Tuesday, May 22, 2007

బోడి నిర్దారణ కమిటీలు.. వాటి కార్యక్రమాలు

ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూడండి. కొంత మంది పని లేని వాళ్లు ప్రతీ విషయాన్ని పచ్చి వ్యతిరేకవాదంలో చూస్తు, బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారో చదవండి.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/may/21new40

వారు పెట్టుకున్న కమిటీ పేరు "నిజ నిర్దారణ కమిటీ". అలాంటప్పుడు వారు తమ శక్తి యుక్తులను నిజాన్ని కనుక్కోవటంలో పెడితే మంచిది. అంతే గానీ ఇలా వ్యర్ధ ప్రసంగాలకు దిగి వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టనక్కరలేదు. ఇలాంటి మాటలు చాలా చెత్తగా సమాజం మీద ప్రభావం చూపిస్తాయి. టీ కొట్టులో హాయిగా చాయ్ తాగుతున్న ఇద్దరు ముస్లిం - హిందు మిత్రులు ఇది చదివి వాదించుకుని విడిపోయినా పోవచ్చు.

ఏ ముస్లిం అయినా మసీదులో బాంబు పెట్టుకోడు అని ఎలా నిర్ణయించేసారు ?. దానికేమైనా నిర్ద్గారణ వున్నదా? ఆ మాట కొస్తే ఏ నిజమైన ముస్లిం కూడా టెర్రరిజాన్ని పవిత్రయుద్ధంగా సమర్దించడు. తీవ్ర వాద ఇస్లామిక్ పార్టీలు చేస్తున్న మారణకాండను సమర్ధించడు. కానీ రక్తపాతాన్ని, దేశ స్థిరత్వాన్ని దెబ్బ తీయాలంటే తీవ్ర వాదులు ఎక్కడైనా పెడతారు బాంబులు. 9/11 దాడిలో చాలా మంది ముస్లింలు టవర్స్ లో ప్రాణాలు వదిలారు. అది ఏమైనా లాడెన్ కు తోచిందా?

ఇక ఇది చదవండి http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/may/21main8

ఛాందసవాదం ఎక్కువైతే మతాలతో సంభంధం లేదు. ఎవరైనా ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తారు. ఎలాంటి పనులైనా చేస్తారు.

ఇక హిందూ మతోన్మాదులు సంగతి. ఈ మధ్య వీరు కొద్దిగా ఎక్కువగానే తయారయ్యారు. కానీ ఒక తీవ్రవాద గుంపు స్థాయిలో ఎక్కడా తయారయ్యారా అనేది తేల్చాల్సివుంది. ఒక వేళ వీరే ఆ పని చేస్తే దొరికిన సిమ్ కార్డు నుంచి దుబాయి, మలేషియా ఎందుకు కాల్స్ వెళ్లాయో తేల్చాలి.

ఇదంతా వదిలేస్తే అనుమానిస్తున్న "షాహెద్ బిలాల్" ఏమీ ఐస్ ఫ్రూట్ తినే అమాయకుడు కాదు. చాలా మంచి పోలిస్ రికార్డులున్నాయి.

నిజ నిర్ధారణ కమిటీలు, తొక్కలో దివిటీలు అన్నీ నిజం మీద దృష్టి పెడితే మంచిది. లేకపోతే ప్రభుత్వాలకు మళ్లే వీరు కూడా అమాయక జనాలను తప్పు దోవ పట్టిస్తునే వుంటారు వారి మార్గంలో. అది సమాజానికి ప్రమాదకరం.

మొన్న సద్దాం ను ఎక్కాడికో ఎత్తేసారు. అఫ్జల్ కు వురి పడలేదు…ఏమవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు షాహెద్ బిలాల్. రేపు అమెరికా లాడెన్ పట్టుకుని చంపేస్తే ? అప్పుడూ లాడెన్ మీద కవితలు రాసేసి..అమెరికన్లే ట్విన్ టవర్స్ కూల్చేసి లాడెన్ మీద పడ్డారంటారేమో?

మొత్తానికి ఐటమ్ లాంటి జనాలు వున్నారు మనకు.

9 comments:

Anonymous said...

వీళ్ళకి ఏమీ పనీ పాటా ఉనట్టు లేవు ..

