీనికి ఆధారాలను ప్రచురించింది. అయితే కొంత మంది శాస్త్రవేత్తలు సైతం రామ సేతు ప్రకృతి పరంగా ఏర్పడినది కాదని, దానిని ఎవరో నిర్మించి వుంటారని వాదిస్తున్నారు
ఈ బ్రిడ్జి దాదాపు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం పాటు వ్యాపించి వుంది. కొన్ని చోట్ల అది సముద్ర తలానికి కేవలం మూడు నుంచి ముప్ఫై మీటర్ల లోతులో మాత్రమే వుంది. దీనివలన ఈ మార్గం గుండా భారీ నౌకలు ప్రయాణించలేవు. ప్రయాణించినా అతి ప్రమాదకరం కూడా. పదిహేనవ శతాబ్ధి వరకూ ఈ సేతువు పై నుంచి కాలి నడకన వెళ్లే విధంగా వుండేదంట. ఆ తరువాత వచ్చిన తుఫానులు, వాతావరణ మార్పులు ఈ మార్గాన్ని కాస్త లోతుగా మార్చివేసాయి.
అయితే ఇప్పుడు ఈ పాక్ జలసంధిని లోతు చెయ్యటం ద్వారా భారీ నౌకలను ఈ ప్ర్రాంతం ద్వారా నడిపించవచ్చని భారత ప్రభుత్వం ఆశ. తద్వారా అరేబియన్ సముద్రం నుంచి హిందు మహ సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలు శ్రీలంకను చుట్టి వెళ్లే బాధ తప్పుతుంది. భారత ప్రభుత్వానికి కూడా చేతినిండా డబ్బులు వస్తాయి. ఈ ప్రాజెక్టు పేరే సేతు సముద్రం ప్రాజెక్టు. దీని వలన దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అంచనా. అంటే దాదాపు ముప్ఫై గంటల ప్రయాణం తగ్గుతుంది.
అయితే ఈ ప్రాజెక్టు వలన ఆ ప్రాంతంలో వున్న పగడపు దీవులు (coral reefs) అన్ని పోతాయి. రామ సేతు పోతుంది. సునామీ వంటివి వస్తే దానిని కొంతవరకు ఆపేది ఈ రామ సేతు నే. ఇప్పుడు అది పోతే ధనుష్కోటిని బట్టలు విప్పి సముద్రపు వొడ్డున నిలబెట్టినట్లు అవుతుంది.
శాస్త్ర పరంగా దీని నిర్మాణాన్ని ఎదుర్కోవటం చాలా మంచిది. మంచి కన్నా చెడు జరిగే సూచనలు ఎక్కువున్నాయి. కానీ భా.జ.పా వంటి పార్టీలు రాముడికి ద్రోహం చేస్తున్నట్లు దీనిని ప్రచారం చేస్తూ ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం వుంది. సెక్యులర్ భావాలను కాలరాసే పార్టీగా దానికి వున్న మచ్చనే ఆయుధంగా చేసుకుని వారు వాదన త్రోసిపుచ్చవచ్చు.
23 comments:
నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. ధన్యవాదాలు సుధాకర్ గారు.
చాలా ఆశక్తి కరమయిన టపా.చాలా బాగుంది.భాజపా వాళ్ల రామ భక్తి మనకి తెలియనిది కాదు కదా.అయినా కృష్ణుడున్నాడని ఈ నాసా వాళ్ళు చెప్పిన తరువాతే మనం నమ్మడం మొదలు పెట్టలేదుకదా.అలాగె ఈ నాసా వాళ్ళే ఇంకొన్నాళ్ళకి మళ్ళా పరిశోధనలు చేసి రాముడూ వుండేవాడని చెపుతారు చూస్తూ వుండండి.ఏది ఏమయినా రాముడిని అడ్డం పెట్టుకున్నా ఏవరిని అడ్డం పెట్టుకున్న అక్కడ రామ సేతు మాత్రం వుండి తీరాలి.
శొధన శోధనే అనిపించారు. చాల మంచి విషయాలు తెలసాయి.
అసలు ఇది రాముడు కట్టలేదు, రావణుడూ కట్టలేదనడానికి మామూలు స్పృహ (Common Sense) చాలనుకుంటా.
రాముడు పది వేల సంవత్సరాలు రాజ్యం చేయడం నిజమైతే ఈ వారధి కట్టడమూ నిజమే.
