Wednesday, December 06, 2006

పిచ్చి భారతం

తెరాస ప్రతినిధి TV9 లో : "భారత రాజకీయాలు ఒక తులసి వనం అయితే, కాంగ్రెస్ అందులో ఒక కలుపు మొక్క"

పిచ్చి పుల్లయ్య : వార్నీ నీకు మన రాజకీయాలు తులసీ వనంలా అగుపిత్తాన్నాయట్రా...ధూ...మన రాజకీయాలను పేడతో పోలిస్తే పిడకలు అలుగుతాయి, గొబ్బెమ్మలు నీలుగుతాయి. మిమ్మల్ని గాడిదలతో పోలిత్తే అవి సేస్తున్న పని మానేసి పారిపోతాయి. మీకు ఇంకొకిరితో పోలికేంది సామీ..మీరందరూ మీకు మీరే సాటి. అందరూ ఆ తాను ముక్కలే.

 

నరేంద్ర విజయ దరహాసంతో : "కరీంనగర్ ప్రజలు తెలంగాణా పోరాటానికి ఒక కొత్త అర్ధం చెప్పినారు, ఈ ఫలితం చాలు తెలంగాణా సాధనకు"

పిచ్చి పుల్లయ్య : పులి బాబు గారు, మరక్కడ ఏభై శాతమే పోలయినాయంట గందా? గుర్తింపు కార్డున్న ఓటరులెంతమంది? అందులో ఏభై శాతం ఎంత మంది? ఈ ఏభై శాతంల రిగ్గుంగు ఎవరూ (అంటే తవరు గాదు, ఎగస్పార్టీ వాళ్ళు..అట్టా గుర్రుగా సూడమాకండి బావు) సెయ్యనేదంటారా? పోలీసులు జనాల్ని బయపెట్టేసినారంట గందా? సారా, దుడ్డుకోసరమని పోలీసులకు బయపడకుండా లగెత్తుకొచ్చిన జనాలు ఓటేసేటప్పుడు బయపడ్డమేంది సెప్మా? అహా...నాకు సిన్న డౌటండి సారు.ఇవన్నీ తీసేత్తే అసలు మనస్పూరకంగా ఓటేసినోల్లెంతమందండి బాబు?

 

కరుణానిధి : "అతనికి టెండూల్కర్ అని పేరు రావటానికి కారణం అతని పరుగులన్నీ పది లోపల ఉండటమే"

పిచ్చి పుల్లయ్య : మరి తమరి పేరు లోని "కరుణ" ఎంత ? నిధి ఎంత సారు? తమరికి ఆ జయ అమ్మాయిగోరి చీరూడిపించిన సెరిత్ర ఉంది గందా...

 

తెరాస ప్రతినిధి TV9 లో : "మాకు వస్తున్న అభినందనల ఫోన్ కాల్స్ లో చాలా మంది కాంగ్రెస్, తెలుగు దేశం కార్యకర్తలు ఉన్నారు. వారు వారి పార్టీలకు ప్రచారం చేసినా మాకే ఓటేసారంట. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఎవరు గెలుస్తారో"

పిచ్చి పుల్లయ్య : ఆచ్హెర్యంగా ఉంది సామి. తవరి ఆనందం సూత్తే నవ్వాల్నో, ఏడవాల్నో తెలియగుందుండి. చానా మంచిది. కానీ అట్టాంటి నీచ్ కమీన్ కుత్తే కార్యకర్తలని తవరు పార్టీలోకి పొరపాటన రానీకండి సామీ...తమరి వీపు ఎప్పుడో ఇలానే విమానం మోత మోగించేత్తారు...

12 comments:

Anonymous said...

hahaha.... P.Pullaiah comments are fantastic

Anonymous said...

ఇంత తెలివిగా మాట్లాడిన వాడు పి.పు. అవుతాడా?

Anonymous said...