మొన్నటి వరకూ హ్యూమన్ రైట్స్ .. తొక్కా .. తోలూ అంటూ నకల్స్ ని వెనకేసుకొచ్చారు .. వాళ్ళు కాస్తా రాష్ట్రం వదిలి పారిపోవడం తో ఇక్కడ్కొచ్చి తగలడ్డారు ....

అసలు నాకో doubt . ఇలాంటి బేవార్స్ బాచ్ అంతా "మేధావుల సభ" అంటూ బోర్డులు పెట్టు కొని మీటింగులెట్టుకుంటారు ... అయినా వీళ్ళు మేధావులేంటి ??

Anonymous said...

I don't think there is anything irresponsible about what the fact finding committee has said. The first thing that came to my mind when the news channels said (the very next day after the bomb blasts) that a muslim terrorist organisation is responsible for the Hyd bomb blast is that 'why would a muslim terrorist organisation bomb a mosque? If their hands are itching, they would do something in a temple but not in a mosque.' This doesn't need an intellectual to figure out.

I can't imagine how horrible the situation is for the muslim community in the Hyd old city to be the victims and be blamed for the bombing. And then being shot down by the police. The number of persons shot down by the police for 'shanti bhadratala parirakshana' is more than the number who died in bomb blasts.

No wonder the muslims never feel secure being a minority.

My heart goes out to the victims of the bomb blasts and I don't believe it has been done by a muslim terrorist organisation. I wish the government could come up with better lies.

Chaitanya

Sudhakar said...

నాణేనికి రెండు వైపులా వున్నట్లే వివిధ రకాల జనాలు వుంటార్లెండి. అందులో తప్పులేదు. అయితే మనం ఇక ప్రభుత్వ పరి్శోధన పూర్తి అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే.

చైతన్య గారు, మీకు వచ్చిన అనుమానమే నాకూ వచ్చింది . అయితే కరక్టుగా అదే భావనను క్యాష్ చేసుకోవాలని దుండగులు అనుకోవచ్చు కదా? చంపాలనుకునే వాడికి, దైవ భీతి, మానవత్వం వుంటాయా అనిపించింది.

Anonymous said...

శోధన గారు,

మీరు అన్నది నిజమే, చంపేవాడికి మానవత్వం, దైవభీతి ఉండవు. కాని ఇక్కడ చంపేవాడుగా అనబడేవాడు మామూలు ముస్లిములు కూడా కాదు. ముస్లిం ఫండమెంటలిస్టులు, వాళ్లు ఈ లోకంలో నమ్మేదే అల్లాని, ఖురాన్ ని, మస్జీద్ ని. దానికోసమే వాళ్లు టెర్రరిస్టులుగా మారినరు. అట్లాంటి వాళ్లు వాళ్ల ప్రార్థన స్థలాన్ని బాంబ్ చేస్తారంటే నమ్మశక్యంగా లేదు.

చైతన్య

Japes said...

గాలిబ్ అన్నట్టు "ఏక్ డూంఢో హజారో మిల్ జాయెంగే" అన్నట్టు ఐటంల కోసం ఏడికో పోవాల్సిన పనిలేదు. ఐటంలను మేధావులను కొంచంసేపు పక్కన పెట్టి, మనం ఉంటున్న కూపస్థాల నుంచి కొంచం బయిటికి వచ్చి చూద్దాం....

"... వారు పెట్టుకున్న కమిటీ పేరు 'నిజ నిర్దారణ కమిటీ'. అలాంటప్పుడు వారు తమ శక్తి యుక్తులను నిజాన్ని కనుక్కోవటంలో పెడితే మంచిది... " ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలె... చాల మందికి తెలువని (తెలిసినా ఒప్పుకోని జీ.ఓ ఒక్కటున్నది అదే 610) ... జీ.ఓ 610 అమలుఎంతవరకు వచ్చిందో నిర్దారణ చెయ్యమని (మనమంతా గౌరవించే) సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తే... ఆంధ్రప్రదేశ్ ల ఉన్న (జీ.ఓ 610 ను గౌరవించని) సర్కారు ఉద్యోగులంతా ముక్కుమ్మడిగ సహాయనిరాకరణ చేసినరు... అంత శక్తివంతమైన ఒక 'సెంట్రల్ కమిటీ'నే ఇన్ని ముప్పుతిప్పలు పెడితె ... ఓనలుగురిని (మీ ఉద్దేశ్యంల మేధావులు కానీవాల్లు) ఏం ముందుకు పోనిస్తరు?

