Wednesday, March 07, 2007

క్రికెటాభిమానులూ ..జర భధ్రం

ఈ నెల రోజులూ ప్రపంచ క్రికెట్ దేవతలు కనువిందు చెయ్యనుండటం చేత…మీ అందరూ తీసుకోవలసిన ఒకే ఒక జాగ్రత్త ఒకటున్నది…

మ్యాచ్ విశేషాలను చచ్చినా ఒక ఛానల్లో మాత్రం చూడవద్దు. ఏ ఛానలో అర్ధం అయిందా? కాకపోతే ఇవి చదివి అర్ధం చేసుకోండేం !

౦౧. ఇది ఒక వార్తా ప్రసార వాహిక

౦౨. సమాజం కోసం పడి….చచ్చి పోతూ వుంది.

౦౩. నిరభ్యంతరంగా అసభ్య దృశ్యాలను సమాజ శ్రేయస్సు కోసం ప్రసారం చేయగల సత్త వుంది

౦౪. అందరూ అదృష్ట సంఖ్యగా భావించే ఒక సంఖ్యతో వీరికి చాలా దగ్గర

ఇప్పుడు బుర్రలో దీపం వెలిగుంటుంది.

క్రికెట్ వ్యాఖ్యానన్ని వీరి కంటే పరమ దరిద్రంగా, నీచంగా ఎవరూ చెప్పలేరు. కావాలంటే పందెం కాస్తా…

మచ్చుకు ఈ రోజు వారి వ్యాఖ్యానం ఇలా వుంది….

" వన్ ట్వంటీ రేంజి దాటలేని పఠాన్ తో ఎటాక్ స్టార్టు చెయ్యించటమే మన బౌలింగ్ రిసోర్సెస్ కెపాసిటికి అద్దం పట్టింది. యువరాజు డ్రీమ్ స్పెల్, స్పిన్ ట్విన్స్ కుంబ్లే, హరభజన్ రొటీన్ కంట్రిబ్యుషన్స్ తో……"

మీకి నాకి మాట్లు నమ్మకమ్ లేక్పోతే ఈ రోజుది రాత్రి వార్తలలో ఆ ఛానల్ సూసి నాకి మర్‌లా చెప్పండి. (ఇదే కాస్త నయమేమో…వారి తెగులు కన్నా) :-)

కాబట్టి…ఇక చెప్పడానికి ఏమీ లేదు…చూస్తే Live చూడండి. లేకపోతే హాయిగా కూడలిలో ఎవరో ఒకరు వ్యాఖ్యానం రాస్తారు..చదవండి..లేకపోతే మంచి వార్తా పత్రికలోనో చదవండి. అది కాదనుకుంటే హాయిగా పడుకోండి.

15 comments:

రాధిక said...

tv9?

Valluri Sudhakar said...

దౌటు లేదండి. భాషాదొషాలలో, భావదారిద్యంలో ఆ చానల్‌ని మించింది లేదు.

వెంకట రమణ said...

మామూలుగా తెలుగులో అక్కడక్కడ ఇంగ్లీషు పదాలు వాడితే దాన్ని తెంగ్లీషు అంటుంటాం. దీనిలో ఇంగ్లీషులో ఏవో ఒకటి రెండు తెలుగు పదాలు కలిపారు, దీన్ని ఏమని పిలవాలో.

ఇలుగు ??

శ్రీనివాస said...

తెగులు అంటే బాగుండదా ?

Ajit Kumar said...

మీ మాటల్లో నాకు కుల/మత వాసనలొస్తున్నయి.
సంస్కృతపదాలకు డుమువులు చేర్చి తెలుగు అని
చెప్పినట్లుగా నేడు ఆంగ్ల భాషాపదాలను డుమువులు
చేర్చి వాడటం నేటి నాగరికత. కంప్యూటర్ ప్రపంచంలొ
నేడది వాడుక.

Kiran said...

TV9 ఒక వరస్ట్ తెలుగు యూస్ చేసె న్యూస్ ఛానెల్. అందరు దాన్ని డస్ట్ బిన్ లొ త్రో చెయ్యండి...
అయ్యబాబోయ్...ఆ భాష లో తిట్టాలంటేనే నాకు అదోలా ఉంది.తెగులే అది...

Sudhakar said...

