Saturday, May 19, 2007

జీ-తెలుగు లో స రి గ మ ప

మీరు జీ-తెలుగు లో స రి గ మ ప లిటిల్ స్టార్స్ చూస్తున్నారా? చూడకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారు. అద్భుతమైన గళాలతో న్యాయ నిర్ణేతలనే పరవశింపచేస్తున్నారు ఆ చిన్నారులు. పాత మధురాలను మరలా సుశీల, లీల, జిక్కి కూడా ఇలానే పాడేరేమో అన్నంత మధురంగా పాడుతున్నారు.

జీ-తెలుగుకు ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం అందిస్తున్నారు.

4 comments:

వెంకట రమణ said...

నిజమే ఆ ప్రోగ్రమ్ చూసినప్పుడు నాకు కూడా ఇలానే అనిపించింది. కాకపోతే ఇంతకు ముందు నేను ఎప్పుడు జీ తెలుగు పెట్టినా అదే ప్రోగ్రాం వచ్చేది, ఇప్పుడేమయిందో అసలు ఆ ప్రోగ్రాం చూద్దామన్నా ఎప్పుడూ రావడంలేదు. కొంచం ఆ ప్రోగ్రాం సమయం ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకోండి..

సిరిసిరిమువ్వ said...

జీ-తెలుగు లో స రి గ మ ప లిటిల్ స్టార్స్ సమయం గురువారం, శుక్రవారం రాత్రి 9 గం.ల నుండి 10 గం.ల వరకు.

కొత్త పాళీ said...

ఇంత మంచి టేలెంటున్న చిన్నారుల్ని అందుబాటులో ఉంచుకుని మన సినిమా వాళ్ళెందుకు పిల్లల పాత్రలకి స్త్రీలతో డబ్బీంగు చెప్పించి పాటలు పాడిస్తారు? మన సినిమాల్లో నాకు కంపరమెత్తించే అంశాల్లో ఇదొకటి.

lalitha said...

good question kottapaaLi garu.
same goes for telugu children CDs and programmes.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name