Saturday, March 24, 2007

భారతీయులు…క్రీడా స్పూర్థి

హమ్మయ్య ఒక పని అయిపోయింది.

  • ఇక నోరు తెరుచుకుని TV చూసే పని తప్పింది.
  • కూరలు మాడిపోయే ప్రమాదం తప్పింది.
  • గుండె పోట్లతో అభిమానులు పోయే ప్రమాదాలు తప్పాయి.
  • వెధవ పాచి పళ్ల దాసరి TV Ads అదే పనిగా చూసే పనీ తప్పింది.
  • ఆఫీసుల్లో పని మానేసి టీవీ గదిలో పని చేసే పని తప్పింది
  • లక్షల యూనిట్ల విద్యుత్తు ఆదా కాబోతున్నది.
  • మరి కొన్ని లక్షల కేలరీల శక్తి మనందరిలో ఆదా కాబోతున్నది
  • కొన్ని వేల మందికి కంటి చూపు కొద్దిగా మందగించే ప్రమాదమూ తప్పింది.

ఇన్ని మంచి పనులు జరుగుతుంటే ఈ మీడియా ఏంటో ….ఏదో ఇండియా క్రికెట్ జట్టు కలసికట్టుగా సతీ సహగమనం చేసినట్లు గోల పెడుతుంది? నిజానికి మన భారత ప్రజలకు ఈ తిట్టే హక్కు వుందా?

 

చూద్దాం !

 

మన ఉపఖండంలో మనం పట్టించుకునే ఒకే ఒక ఆట "క్రికెట్టు". అది కూడా భారత జట్టు ప్రపంచ కప్పు గెలిచాకనే ఎక్కువయింది. అసలు మనలో ఈ ఆట పట్ల నిజంగా అంత అభిమానం వుందా? లేదా విజయం పట్ల అభిమానం వున్నదా? పశ్చిమ దేశాలలో, రష్యన్ దేశాలలో తీసుకుంటే…వారు ఆటను అభిమానిస్తే అన్ని స్థాయిలలో అభిమానిస్తారు. అంటే హైస్కూలు స్థాయిలో జరిగినా ఒక రెండు వందల మంది అభిమానులు గుమిగూడుతారు. ఆ స్థాయిలో కూడా చాలా మనసు పెట్టి ఆడుతారు. నిజానికి పెద్ద పెద్ద కోచ్‍లు అందరూ అక్కడి నుంచే వస్తారు. ప్రతీ రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ స్థాయి జట్టు వుంటుంది. వారికి ఎనలేని అభిమానులూ వుంటారు.

 

మన దేశంలో మిగతా ఆటలు వదిలేస్తే…క్రికెట్టుకు కూడా ఈ స్థాయి ఇంకా లేదు. రెండు రాష్ట్రాల మధ్య రంజీ మ్యాచ్ అయితే ఎంత మంది చూస్తున్నాం? మనోళ్లు అభిమానించేది ఒక స్థాయికి వెళ్లి, గ్లామర్ సంపాదించుకున్న ఆటగాళ్లనే అనటంలో సందేహం లేదు. ఈ అభిమానం ముదిరి, వెర్రిగా మారి, తరువాత హక్కుగా మారింది. నిజానికి ఇప్పుడున్న క్రికెట్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టు. అంటే వారు ప్రభుత్వం తరపున అధికారకంగా ఏమీ ఆడటం లేదు. వారికి ఒక స్వతంత్ర కార్యాలయం వుంది. అయితే మన అభిమానం వారికి ఎనలేని సిరి సంపదలు తెచ్చిపెట్టిన విషయం మాత్రం వాస్తవం. అయితే ఆ కారణంగా మనం వాళ్లని ప్రతీ వైఫల్యానికి తిట్టవచ్చా అంటే…అది మన విజ్ఞత మీద, హుందాతనం మీద ఆధారపడి వుంది. ప్రొఫెషనల్ స్థాయి క్రీడ అయిన టెన్నిస్ లో కూడా ఈ అవస్థ తప్పలేదు. మోనికా సెలెస్ వంటి అద్భుత క్రీడాకారిణి శాశ్వతంగా తప్పుకోవాల్సివచ్చింది. మన దేశంలో ఆ స్థాయి రాకూడదని ఆశిద్దాం.