Post 9/11 తరువాత వచ్చిన చాల over rated వాఖ్యం 'either you are with us, or with the terrorists' ... దానికన్నా ఘోరమైన, మనకు (దాదాపు ప్రపంచంలోని సామాన్య, బీద, మధ్య తరగతి ప్రజలకు) ఉన్న పెద్ద పాడు అలవాటు (లేదా శాపం అనొచ్చు)...Government hierarchy ని గుడ్డిగా నమ్మి, గడ్డితిన్నవాడు చెప్పేవే నిజాలుగా భావించి (ఆ మాట నెగ్గించుకోనీకి ఒక చెయ్యోకాలో కూడ అర్పించుకోగల సమర్థులం) ... ఎవరో పెద్దమనిషి అన్నడు 'Governments lie' అని... ఎందుకో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరంలేదు...

ఒక్క సారి మన political / personal ideologies అన్నీ పక్కన పెట్టి ఒక్క విషయం ఆలోచిద్దాం, ఒక చోట బాంబు పేలి నలుగురు లేదా అయిదుగురు చనిపోతె... ప్రాణభయంతోటి పరిగెత్తుతున్న ప్రజలమీద కాల్పులు జరిపి ఏడుగురిని పొట్టనపెట్టుకోవడం ఏం న్యాయమో చెప్పండి? చనిపోయినవారు హిందువులా ముస్లింలా పక్కనపెడదాం? బాంబుదాడి జరిగింది గుడి లేదా మసీద్ అన్నది కూడా పక్కన పెడదాం... ప్రాణాలు తీసి ప్రజలను అదుపుచేయడం ఏం న్యాయం ఏం చట్టం?

బాంబులు పేలిస్తేనే, బిల్డింగ్‌లు పేల్చేసినవాల్లే టెర్రరిస్ట్‌లు కానక్కరలేదు... 3100 మంది 9/11 అప్పుడు చనిపోతె చూపించిన సానుభూతిల ఒక వెయ్యవ వంతు కూడ, వెయ్యి మందికి పైన గుజరాత్‌ల ఊచకోత కోసినప్పుడు మనకు కలుగకపోతె మనల మానవత్వం ఇంక మిగిలి ఉన్నదంటరా... లేక రాజకీయ పక్షాల / మీడియా అభూత కల్పనలకు మట్టిల కలిసినయి అనుకోవాలా?

"We have great artists, sports person, political leaders, and educationalists from muslim community better than any society" TRUE ! కని రెండు అన్నం మెతుకులను పట్టుకొని అన్నం ఉడికింది అని అన్నంత సులభంగ.... నలుగురు లేదా నాలుగు వేలమంది ముస్లింలు బాగ బతికి బట్టకడుతున్నరని.. అందరూ అంతే సుఖంగా ఉన్నరని లెక్కలు కట్టడం ఎంతవరకు సబబు.

అట్లనే కొద్ది శాతం మంది మతచాందసం తోటి చేసిన ఒక దుశ్చర్యకు ఆ మతం ప్రజలందరు కారణమని వాల్లని వంకర చూపు చూసుడు ఎంతటి తెలివిగలతనం ?

P.S: ఇక్కడున్న బ్లాగరులందరికి ఒక చిన్న మనవి ... మీ ఉద్దేశంల మేధావికి ఉండవలసిన కొన్ని లక్షణాలు, మీకు తెలిసి మీరు 'మేధావులని' నమ్మే కొందరి పేర్లు కింద రాస్తె సంతోషిస్తాను. ఎవరు తొక్కల వాల్లో ఎవరు మేధావులో ఇప్పటి నుంచి వేరే వాల్లు గుర్తించటంల కొంచం సాయపడుతదని అంతె !

Anonymous said...