రాముడు ఎంతమందైనా (అనంతం) పట్టే పుష్ఫక విమానం మీద ప్రయాణించడం నిజమైతే ఈ వారధి కట్టడమూ నిజమే.
రాముడు ఒక బాణంతో 9 మద్దిచెట్లను కూల్చడం నిజమైతే ఇదీ నిజమే.
రావణుడికి 10 తలలు వుండటం నిజమైతే ఇదీ నిజమే.
ఇవన్నీ నమ్ముతున్న వాళ్ళ రాతను నేను మార్చలేను, వారితో వాదన చేసి నా సమయమూ వృధా చేయలేను గానీ...
రావణుడికున్న పుష్పక విమానాన్ని పాపం మయుడు రాముడికీ ఒకటి చేసిస్తే పోయేదిగా?
బండరాళ్ళు మునగకుండా వుండేందుకు తోడ్పడిన సముద్రుడు ఆ పనేదే తనే పక్కకు తొలగి దారిచ్చివుంటే పని సులభంగా అయిపోయేదిగా.
40 కొలోమీటర్ల నిడివి సముద్రంపై వంతెన ఇప్పటి Technology తో వెయ్యాలంటేనే సంవత్సరాలు పడుతుంది మరి వేల ఏళ్ళ కిందట కేవలం కోతులతో అతి మొరటుగా సముద్రాన్ని పూడ్చుకుంటూ వంతెన కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి, అన్ని సంవత్సరాలు ఓపిక పట్టడం రాముడికి సరైనదేనా?
ఇంత బృహత్తర కార్యముతో రామసేతు నిర్మించేబదులు అదేదో చిన్న చిన్న పడవలు తయారు చేసుకొని వెళ్ళి వుండటం ఇంకా సులభమేమొ!
ఇంతాచేసి ఆ సేతువును రాముడు ఒక్కబాణముతో చివరలో పడగొట్టాడట!
నవ్వడమూ మానడమూ ఇక మీవంతు.
--ప్రసాద్
http://blog.charasala.com
లంక అంటే శ్రీలంక కాదు, లంక అంటే భూమధ్య రేఖ, ప్రూఫు: జ్యోతిషం లో లంకోదయ సమయము అని ఇస్తారు అంటె time as at equator అని, అలగే హనుమంతుడు దాటింది apx నూరు యోజనాల దూరము, అది కిలొ మీటర్లలో కి మారిస్తే india, srilanka distance కంటే ఇంకా ఎక్కువ వుంటుంది, కాబట్టి రామాయణం లో చెప్ప బడినది వేరే దీవి అది భూమధ్య రేఖా ప్రాంతం లో వుండేది అనే ఇంకొక వాదన కూడా వుంది. వేరే island వుండిందో లేదో తెలియదు కాని, Distance conversion argument మాత్రం valid అని నా opinion
@ ప్రసాద్ గారు,
మీ comment యొక్క మొదటి వాఖ్యం చదివి అది మీరు వ్రాసారని సరిగా ఊహించా.
Thats the thing about logic, its boringly predictable. As someone once said "give me more imagination".
మన్యవ గారు,
నాకు జ్యోతిష్యం ఎవరు రాసారో పెద్దగా తెలియదు కానీ, లంక భూమధ్యరేఖ మీద వున్నది అనుకుంటే...
౦౧. రామేశ్వరం సంగతి ఏమిటి? అక్కడ రాముడు శివ లింగాన్ని పూజించలేదా?
౦౨. దక్షిణ భారతమంతా కొల్లలుగా చెప్పుకునే "సీత స్నానం చేసింది ఇక్కడే" కధల మాటేమిటి?
౦౩. భూమధ్య రేఖ కు దగ్గరగా వున్న ఏ దేశంలోనూ రామాయణ అవశేషాలు కూడా లేవే?
౦౪. లంక ఎక్కడో వేరొక చోట వుంటే రామాయణాన్ని భారీగా దక్షిణ భారతదేశానికి మోసుకొచ్చింది ఎవరు?
మంచి వ్యాసం...చాల చర్చలకు దారి తీసేట్టుగా, ఆలోచనాత్మకంగా ఉంది.