 

ఆటలో గెలుపు, ఓటములు సర్వ సాధారణం. అందులో ఒక రోజు క్రికెట్టు అనేది శకుని జూదం లాంటింది. ఒక మేఘం కూడా ఆటలో భాగం కావచ్చు. గంటకు దాదాపు 135 మైళ్ల వేగంతో దూసుకు వచ్చే బంతి బ్యాటును తాకే మధ్య సమయం దాదాపు 2 సెకండ్లు మాత్రమే. అంత తక్కువ సమయంలో కూడా బంతి తాలుకా వాలు, వేగం, పిచ్ స్వభావం అంచనా వేస్తూ, క్రికెట్లో వున్న పదకొండు రకాల షాట్లలో ఏది ఆడాలో నిర్ణయించుకుని ఆటగాడు సిద్ధం కావాలి. ఇదంతా ఆటగాడి నాడీ వ్యవస్థ పైన, మెదడు, రక్త ప్రసరణ పైన అత్యంత విపరీతమైన వత్తిడికి గురిచేస్తుంది…ప్రతీ బంతికి కూడా…అది కూడా కోట్ల అభిమానుల ఆశల మధ్య. ఇవన్నీ చాలక ఇప్పుడు మన అభిమానం వెర్రిగా మారితే అది మరింత ఒత్తిడిని పెంచి, స్థైర్యతను దెబ్బతీయక మానదు. కంగారూలు జగజ్జేతలవటానికి కారణం ఇదే…ఆసీయులు క్రికెట్ ని అభిమానిస్తారే తప్ప….శాసించరు. ఇళ్ల మీద దాడి చెయ్యరు.

 

వీటికి తోడు మన చెత్త మీడియా…సగం దరిద్రానికి కారణం వీళ్లే…దండలు వేసి పులులు అనేది వీరే….కాగితం పులులు అనేదీ వీరే…ఒక్క క్రికెటర్ కూడా ఇప్పటి వరకు "మన జట్టు పులుల జట్టు" అని ఎప్పుడూ అనలేదు. ఆఖరికి BCCI కూడా…ఇక మనం మీడియా గురించి మాట్లాడితే అంతు వుండదు.

 

కాబట్టి…మనం క్రీడా స్పూర్థికి ముందు పదును పెట్టుకుని…ఓడితే హాయిగా నవ్వేసి వదిలెయ్యటం అలవాటు చేసుకుంటే మంచిది. అంతే గానీ ఏదో మన జేబు నుంచి ప్రతీ నెలా క్రికెట్ జట్టుకు ఒక పది రూపాయలు చందా కడుతున్నట్లు రెచ్చి పోయి తిట్టడం, కాల్చడం, దాడి చెయ్యటం చేస్తే అది ఈ దేశానికి భవిష్యత్తులో చాలా చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం వుంది.

11 comments:

Narsi said...

Your post is "to the point". It would have been really good if you mention about "OUR GREAT INDIA COACH" as well.

చక్రవర్తి said...

After watching our team's performance at live, y'day, i recollected one old great song by Bala Murali (guess).. Hope the indian team would be reciting the same..

ఏమి .. సేతురా లింగా ..

వెంకట రమణ said...

బాంగ్లాదేశ్ మన టీంని ఓడించి మంచి పనే చేసింది. లేక పోతే అందరికీ అనవసరంగా ఇంకో 15 రోజులు దండగ అయ్యేవి. వీళ్ళ ఆటతీరు చూస్తే సూపర్-8 దాటి వెళ్ళే అవకాశం ఎటూ లేదని తెలిసిపోతోంది. ఆ బర్ముడా మీద కూడా గెలిచేస్తే బాంగ్లాదేశ్ మనదేశానికి ఎంతో సహాయం చేసినట్లే.

వెంకట రమణ said...
This comment has been removed by the author.
Nagaraju Pappu said...

"..అసలు మనలో ఈ ఆట పట్ల నిజంగా అంత అభిమానం వుందా? లేదా విజయం పట్ల అభిమానం వున్నదా?"

Sudhakar - this is a fantastic and deep observation. Unless we focus on the grassroots - we can never become a top team in the world. Till now our poor performance has been blamed on the 'poverty' of our country. BCCI is now the richest sporting body perhaps in the world!!

We have more than 500 districts - how many of them have a reasonable cricket ground and coaching facilities?? How can players start to learn 'after' they get selected to national team?

Thanks for a very pertinent post.
--nagaraj

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

నరసింహరావు గారు : కోచ్ ని తిట్టడం అన్నింటి కంటే తప్పు. మన జట్టు ఏమీ అల్లాటప్పా జట్టు కాదు. ఈ జట్టుకు ఏభయి సంవత్సరాల చరిత్ర వున్నది. ఇప్పుడున్న ఆటగాళ్ల రికార్డులూ తక్కువ కాదు. అన్నింటికీ కోచ్ నే నిందించితే అసలు ఇప్పటి వరకూ విజయవంతమైన కోచ్ ఎవరు? జాన్ రైట్ తను శారదా ఉగ్రా(ఇండియా టుడే ఎడిటర్) తో రాసిన ఒక పుస్తకం లో సచిన్ బొమ్మ క్రింద ఇలా రాసుకున్నారు...