సుధాకర్! మీ వ్యాఖ్యలు సమయోచితంగా, పదునుగా, చురకలంటించేలా ఉంటూ ఉంటాయి. ఈ జాబు లోని వ్యాఖ్యలు కూడా ఆ కోవలోవే! నాకెంతో నచ్చాయి. మీరిలా రాస్తూనే, చురకలు వేస్తూనే ఉండండి.

అన్నట్లు మీ బుడగబొమ్మల విశేషం బాగుంది. ఎలా చెయ్యాలో మాకూ చెప్పండి!

Anonymous said...

స్నాప్ చూసాను సుధాకర్. నేనూ పె(ప)ట్టేసాను, తేలిగ్గానే ఉంది.

Anonymous said...

రాజకీయాలు ఇన్ని అరాచకీయాలు చేస్తున్నట్లు తెలిసినా ఓటెయ్యటం తప్ప మరేమి చెయ్యలేని వాడు రక్షకుడి కోసం పిచ్చి చూపులు తప్ప ఇంకేం చెయ్యగలడు? అందుకని సగటు ఓటరు ఎప్పుడూ ఒక పిచ్చి పుల్లయ్యే :-)

Anonymous said...

mee weblog chaala bagundandi

Anonymous said...

ayitE nEnu kUDA pichchi pullayyanE

Anonymous said...

దులపరా బుల్లోడా.. దుమ్ము దులపరా బుల్లోడా అని.. బావు౦ది :)..
ఇ౦తకి పనిలో పని అని ప్రతీ పి.పుల్లయ్య తో ఇ౦టర్వ్యూ ఇస్తు౦దని TV-9 కి కూడ ఒక చురకా ??

Anonymous said...

TV9 ఒక అతి'టెలివి' టీవి. వారి విజన్ ఏంటో ఒక్కరికి అర్ధం అయితే ఒట్టు. తనికెల్ల భరణి తెలుగు అంటే ఇష్టం లేని ప్రభుత్వమనీ, తెలుగు అంటే బాధ్యతలేని ప్రభుత్వం అని తిట్టే "9pm with ravi prakash" ఇంటర్వ్యూ ముక్కను రోజుకు పది సార్లు చూపించే ఈ ప్రసార వాహిక, తాము మాత్రం పక్కా బట్లరు ఇంగిలిపీసును రోజూ వాడుతారు.

తెలుగును మరీ డి.డి8 లా వాడనక్కరలేదు. కనీస స్థాయి గౌరవాన్నిచ్చి పదాలు కలిపే చోట వాడినా బాగుండును. లేక పోతే కొన్నాల్లకు వారు గిరీశం టీవి అని పేరు మార్చుకోవచ్చు. (ఏదో, ఎవరినో ఉధ్ధరిస్తున్నామనుకుంట..)

Anonymous said...

super gaa chepparu sudakar garu... anthe ee pichi vallu atuvipu vally kudaa pichivallu anukone matladataremo.

Anonymous said...

నాకైతే ఈ నాయకులు అతితెలివి చూపిస్తున్నారా లేక మనని ఉత్త వెదవలనుకుంటున్నారా వాళ్ళు ఏది చేప్తే అది నమ్ముతారని. ఐనా ఈ మాట అనేది ఫ్రీ కదా అందుకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. కరీం నగర్ గెలవగానే తెలంగాణ చేతిలోవచ్చినట్టు పిచ్చి గంతులేస్తున్నారు యెదవలు. మధ్యలో ఈ ఎమెస్సార్ ఓ బఫూన్. ఎం మాట్లాడుతున్నాడో అతనికే తెలీదు. అసలు వీళ్ళ గురించి ఇలా రాయడమే వేస్ట్. ఇవన్ని చూస్తుంటే మనము ఓటేయాలా వద్దా????????

Anonymous said...

నా జాబును చదివి ఆనందినందుకు అందరికి నా ధన్యవాదాలు :-)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name