3 లక్షల ఏళ్ళ క్రితం అసలు మానవుడి మనుగడే లేదు అని నాసా చెప్పడం..అందుకేనేమో రామాయణం నిండా కోతులే ఉంటాయి. నిజంగానే రామాయణం జరిగి అన్ని లక్షల సంవత్సారాలే అయితే మనం ఇప్పుడు నమ్మలేని చాలా నిజాలు అప్పుడు జరిగే ఉంటాయి..అప్పట్లో మనిషి తాడి చెట్టు పరిమాణం లో ఉండటం లాంటివి.అదే అనుకుంటే..ఇప్పుడు మనకి ఏడాది పట్టినట్టుగా అన్ని వేల బలాడ్యులకి ఆ వంతెన నిర్మించడం కేవలం కొన్ని రోజులలో అయిపోయినా అశ్చర్య పోవక్కరలేదు. కాకపోతే ఒక్క బాణంతో కూల్చేయగలిగిన రాముడు, గట్టిగా తన దనుర్విద్యని ప్రదర్శించి వరసగా బాణాలు వేసేసి వాటితోనే చక చక ఒక వంతెన కట్టేసి ఉండొచ్చు కదా....అసలు జరిగిన కధ కు ఇన్ని లక్ష ల సంవత్సరాల కాలంలో బోలెడన్ని కల్పితాలు జత చేరి ఉంటాయి. కాబట్టి రామయణాన్ని మొత్తానికి కొట్టి పారేయలేము. అలా అని అందులో చెప్పిన ప్రతీ వింతనీ నమ్ముతూ కుర్చోలేము..
చాలా సార్లు మనం కరెక్ట్ అనుకొన్నది తప్పౌతుంది. మనకు తెలియని విషయాలను సరైనదని, తప్పని వాదించడం సరికాదు. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. బల్లగుద్ది వాదించడానికి మనమేమన్నా స్వయంగా వెళ్ళి పరిశోధించామా?
మానవ్యగారు, ఖండాలు ఒక్క చోట ఉండకుండా ఉత్తరదిశగా కదులుతున్నాయని తెలియనిది కాదు (continental drift). మరి రామాయణం జరిగినప్పుడు శ్రీలంక నూరు యోజనాల దూరంలో ఉందేమో.
నవీన్ గారి ఆలోచన చాలా బాగుంది. కానీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ వలన ఖండాలు దూరంగా జరిగాయి. దగ్గరగా అవ్వలేదేమో కదా?
విజయ గారు, శాస్త్రం, నాగరికత అభివృధ్ధి చెందుతూ పోతే అద్భుతాలు సాధిస్తున్నాం గానీ, అద్భుతాలు సాధించిన కాలం నుంచి వెనుకకు నడుస్తున్నామంటారా? ఏమో మీరన్నది నిజం కావచ్చు...పిరమిడ్లు (3000 BC) చూస్తే అలానే అనిపిస్తుంది.
పిరమిడ్లౌ కేవలం కొన్ని దినాలలో కట్టారని ఎవరైనా చెప్పగలరా?
అయినా రామాయణంలో చెప్పబడిన ఎన్నో ప్రగల్భాలను వదిలేసి ఒక్క నూరు యోజనాలను మాత్రమే పట్టుకొని లంక అంటే ఈ లంక కాదు ఇంకేక్కడో కనపడని లంక వుంది అంటారేంటి?
ఆంజనేయుడు అదేదో రాక్షసి నోట్లో దూరడానికి ముండు తన శరీరాన్ని నూరు యోజనాల పొడవు పెంచాడట! ఇంకొంచం పెంచి ఈ గట్టు మీదనిలబడి ఆ గట్టుమీద వున్న సీతమ్మ తల్లిని అందుకొని వుండవచ్చును.
లంకాపురమంతా బంగారంతోనూ, వజ్ర, మణులతో నిర్మిత మయివుందట!
ఇవన్నీ చూస్తుంటే వాల్మీకి గారు వాటిని చూసి రాయలేదని ఏదో అలంకారం కోసమో, ఛందస్సు కోసమో, ప్రాస కోసమో నూరు యోజనాలన్నాడని తెలియట్లేదూ! దాన్ని వున్నదున్నట్లే అంగీకరిద్దామా మనం! ఒకవేళ అంగీకరించినా యోజనమంటే ఆ కాలంలో బారనో, మూరనో, జానెడో ఎవరికి తెలుసు?