ఒక్కసారి పేపర్లు తిరగేస్తే ఇరాక్‌లో ఎన్ని మసీదులు కూలిపోయాయో తెలుస్తుంది. పాకిస్తాన్‌లో షియా మత పెద్దలు బాంబు దాడికి తుడిచిపెట్టుకుపోయారు. సున్నీ షియా వర్గాల గొడవలు ఈ మధ్య పెరిగాయి కూడా. ఈ సుత్తి మేత-ఆవుల గ్రూపు నిర్ధారణ వల్ల నిజాలు ఏమాత్రం తెలిసాయో కానీ, మసీదులో బాంబులు (వి.హెచ్.పీ అని డెక్కన్ క్రానికల్ వ్రాసింది), ఆ తరువాత పోలీసు కాల్పులు అని చదివి వీనే కొందరు ముస్లిం యువకులు చేసే విపరీత చర్యలకు బాధ్యులు ఎవరు? పైగా వీటికి మళ్ళీ వత్తాసుల గ్యాంగు. దీన్నే పిల్లి తల గొరగడం అని అన్నారు.

Sudhakar said...

@japes

నిజ నిర్ధారణ కమిటీని నిజం కనుక్కోమనటంలో తప్పేముంది? మీడియా వద్ద మాట్లాడటం వలన వుపయోగం ఏముంది?

"Government hierarchy ని గుడ్డిగా నమ్మి, గడ్డితిన్నవాడు చెప్పేవే నిజాలుగా భావించి (ఆ మాట నెగ్గించుకోనీకి ఒక చెయ్యోకాలో కూడ అర్పించుకోగల సమర్థులం)" - ఇది నేను ఒప్పుకుంటాను. చెయ్యో, కాలో అర్పించుకున్నది ఎవరో అయితే నాకు తెలియదు. మన జనాలలో సినిమా హీరోల కోసం కిరోసిన్ పోసుకుని చచ్చే వాళ్లున్నరు, కాబట్టు ఇది మీరన్నట్లు నిజమే.

గుజరాత్ విషాదం మీద సానుభూతి ఎవరికి లేదు? మత చాందసత్వం ఎటు వైపు నుంచి రేగినా తీవ్రంగా ఖండించాల్సిందే.

"బాంబులు పేలిస్తేనే, బిల్డింగ్‌లు పేల్చేసినవాల్లే టెర్రరిస్ట్‌లు కానక్కరలేదు" - నిజమే...కానీ గుంపు దుండగులు, వారి మనస్తత్వం తీవ్రవాదుల మనస్తత్వానికి (ఒక ప్లాను ప్రకారం చేసేవి) మనం పోలిక పెట్టలేం. అలా అయితే ఈ మధ్య ప్రయాణీకులు వుండగా బస్సులు తగల పెట్టడానికి జనాలు ప్రయత్నిస్తున్నారు. వారు తీవ్రవాదులా? అప్పటికి అలా ప్రయత్నించినా, చల్ల బడ్డాక పశ్చాత్తాప పడతారు వారు. తీవ్రవాదులకు ఆ సమస్య లేదు. ఇలా పోల్చటం వలన తీవ్రవాద సానుభూతి సాధిస్తున్నామా?

"అట్లనే కొద్ది శాతం మంది మతచాందసం తోటి చేసిన ఒక దుశ్చర్యకు ఆ మతం ప్రజలందరు కారణమని వాల్లని వంకర చూపు చూసుడు ఎంతటి తెలివిగలతనం ? " - అది చాలా తెలివితక్కువతనం. ఇది ఎంతవరూ పోయిందంటే పుట్టిన పిల్లోడికి కూడా పాకిస్తాన్ అంటే కళ్లలో ఎర్రని జీరలు వచ్చేంతగా :-)



"P.S: ఇక్కడున్న బ్లాగరులందరికి ఒక చిన్న మనవి ... మీ ఉద్దేశంల మేధావికి ఉండవలసిన కొన్ని లక్షణాలు, మీకు తెలిసి మీరు 'మేధావులని' నమ్మే కొందరి పేర్లు కింద రాస్తె సంతోషిస్తాను." - నా పట్టిక..