అజిత్ గారు, ప్రతీ చిన్న విషయానికి ఇలా మత, కుల వాసనలు అంట గట్టనక్కరలేదు. ఈ దేశంలో "మత" అనే పదాన్ని వాడుకున్నంత చెత్తగా ఇంకెక్కడా వాడరేమో. ఇలాంటి చిన్న విషయాలన్ని మతవాసన...చాలా చాలా పెద్ద విషయాలన్ని మానవత, మైనారిటీ కదా? ఇక్కడ నేను చెప్పిన ఆ నాలుగు వాక్యాలు నేను నా "ఆ మత" స్నేహితులతో కూడా సరదాగా అన్న రోజులున్నాయి. అలా అనాలంటే గుండె స్వచ్చంగా మతమనేది కళ్ళకు అడ్డంగా లేకుండా వుండాలి. అపుడే అవి "వాసన" వెయ్యకుండా ఉంటాయి. వినాయకుడి మీద లక్ష జోకులున్నాయి, కార్టూనులున్నాయి...అలా అని అవి మత వాసనంటారా? మీరలా అనుకుంటే మీ ఖర్మ..

శ్రీనివాస said...
This comment has been removed by the author.
శ్రీనివాస said...
This comment has been removed by the author.
శ్రీనివాస said...

అజిత్‌ గారు, మనం చాలా సంస్కృత పదాలని తెలుగు పదాలుగా మార్చుకున్నది నిజమే. అవి చాలా వరకు కవితల కోసమో పద్యాల కోసమో (పండిత భాషలో) ఉపయోగిస్తాం. ఒకవేళ తెలుగులో ఆ పదానికి సమానమైనది లేకపోతే మనం తప్పక దానిని ఉపయోగిస్తాం. ఉదాహరణకి పువ్వు అన్నది తెలుగు పదం. పుష్పము అంటే మీరన్నట్టు సంస్కృత పదం. మనం ఎప్పుడన్నా పువ్వు అని అంటామే గానీ పుష్పం అనం కదా సాధారణంగా. ఏ కవితల్లాంటి వాటిలోనో వీటిని ఉపయోగిస్తుంటాం. కానీ బస్సు ని ఆంగ్లం నుండి తెచ్చుకున్నాం. దానికి తెలుగులో సమానమైనది లేదు కాబట్టి బస్‌ని అజంతంగా మార్చేసి వాడుతున్నాం. మన సౌలభ్యం కోసం ఏం చేసినా భాష ఉనికికి అందానికి దెబ్బ తగలకూడదు. ఆ టీవీ9 తింగరి లంగరి కనీసం ఎటాక్‌ని దాడి అనో, కంట్రిబ్యూషన్‌ని సహకారమనో అంటే బాగుంటుంది కదా! టీవీ9 కన్నా ఈటీవీలో వార్తలే నయం ఈ కోణంలోంచి చూస్తే.

spandana said...

అజిత్ గారు ఇటీవల నా బ్లాగులో ("నేను" అనగా...) వాఖ్యానం రాస్తూ "మీకు మతమౌఢ్యదృష్టి తొలగి.." అంటూ రాశారు. మతమంటేనే నాకు పడదు ..నాలో మత మౌడ్యం ఎలా కనిపించిందబ్బా అజిత్ గారికి అని నేను తెగ కంగారు పడిపోయా!

ఈ TV9 ను మీ మీ కేబుల్ ఆపరేటర్లతో చెప్పి తొలగించుకోకపోయారా?

--ప్రసాద్
http://blog.charasala.com

Sudhakar said...

నేను DishTV వాడుతున్నా..కాబట్టి భరించాల్సిందే...

స్వేచ్ఛా విహంగం said...

ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఇది కుడా చెప్పక తప్పదు.



సీన్ సితార్. (MNR college సందర్భం లో)

న్యూజిలాండ్ ఆస్ట్రేలియా బౌలింగ్ ని ఇరగదీసింది.

పోలీసులు నిందితుణ్ణి బొక్కలో వేసారు

ఆ ఛానల్ వారు వాడే ఇటువంటి మాటలు చాలు వాళ్ల ఛానల్ ప్రమాణాలు అంచనా వేయడానికి.

రానారె said...

tv9 - ఏకైక తెంగ్లీష్ న్యూస్ ఛానల్!!

త్రివిక్రమ్ Trivikram said...

టీవీ9 గురించి ఒక మాట: గత సంవత్సరం రోడ్డుభద్రతావారోత్సవాల సందర్భంగా అనుకుంటా సదరు టీవీకి చెందిన విలేకరి ఒకరు హైదరాబాదు నగరంలో రద్దీగా ఉండే రహదారిలో వెళ్తున్న సిటీబస్సులోకెక్కి డ్రైవరు వెనక చేరి అతడి నోట్లో మైకు పెట్టి అతణ్ణి ఇంటర్వ్యూ చెయ్యడం మొదలుపెట్టింది. ఆ సన్నివేశం చూసినవాళ్ళెవరికైనా ఆ మైకుతోనే ఆవిడ బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తే వాళ్ళ తప్పేమీ లేదు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name