ఒక్క నూరుయోజనాలను మాత్రం తీసుకొని లేని లంకను వెతికి పట్టుకున్నా సుధాకర్ అడిగినట్లు రామేశ్వరాన్నీ, దండాకారణ్యాన్నీ, గోదావరి నదినీ ఇంకా బొలెడన్ని వస్తు విశేషాలనీ వాటి మద్య దూరాలనీ సవరించాల్సి వస్తుంది. ఇక ఆ పని చేస్తూ కూర్చుంటే రామాయణం కాస్తా గీమాయణం అవుతుంది.
--ప్రసాద్
http://blog.charasala.com
శోధన అంటే ఇది. బొమ్మ టెక్నికల్ అంకాన్ని చక్కగా జోడించింది. సేతు సముద్రం ప్రాజెక్టు అంటే ఏమిటో ఇప్పుడు అర్థం అయ్యింది నాకు. రాముడున్నాడు, రామాయణ కావ్యం అనేవి రెండు వేర్వేరు విషయాలు. పుస్తకాల్లో ఆ కాలంతో పాటు సమన్వయం ఉన్న నమ్మకాలు వ్రాయబడతాయి, ఇప్పటి పరిస్థితులలో మనకు వింతగా అనిపించవచ్చు. ఉదా: రావణుడు పది తలల వాడు అంటే, దానర్థం అది వాడి కెపాసిటీ అని అర్థం (అని నా నమ్మకం) అంతే కానీ నిజంగా పది తలలని అర్థం కాదు. రామాయణ కావ్యం నిండా ఇటువంటివి ఉన్నట్టు తెలుస్తుంది. రామాయణ కావ్యం పండితులు, పామరులు ఇద్దరికీ (వారి కెపాసిటీకి సరిపడ) అర్థం అయ్యే విధంగా వ్రాసి ఉంది అని అనడం నేను విన్నాను.
మీకు ఒక ఉదాహరణ ఇస్తాను: రామదాసు ఈ మధ్య వాడే, ఒకసారి రామదాసు సినిమాను చూడండి మీకు తెలుస్తుంది. ఊహ: కొన్ని వందల సంవత్సరాల తరువాత జనాలు రామదాసు అంతా ట్రాష్. అది అసంభవం, ఇది అసంభవం అని అనక మానరు :)
కొసమెరుపు: తన గత జన్మలన్నీ తెలిసిన (అని నేను నమ్మిన) ఒకాయనను అడిగితే, రాముని కాలంలో అతన్ని స్వయంగా కలుసుకున్నానని చెప్పాడు. హ..హ్హ..హ్హా..
నాగరాజా గారు నా మనస్సులో ఉన్నది చెప్పేశారు. రావణాసురుడికి పది తలలు అంటే...దశ వికారాలు ఉన్నవాడని కూడా అన్వయించుకోవచ్చు. ఏమైనా రామాయణ, మహాభారతాలలో పిండిలో ఉప్పంత నిజమైనా ఉండకపోదు. మనకే అంతా తెలుసు అని మనకు తెలియని విషయాలలో ఒక నిర్ణయానికి రావడం సరికాదు.
సుధాకర్...Continental Drift గురించి ఒక్క ముక్కలో క్రమంగా దూరంగా జరిగాయి అని చెబుతారు. కానీ భూమి గోళాకారంలో ఉండటం చేత Tectonic Plates ఒకే plane లో కాకుండా, కదలిక కూడా గోళాకారంలో ఉంటుంది. లక్షల సంవత్సరాలలో పైకి, క్రిందకి, ప్రక్కలకు వివిధ రకాలుగా జరిగి ఇప్పుడు ఇలా ఉందని చెబుతారు. కాబట్టి ఈ Continental Drift ఒకే రకమైన క్రమ పద్దతిలో జరగలేదు. లక్షల సంవత్సరాలను ఒక్క్సారిగా చూస్తే మనకు ఒక క్రమపద్దతిలో జరిగినట్టనిపిస్తాది. దీని మీద కూడా ఎన్నో వాదోపవాదాలు ఉన్నాయి.
నాగరాజా గారికి వ్రాసిన వ్యాఖ్య మళ్ళీ ఒక్క సారిగా చదివితే కంగారేసింది. నేను క్రింది వ్యాఖ్యలను మామూలుగా అన్నాను..నాగరాజా గారి గురించి కాదు.
