౦౧. పైరేట్స్ ఆప్ కారిబ్బియన్ - ఎట్ వరల్డ్స్ ఎండ్ -- ఇది వరస చిత్రాలలో మూడవది. రెండవ భాగంలో కెప్టన్ జాక్ స్పారో (జానీ డెప్) క్రాకన్ చేత మింగబడటంతో అతనిని రక్షించటానికి కెప్టన్ బార్బోసా (మొదటి భాగంలో విలన్) నాయకత్వంలో ఎలిజబెత్ స్వాన్ (కీరా నైట్లీ), విల టర్నర్ (ఓర్లాండో బ్లూమ్) బయలు దేరటంతో ఈ కధ మొదలవుతుంది. ఇది కూడా రికార్డులు సృష్టిస్తుందని అంచనాలు వున్నాయి. ప్రపంచమంతా ఆంగ్ల దేశాలలో మే 25 న, మిగతా దేశాలలో మే 24 న విడుదల కానున్నది ఈ చిత్ర రాజం.
ఈ చిత్రంలో ఒకొక్క పాత్రలో నటులు ఎలా ఒదిగిపోయారంటే, మనకు వారి మిగతా చిత్రాలు చూస్తున్నా ఈ పాత్రలే గుర్తుకొస్తాయి.
౦౨. ష్రెక్ - 3
సరదాగా సాగి పోయే మంచి సినిమా ఇది. ప్రేమ, ఆత్మ గౌరవం ఎంత విలువైనవో తెలుపుతుంది.
౦౩. హ్యారీ పాటర్ - ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్ -- ఇప్పటి వరకూ మొదటి మూడూ చాలా సార్లు చూసేసాను. తరువాతి చిత్రం కూడా అదే స్థాయిలో వుంటుందని ఆశ. ఇది జూలై పదమూడున రాబోతున్నది. ఇందులో నాకిష్టమైన పాత్ర హెర్మొయన్ గ్రేంజర్ (ఎమ్మా వాట్సన్) అనే చాలా తెలివితేటలు, అందం, మంచితనం వున్న అమ్మాయి. అసలు అన్ని చిత్రాలలో ఆమే హీరోనా అనిపిస్తుంది.
మీరూ వీలయితే వీటి ముందరి భాగాలు చూసి వీటి కోసం తయారుకండి.
2 comments:
నవల్లో హెర్మియాన్ అంత అందంగా ఉండదనుకుంటాను
ఈవెన్ హారీ కూడా అంత అందంగా ఉండడు బక్క పల్చగా, మొకంపై ఓ మచ్చతో ఉంటాదు :(
"puss in the boots" చేసే సాహసాలు మరియు కత్తి యుద్దాలకోసమన్నా ఈ చిత్రం చూడాలి :)
Post a Comment