౦౧. ఎవరూ లేరు
మీకు కావాలంటే మన మేధావుల సభ (విధాన సభ) కు పోయి చూడండి, కొంత మంది దొరకవచ్చు.
మీరు మేధావులంటున్నవారు ఎలా వుండాలో కూడా చెప్పండి అప్పుడు ఇక్కడ తొక్కలో వారిని గుర్తించటం పెద్ద సమస్యేమి కాదు.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

కడలితరగ అనుమానం తయారీ(http://kadalitaraga.wordpress.com/2007/05/22/anumaanam_tayari/) టపా చూడండి- ఒకరిమీద దాడి జరిగితే ప్రత్యర్ధులమీదికి అనుమానం పోవాలన్నది సహజ సూత్రం అంటున్నారు. దానికి విరుద్ధంగా ముస్లింలని అనుమానించడాన్ని ప్రశ్నించారు. హిందువులమీదే అనుమానం పోతుందికదా అని తీవ్రవాదులు ఇలా చేసుండచ్చుకదా? శోధన చెప్పినట్లు తీవ్రవాదులకి మసీదేంటి, గుడేమిటి? ముస్లిం ఏమిటి, హిందువేమిటి?

అందరూ గొధ్రా గురించి తెగ ఆవేశపడిపోతున్నారు- రైలు సంఘటనకి ప్రతీకారంగా జరిగిన కాండ అది విన్నాను- వీళ్ళేమో ఏక పక్షంగానే మాట్లాడుతున్నారు. ప్రతీకారంగా జరిగినా అది తప్పే. కాని తప్పుచేసిన వారికి మతప్రమేయం లేకుండా మొట్టికాయలేయ్యద్దా? అది సహజ సూత్రం కాదా? అసలు మొదట్నించీ కూడా ముస్లింలు, హిందువులూ అని కాకుండా ఎవరైనా మనుషులే, ఈదేశ పౌరులే అన్నట్లుగా ప్రభుత్వం, మేధావులు వ్యవహరిస్తే చాలా సమస్యలు వచ్చేవే కావు. అనవసరంగా ఓట్లకోసం రకరకాల కసరత్తులు, గారాలు చేసి పరిస్తితిని విషమింపచేసారు.

క్రిందటేడు, బోంబే పేలుళ్ళు జరిగినప్పుడు, economic and political weekly లో ఒక మేధావి, ముస్లింలు frustration కొద్దీ చేసినపని, కాబట్టి తప్పులేదన్నట్లుగా వాదించాడు. అయితే లోకల్ ట్రైన్లలో బాంబులెందుకు పెట్టడం? ఏకంగా ఏ గుళ్ళోనో పెట్టచ్చుగా? వాళ్ళకి హిందువులు శత్రువులుకారు, దేశం మాత్రమే. ఈ బాంబుల గొడవ కాదు కానీ, ఏగుళ్ళోకీ ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నాం- చెకింగుల గోలతోటి.

చదువరి said...

బాంబులేసింది ఎవరో తేలక ముందు ఏమంటున్నారో చూసారు గదా.. "ముస్లిముల నెందుకు అనుమానిస్తారు, ముల్సిములు మసీదుల మీద బాంబులెందుకు వేస్తారు, వేస్తే గుళ్ళో వేస్తారు గాని? వాళ్లు ఈ లోకంలో నమ్మేదే అల్లాని, ఖురాన్ ని, మస్జీద్ ని, అంచేత అక్కడ బాంబులు వెయ్యరు.." ఇదీ వరస

కొన్నాళ్ళాగాక, మన ఓటుబ్యాంకు రాజకీయాలు అడ్డం రాకుండా ఉంటే బాంబులేసిందెవడో ఎలాగూ తేలిపోద్ది.. అప్పుడూ వాడు ముస్లిము తీవ్రవాదేనని తేలిందనుకోండి.. అప్పుడు ఇదే మేధావులు, సెక్యులరిస్టు వీరులు, గుజరాతు అల్లర్లు తప్ప గోధ్రా ఏమాత్రం గుర్తుకు రాని సెలెక్టివ్ అమ్నీసియా బాధితులు ఏమంటారో తెలుసాండి.. "తీవ్రవాది అంటే తీవ్రవాదే.. వాడికి మతమేంటి? వాడికి కావలసింది మారణ హోమం అంతే. తీవ్రవాదులను మతం దృష్టితో చూడరాదు. ముస్లిము తీవ్రవాదులు, హిందూ తీవ్రవాదులు అంటూ ఉండరు" ఎన్నోసార్లు గతంలో చూసాం, విన్నాం. ప్రస్తుతం అదే తంతు నడుస్తున్నది.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name