--------------------------
"ఏమైనా రామాయణ, మహాభారతాలలో పిండిలో ఉప్పంత నిజమైనా ఉండకపోదు. మనకే అంతా తెలుసు అని మనకు తెలియని విషయాలలో ఒక నిర్ణయానికి రావడం సరికాదు."
సుధాకర్ గారు,
మీ questions లో logic నాకర్థం కావట్లేదు.
రామేశ్వరానికి లంక location కి link ఏమిటి? లంక భూమధ్య రేఖ మీద వుంటే కన్యాకుమారి నుంచి bridge కట్టి వెళ్ళాలనా మీ వుద్దేశం?
భూమధ్యరేఖ దగ్గర island ఒకప్పుడు వుండేదెమో. తరువాత ద్వారక లాగా సముద్రం లో కలిసి పోయి వుండచ్చేమో. (ద్వారక వుందని కని పెట్టారని discovery channel లో చూశా)
రామాయణాన్ని దక్షిణ భారత దేశనికి మోసుకు వచ్చింది లంకేయులు కాదు. మన వ్యాస, వాల్మికుల శిష్యులు.
@మన్యవ గారు
నేను లాజిక్ ఏమీ మాట్లాడలేదండి.ఎందుకంటే నాకు ఈ విషయం గూర్చు అస్సలు ఏమీ తెలియదు. అందువలన...అది అక్కడ వుండేదేమో, ఇక్కడ వుండేదేమో అంటే నాకు అర్ధం కాక మిగతా ప్రశ్నలు అడిగాను. ఇప్పుడున్న శ్రీలంక, మీరు చెప్తున్న లంక ఒకటి కాక పోతే, రామ సేతు రాముడు కట్టనిది అని అర్ధం. ఒక వేళ భూమధ్య రేఖ ప్రాంతంలో వుంటే కాస్త ఎక్కడో (ఖచ్చితంగా కాక పోయినా) మాప్ లో చూపించండి. భౌగోళికంగా అది రామాయణం లో చెప్పిన అంశాలకు సరిపోవాలి కదా?
ఏదో "లంకోదయ సమయము" అని వున్నంత మాత్రాన అది ఈ లంక అని అర్ధం ఏమిటి? ప్రపంచంలో ఎన్నో లంకలున్నాయి. గోదావరి తీరాన చాలా వున్నాయలా అనుకుంటే.
ఇప్పటి సాంఘిక నవల రాయాలన్నా లేక ఓ సినిమా తీయాలన్నా బోలెడన్ని నియమాలు వుండాలి. వుదాహరణకు అమెరికాలో వున్న హీరో, ఇండియాలో వున్న అమ్మాయితో ఒకే గదిలో ఒకే సమయంలో వుండటం అసాద్యం గనుక ఆపని జరిగినట్లు ఆధునిక నవలలో గానీ సినిమాలో గానీ చూపించలేం. అలాగే విమానంలో అంట్లాంటిక్ సముద్రంపై ఎగురుతున్న హీరో సముద్ర గర్భాన ప్రమాదంలో పడిన అమాయకున్ని రక్షించడమూ కష్టము. ఎందుకంటే అనుల్లంఘనీయ ప్రకృతి సూత్రాలకు చివరికి కల్పన అయిన నవలైనా సినిమా అయినా కట్టుబడాల్సిందే.
అయితే గాలి పురాణాలకు ఇవన్నీ అవసరం లేదు. కృష్ణుడు 16 వేల మంది గోపికలతో ఒకేసారి ఒకే సమయం లో కులికాడన్నా, రాముడు లంకకు సేతువు కట్టాడన్నా, అర్జుణుడు స్వర్గానికి బాణాలతో నిచ్చెన వేశాడన్నా, హనుమంతుడు వంద యోజనాలు పెరిగాడన్నా.. దేనికీ లాజిక్కు అవసరం లేదు. ఎలాంటి నియమాలకీ కట్టుబడని ఇలాంటి కథల్లో లాజిక్కు వెతకడం, వాటిని బట్టి ఏవో నిర్దారణలు చెయ్యడం అంతా జోకు.
--ప్రసాద్
http://blog.charasala.com
ఈ చర్చ చూస్తే, ఈ కేసు ద్వారా హిందువుల్లో అయోమయం సృష్టించటనికే అని సందేహం కలుగుతోంది. కన్వర్టర్ల పంట పండినట్టే
రామాయణం జరిగింది అనడానికి ఆధారాలు మన 18 పురాణాలు,ఉపనిషత్తులు,ఉప పురాణాలు.
