ఫ్లాష్ న్యూస్ : సీ.యన్.యన్ ఐ.బి.యన్ లైవ్ వారు ఇప్పుడే సమర్పించిన వార్త కదంబం (లైవ్) సంచలనాత్మక విషయాలను బయట పెట్టింది.
వారి ప్రకారం…
గ్రెగ్ ఛాపెల్ ఒక బాంబు లాంటి SMS ను సీనియర్ క్రికెట్ పాత్రికేయుడు రాజన్ బాలా కు పంపాడు…అది చాలా కొత్త విషయాలను, BCCI లో లుకలుకలను బయట పెడుతోంది. అందరూ గ్రెగ్ ఛాపెల్ మీద మండి పడటం సహించలేని రాజన్ బాల ఆ SMS ను బహిర్గతం చేసారు.
అందులోని కొన్ని విషయాలు…
- గ్రెగ్ ఛాపెల్ సీనియర్లు (సచిన్, సౌరవ్, ద్రావిడ్, సెహ్వాగ్) లను ఇంటికి పంపమని పోరుతూనే వున్నాడు.
- మీడియా భయంతో BCCI అందుకు అంగీకరించలేదు
- సురేశ్ రైనా తప్పని సరిగా వుండాలని ఛాపెల్ పట్టుబట్టాడు
- సురేశ్ రైనా వుండటం BCCI కి ఇష్టం లేదు
- సెహ్వాగ్ వుండి తీరాల్సిందే అని ద్రావిడ్ పట్టు పట్టాడు (కరణ్ థాపర్ తో వెంగ్ సర్కార్)
- కార్తీక్ ను తీసుకోవాలని ఛాపెల్ కోరాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు వున్నాయని అలా కోరాడు
- సచిన్ వైస్ కెప్టెన్ అవ్వటం ఛాపెల్ ను విస్మయ పరిచింది. సచిన్ కెప్టెన్ గా పూర్తిగా విఫలం చెందిన రికార్డ్ వుండటం అందుకు కారణం.
- సీనియర్లు, యువ క్రికెటర్లను వరల్డ్ కప్ టీమ్ లోనికి ఎంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- ఛాపెల్ రాజన్ తో : మీరన్నట్లు యువరాజ్ ను తీసుకోవటం ఒక రిస్క్. అతడు తననొక స్టార్ క్రికెటర్ గా భావించుకుంటాడు. అతను ఒక ఎదుగుతున్న క్రికెటర్ మాత్రమే.
- రాజన్ బాల : మొహమ్మద్ కైఫ్ కు ఇండియా-A టీమ్ కెప్టెన్ గా అద్భుతమైన రికార్డులున్నాయి. అతడిని ఎందుకు పక్కన పెట్టారో అర్ధం కాలేదు.
ఇదిలా వుండగా BCCI , ఛాపెల్ విషయమై నిలువుగా చీలిందని వార్త
3 comments:
నేనూ చదివా కానీ ఒక SMS లో అంత సమాచారం ఎలా పంపాడో అర్థం కాలేదు. కొంతుండచ్చు కానీ ఈ వెధవలు మళ్ళీ చిలువలు పలవలు చేస్తున్నారని నా అనుమానం.
ఏదయినా చాపెల్ ని గొర్రె గా చేస్తారని నేననుకుంటున్నాను.
"ఏ రాయి ఐతేనేమి పల్లు రాలకొట్టుకోటానికి" అని తెలుగు లో ఒక సామెత గుర్తొస్తుంది.,.,ఏ player ఐతేనేమి loser గా ఇంటికి చేరటానికి.,,.ఎవడికి వాడికే తన మీద or తను సిఫారసు చేసిన player మీద " పెద్ద పోటుగాడు" అని అభిప్రాయం..ముందు మన players వొళ్ళు వంచాలి..కనీసం advertisement picturisation మీద చూపించే శ్రద్ధ మీద practise మీద చూపించాలి,..,అప్పటివరకూ ఎన్ని reviews వచ్చినా ఎన్ని comments చేసినా మన cricket ఇంతే...-ఇది ఎన్నో ఆశలు పెట్టుకుని బాగా disappoint ఐన ఒక అభిమాని అభిప్రాయం...
sms లో వున్నది మొదటి రెండు పాయింట్లు, యువరాజ్ గురించి మాత్రమే. మిగతా అంతా రాజన్ బాల తో అతని చర్చించాడని రాజన్ బాల చెప్పాడు.
Post a Comment