ఇక్కడ పది పైసల పిట్ట ఏది? :- మున్నా అనే ఒక హింసాత్మక సినిమా (సినిమాలోపల, ప్రేక్షకుడి బుర్రలోనూ)
పది రూపాయల మసాల వండే ఏకైక TV చానల్ ఏదో ఒక చెప్పనవసరంలేదు.
అసలే తెలుగు సినిమా దౌర్భాగ్యంలో వుంటే ఇలా తెలుగు టీవీ ప్రసార వాహికలు నిర్మాణాత్మక విమర్శ చెయ్యటం అటుంచి, ఒక్కో సినిమాను పట్టుకుని దాని నిర్మాత నుంచి, లైట్ బాయ్ వరకు ఇంటర్వూలు చేసి వారి చేత "ఇదే నా జీవితంలో చేసిన అత్యద్భుత కత్తి కమాల్ ఇరగ సినిమా" అని చెప్పించటం. ఆ సినిమాని పేర్లు పడటం నుంచి విశ్లేషించి (ఏదో మేకింగ్ ఆఫ్ టైటానిక్ విత్ జేమ్స్ కామెరూన్ లా) ఊదరగొట్టెయ్యటం మరీ పెరిగింది.
అయినా ఈ మధ్య ఆ తొమ్మిది చానల్ కు ఏమీ ప్రసారం చెయ్యటానికి లేక గోల్లు గిల్లుకుంటుందని ఏపీ మీడియా కధనం.
3 comments:
ఈ లైవ్ టెలీకాస్ట్ తో కొద్దిగా పని దొరికినట్టుంది
గోల్లు గిల్లుకుంటున్నా బాగానే గిట్టుబాటు అవుతుందట కదా!
అవునూ అన్నీ కొత్త మొకాలే కనపడుతున్నాయి, ఈ పాత మొకాలన్నీ ఎటుపొయినాయి?
నీ పోస్టు టైటిల్ అదిరింది :)
పాత సామెత "పావలా కోడికి ముప్పావలా దిష్టి"కి నీ రీమిక్స్ భలే ఉంది.
ఫ్లాపు సినిమాని హిట్టు చేద్దమన్న తపన.
మనల్ని గొర్రెల్ని చేద్దామన ఆలోచన.
మన సినిమాలు మారవు, వాటిని ప్రొత్సహించే ఈ ఛానళ్ళూ మారవు.
మన ఖర్మ
వెంకట్
www.24fps.co.in
Post a Comment