Wednesday, May 09, 2007

నేను ఒక కవిని....ఎందుకూ?

ఎప్పుడూ కిరణ్ చావా తో మాట్లాడినా నేను అడిగే ప్రశ్న ఒకటుంటుంది. అది అసలు ఈ కవిత్వం ఎలా చదువుతారండీ బాబు అని. అందులోనూ ఈ మధ్య తెలుగు బ్లాగులలో కవిత్వపు జోరు విజృంభిస్తున్నది కూడా..మరే భాషా బ్లాగులలో ఇంత కవిత్వపువేడి లేదేమో. ఏమైతేనేం మన తెలుగు వాళ్లు మంచి భావుకలని నిరూపిస్తున్నారు. అయితే నాక్కూడా ఈ రోజు కవిత్వం రాసేద్దామని "దుర్భుద్ది" పుట్టింది. :-) కాకపోతే అందరూ రాసినట్లు మంచి మంచి కవితలెందుకు రాయాలి…సరదాగా ఒక చెత్త కవిత రాద్దామనిపించింది. ప్రతీ ఒకడు ఈ కవిత చదవాలి (మీ లాగా). చదివి తిట్టుకోవాలి అని నా ఆశ…సి.నా.రే గళంలో చదువుకోండి.

 

నేను ఒక కవిని

ఎందుకో తెలుసా?

నేను కవిత్వం రాస్తా కాబట్టీ….

 

నేను కవిని కాక ముందు ఒక జీవిని

ఎందుకో తెలుసా? మీకు తెలుసా?

జీవం వున్నవాడిని కాబట్టీ….

 

ఈ కవిత నేను రాసాను

ఎందుకు రాసాను?

ఏ పనీ లేదు కనకా…

 

ఈ కవిత ఇప్పుడు చదవబడుతుంది

ఎందుకు చదవబడుతుందీ?

చదివుతున్న వ్యక్తికి అస్సలు పనిలేదు కనకా...

 

ఈ కవిత, నా కవిత

చెపుతుంది ఒక కత

చదివే వాడికి ఇది ఒక వెత

చెప్పేవాడికి చదివేవాడు మెతక

 

16 comments:

swathi said...

hhahha
modaTa nEnE bali ayindi.:)
bhalE kottagaa undi mI kavita.

Anonymous said...

malli meeku ee durbhidhi puttakudadani devudni korukuntunnaa

సత్యసాయి కొవ్వలి said...

సుధా, మీరు దీన్ని ఏపత్రికలోనో ప్రచురిస్తే బాగుంటుందని నాసలహా. ఇదివరలో వివిగిరి గారి పెళ్ళం, చింతాశ్రీనివాస్ (ఏదో టాక్సు ఆఫీసర్) లాంటివాళ్ళ కవితలు తెగఅచ్చేసేవారు. వాటికన్నా తీసిపోలేదు మీకవిత. అన్నట్లు ఈమధ్య నేను కూడా కవిత్వం డిసైడు చేసినా, అవ్ మల్ల.

పారుపల్లి said...

మిమ్మల్ని కవి కాదన్న వాడిని నేను కత్తి తో పొడుస్తా

ప్రవీణ్ గార్లపాటి said...

ఆహా అచ్చం పారుపల్లి గారన్నదే గుర్తొచ్చింది.

నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా
నేను కవిని కాదన్న వాడిని రాయిచ్చుకు కొడతా...

ప్రసాద్ said...

సుధాకర్,
మీకిదేం బుద్ది? చక్కగా ఏ విమర్శనా వ్యాసాలు రాసుకోక ఇలా కవితలు రాయడానికి తెగబడ్డం ఏమిటి? గాడిద పని గాడిద, కుక్క పని కుక్కా చేయాలి. ఏ రాధికో, స్వాతి కుమారో కవితలు రాయాలి. మీరు గాదు.
ఇలా ఇంకోసారి చేశారంటే వచ్చే సంవత్సరం మీకు అవార్డు రాకుంటా అడ్డుపడతాం.

(కోపం తెచ్చుకోకండి. తిట్టమన్నారని తిట్టినా. :) )
--ప్రసాద్
http://blog.charasala.com

కొత్త పాళీ said...

ఏం పర్లేదు, మీక్కూడా పుటురె - ఐ మీన్ ఫ్యూచరుంది :-))

ఇంతకీ మీ ప్రశ్నకి చావా సమాధానమేంటో చెప్పలేదు?

జ్యోతి said...

సూపర్....మీ బాస్ మీద కూడా ఇలాంటిదే రాసేయి.ఉద్యోగం ఊడగొడతాడు. రోగం కుదురుతుంది. హన్నా. మా మీద ప్రయోగాలా??అసలే మండే ఎండలతో చస్తుంటే!