కొన్ని యుగాల నాడు జరిగిన దానికి "పురావస్తు శాఖ" వారికి అనుగుణం గా,మన న్యాయ స్థానాలలో నిర్ధారణ చెయ్యడం కష్టం
రామాయణం వర్ణించిన లంక శ్రీలంక అవచ్చు,కాకనూ పొవచ్చు
సముద్ర గర్భం లో కలిసి పోయుండవచ్చు
కొన్ని యుగాలుగా మనల్ని నడిపించడం లో రామాయణం పాత్ర ఎంతో ఉంది
మనకున్న ప్రతి నమ్మకానికీ నిర్ధారణ ఉండదు.
రాముడు ఇంజనీరా కాదా వగైరా ప్రశ్నలన్ని అసంధర్భం
ఈ పురాణాలు వగైరా అంతా ఉత్తుత్త అంటే "మన రాజ్యాంగం లో రామాయణ ప్రస్థావన తీసెయ్యాలి"
మహాత్ముడి సమధి మీద ఉన్న "హే రాం" తొలగించాలి
ఉండకోపనిషత్తు నుంచీ స్వీకరించిన "సత్యమేవ జయతే" అన్నది రద్దు చెయ్యాలి కదా.......
మీతో ఏకీభవిస్తున్నాను లలిత గారు. మతం అంటేనే నమ్మకాలమయం, ప్రతీ దానిని నిరూపించాలంటే చాలా కష్టం. అంతెందుకు పుట్టపర్తి బాబా నోటి నుంచి బంగారం లింగం ఎలా వస్తుందో అతను చెప్పరు, ఇంకొకరిని పరీక్షంచనివ్వరు. అలా అని అతనిని విమర్శించలేం. ఎందుకంతే చాలా మంది అతనిని నమ్ముతున్నారు. నాకు మాత్రం ఎవరూ రాముడు అనే రాజు ఉనికిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఆ మాటకొస్తే జీసస్ చేసిన మహిమలకు, అల్లాకూ రుజువులు లేవు. ప్రస్తుతానికి మనకు రుజువులు వున్నవి బుద్ధుడి రుజువులే.
ఈ ఇంజనీరా కాదా అని అడిగినాయనకు కొద్దిగా మతిస్థిమితం తక్కువ. కాబట్టి వదిలెయ్యండి. తమిళ సోదరులు అతని పని చూసుకుంటారు.
ఈ చర్చలో వేలుపెట్టకూడదనుకున్నాను కానీ చేతులు నెప్పెడుతున్నాయి..
శొధనగారన్నట్టు రామాయణముందా రాముడున్నాడా ఇలాంటివి వాటని గురించి తర్కించడం శుద్ధ దండగ..రాముడుంటే ఏంటి? లేకుంటే ఏంటి? రామాయణంలోని మంచిని గ్రహించి ఆచరించండి అని అనుకోవాలికానీ రేపొద్దున దారినపొయ్యేవాళ్ళు రాముడు లేడు అంటే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాం.
ప్రసాదు గారూ, మనముకు తెలియనివి మనకు తెలియవు అంతే! (ఇన్ఫ్రారెడ్ రేస్ ఎలా ఉంటాయి చెప్పండి చూద్దాం). flatearth లో జనాలకు ఐదువేళ్ళూ ఐదు బిందువులుగా కనిపించినపుడు అవి ఒకే చేతికి చెందినవని ఎలా చెప్పగలం?
బుద్దుడి జననంలో కూడా ప్రస్తుత మానవ జ్ఞానంతో రుజువుచెయ్యలేని విషయాలు చాలా ఉన్నాయి. థామస్ జెఫర్సన్ బైబిల్లోని మహిమలున్న భాగాల్ని కత్తరించేసి సొంత బైబిల్ను వ్రాసుకున్నాడు.
ఇక సేతువు విషయానికోస్తే సేతువు తెగకుండా కాలువ నిర్మించే ప్రతిపాదనలు ౬౦వ దశకములోనే వచ్చాయి.
సవరణ: పైన నేను చేసిన వ్యాఖ్యలో flatearth బదులు flatland అని చుదువుకోగలరు
Post a Comment