"నేను ఇతని కోచ్ కాదు...ఇతనికి సలహా కావలిసినప్పుడు గౌరవ పూర్వకంగా అందించడమే నా పని"..."అసలు కోచ్ ఇతడు" అని.. ప్రక్కనే రమాకాంత్ అచ్రేకర్ బొమ్మ క్రింద రాసాడు.

కోచ్ పని జట్టుని మానసికంగా ఒక త్రాటిపై ఉంచటం, సలహాలు ఇవ్వటం అంతే కానీ...సచిన్ కు డక్ అవుట్ ఎలా కాకూడదో చెప్పడం కాదు. ఎందుకంటే ఈ కోచ్ లు పెద్ద పెద్ద క్రీడాకారులు కాదు.

ఇయాన్ చాపెల్ ఈ రోజు మీడియా ఒక మంచి సమాధానం చెప్పాడు .."నేను BCCI కి సమాధానం చెప్పాలి...మీకు కాదు"

నిజానికి భవిష్యత్తులో భారత ఉపఖండంలో పని చెయ్యటానికి ఒక్క కోచ్ కూడా దొరికని పరిస్థితి ఏర్పడబోతుంది. ఎస్కోబార్ హత్య లాంటిది మన దేశంలో జరిగినా జరగవచ్చు.

ఇది ఒప్పుకోవాలి...మన భారతీయులకు క్రీడా స్పూర్థి లేదు. ప్రతీ చిన్న దానికి ఉడుక్కుంటారు..కోపంతో ఊగిపోతారు..అరుస్తారు...ద్వంసం చేస్తారు...శవ యాత్రలు చేసి ఏడుస్తారు.ఇవన్నీ బెట్టింగు లాబీల పనీ కావచ్చు..చెప్పలేం...లేదా మనలో నిద్రాణంగా వున్న శాడిజం, మానసిక జాడ్యం కావచ్చు.

కొడుకు జీవితంలో పనికి రాకుండా పోతే, లక్షలు కట్టి మరీ తలుపెనకాల నుంచి చల్లగా ఇంజనీరింగు చదివించి, మావాడు బీటెక్కు అని చెప్పడం వచ్చిన వాళ్ళు, ఎవరో ఎక్కడో ఒక చిన్న డక్ అయితే శవ యాత్రలు చెయ్యటం ఏమిటి? రోగం కాకపోతే...

Anonymous said...

సగం కాదు! అసలు దరిద్ర్యమే మీడియా. దండలు వేసి పులులు అనేది వీరే….ఆడకపోతే అరదండలు వేసి ఉరేగించాలనేది అనేది వీరే. క్రికెట్‌వీరులు నుంచున్నా, కుర్చున్నా, సెన్సేషన్ వార్తగా వ్రాసే వీరు, ఓడినప్పుడు, అభిమానులను తమ వార్తావ్యాఖ్యానాల ద్వారా రెచ్చగొట్టి వారిచే దిష్టిబోమ్మలు తగలెట్టించి, కొంపలమీద రాళ్ళేయించి, అదే వార్తను పదే పదే ప్రసారంచేసి, క్రికెట్టే కాదు,ఏ క్రీడనైన బ్రష్టుపట్టించటనికి తగిన వారు కూడా ఈమీడియానే.

రానారె said...

గొప్ప మాటన్నారు. మీతో 200% ఏకీభవిస్తున్నాను.

చక్రవర్తి said...

Sudhakar gaaru, this post is off the track of the main topic.

Am really surprised to read your comments, not just because of the content, but because of the lengthy matter. It took about 20 mins for me to type from http://www.iit.edu/~laksvij/language/telugu.html in telugu.

Can you share the screct of your blog tool that will allow you to post at ease in Telugu? Am asking this to initiate a blog from my keyboard in Telugu. Any of your comments will be great and are highly helpful to my blogging

Sudhakar said...

చక్రవర్తి గారు,

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. నేను తెలుగులో ముందర లేఖినితో (www.lekhini.org) మొదలు పెట్టి RTS అనే phonetic భాషలో రాయటం అలవాటు చేసుకున్నాను.

అది బాగా వచ్చాక www.baraha.com నుంచి baraha IME ని వాడుతున్నా..దీని వలన నేను ఎక్కడయినా ధారాళంగా తెలుగు టైప్ చెయ్యగలను.

మీ బ్లాగు కోసం ఎదురు చూస్తున్నాం :-)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name