Anonymous said...

నేను ఒక వ్యాఖ్యను
ఎందుకో తెలుసా
నేను వ్యాఖ్యానిస్తాను కాబట్టి

నేను వ్యాఖ్యను కాక ముందు ఒక చదువరిని
ఎందుకు తెలుసా? మీకు తెలుసా
చదివాను కాబట్టి

ఈ వ్యాఖ్యను నేను టైపాను
ఎందుకు టైపాను
పని పెట్టారు కాబట్టి

ఈ వ్యాఖ్య ఇప్పుడు చదవబడుతుంది
ఎందుకు చదవబడుతుంది
వ్యాఖ్యలు రాసే వారికి టపాలు రాసే పని లేదు కనక

ఈ వ్యాఖ్య, నా వ్యాఖ్య
చెబుతుంది చివరి వాక్య
చదివేవాడికి ఒక లేహ్య
రాసినోడికి తీరుతుంది తవికల చాపల్య

-- లేఖ వ్యాఖ్యల విహారి

radhika said...

గొప్ప గొప్ప కవితలకి పేరడీలు వున్నాయి.మీ కవితకీ పేరడీ వచ్చింది అంటే ఇది ఎంత గొప్ప కవితో అర్దం అవుతుంది.[నా కవితకి కూడా పేరడీవచ్చిందోచ్ పొద్దులో.]

నేనుసైతం said...

సుధాకర్,

లోకులు కాకులు :), మీరు ఎదుగుతాంటే చూసి ఓర్వలేక ఏదో అంటారు....మీరు కానివ్వండి.
అమ్మో అదిగో ప్రసాద్, జ్యోతి నన్నేదో తిడుతున్నారు.....

-నేనుసైతం

రానారె said...

సుధాకరా, మొత్తానికి బాగా కసితీర్చుకున్నారు ఈ కవితతో. నాదీ మీ బాధే. నాకూ కవితలు అర్థంకావు. మీరు ఇలాగే ఇంకోటి రాయాలని నా కోరిక.

oremuna said...

చావా సమాధానం:

నేను కవితలు చదవను :(

గత నాలుగైదు సంవత్సరాలనుండి కవితలు వ్రాసీ వ్రాసీ ఇప్పుడిప్పుడే కవితలు చదివే స్టేజికి వచ్చినాను, మొన్ననే రాధిక గారి బ్లాగు మొత్తం చదువుదామని మొదటి నుండి మొదలెట్టి మూడు కవితలు చదివిన తరువాత లాభంలేదు ఇంకా నోరు తిరగాలి అని పోస్ట్పోన్ చేసినాను.

తరువాత ఓ పది ఇరవై కవితల పుస్తకాలు విశాలాంధ్ర నుండి, కోటీ నుండి కొని చదవడం ప్రాక్టీస్ చేస్తున్నాను.

మరి జీవితం ఏ మలుపు తిరుగుతుందో, ఏమిటో

ఇహ అసలు విషయం

ఎంత చదవడం ంఒదలు పెడితే మాత్రం ఇలాటి కవిలతు చదవాల్సి వస్తుంది అనుకోలేదు, సుధాకర్ నీకు మాంచి ఫూచర్ ఉన్నది సుమా!

కవి ఇంటి మీది కాకి కూడా కవిత్వం చెపుతుంది, కూడలి రోజూ చూసి చూసి నువ్వు కూడా కవివి కావడం ఆశ్చర్యం లేదు

సుధాకర్ said...

హృదయంలోపలి కవి గెంతులేస్తే కవిత్వం పుడుతుంది.
బుర్రలోని కపి కుప్పుగెంతులేస్తే కపిత్వం బయటబడుతుంది.

నాది కపిత్వం మాత్రమే :-)

అయినా ఆదరించిన బ్లాగ్జనులకు శిరస్సు ఎక్కి అభివందనాలు :-)

ప్రదీప్ said...

"చంటబ్బాయ్" సినిమా లో శ్రీ లక్మి గారు ఇలాంటివే కొన్ని కవితలు చెప్పి ఆ పత్రికా officer ని ముప్పతిప్పలు పెడుతుంది. మీ కవిత చదివేసరికి ఆ హాస్య సన్నివేశం గుర్తువచ్చి, తెగ నవ్వొచ్చింది.. :)

సునీత said...

సుధాకర్...
యేమినీ అద్భుత శోధన,
అహా యెంత స్పందన,
యెందరో కవుల సమ్మేళన,
ఇదియే నా ఆవేదన,
అందుకో ఒక నమూన !

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name