Monday, December 11, 2006

చొప్పదంటు పరిశీలన...

గతంలో మీకు ఆంధ్ర జ్యోతి లో దంటు కనకదుర్గ గారు రాసిన ఒక చొప్పదంటు పరిశీలన గుర్తు ఉండే ఉంటుంది. లేకపోతే ముందర ఇది చదవండి. కాసేపు కింద పడి నవ్వుకుని మరలా ఇక్కడికి రండి.


కనకదుర్గ గారు వీరావేశంతో చేసిన ఆ పరిశీలన (ఈవిడకి కొంపతీసి డాక్టరేటు రాలేదు కదా?) చదివి చాలా మంది ఆవేశపడ్దారు, కొంత మంది చిరాకు పడ్డారు, కొంత మంది నవ్వుకున్నారు, కొంత మంది తిక మక పడ్డారు. నేను మాత్రం నోరు ముయ్యటం మర్చి పోయాను. ఎందుకంటే తెలుగు అనే పదాన్ని సృష్టించింది ముస్లిం పాలకులని ఈవిడ అభిప్రాయం. ఈమె ప్రకారం పోతన భాగవతం కూడా తెలంగాణ యాస లోనే రాశాడు కానీ, ఆంధ్ర ప్రచురణ కర్తలు దాన్ని శ్రీ మధాంధ్ర భాగవతం చేసి పారేశారంట...కాళోజి అనే కవి (ఇతనాంధ్రుడో, తెలుగు వాడో, తెలంగాణా వాడో...) రాసిన ఆంధ్ర తిట్ల పురాణం (అతగాడి యాసని ఎవడో వెక్కిరించాడంట విజయవాడలో..అందుకని ఇక ఆ వెక్కిరింత తెలంగాణ అందరికి వెక్కిరింత అని అనేసుకుని రంగంలోకి దిగి పేజీలకు పేజీలు ప్రజా కవిత్వం రాసారీయన) ఉదాహరణగా చూపటం ఒక మూర్ఖత్వం అవుతుంది. కాళోజీకి ఆ మాత్రం సువిశాల భావ చైతన్యం లేకుండా అంత పేరు ఎలా వచ్చిందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరు ఆంగ్లం కలపి మాట్లాడం లేదు తెలంగాణ గడ్డ మీద? తరతరాలుగా ఎకసెక్కాలకు గురవుతున్న ఉత్తరాంధ్ర యాస సంగతి ఏమిటి? వంద శాతం తెలుగు ఉండి కూడా అపహాస్యానికి గురి అవుతున్నదే? ఆ లెక్కన తప్పు తడకల బానిస బతుకుల ఉర్దూ సంకరం ఉన్న యాసకు ఒక జాతి అని పేరు ఎలా పెట్టిందో ఈ మహానుభావురాలు నాకు అర్ధం కావటం లేదు. యాసకైనా తల్లి భాషే...అది తెలుగు తల్లి మాత్రమే. ఎవరైనా భాషను అన్య భాషలతో సంకరం చేసుకుంటే అది వారు ఖర్మ, అంతే గాని కాళోజీలా దానికి ఆంధ్ర భాష అని పేరు పెట్టనక్కరలేదు.

ఈ దంటు దుర్గ గారి వ్యాసం మీద తాజాగా ఆంధ్ర జ్యోతిలో పులికొండ సుబ్బాచారి గారు రాసిన వ్యాఖ్య చదవండి..సాయి బ్రహ్మానందం గారు రాసిన వ్యాఖ్యలు కూడా చదవండి.

రాజకీయాలు ధనానికి, మద్యానికి, బంధు ప్రీతికి పట్టం కట్టి, జనాలను కొల్లగొట్టినా సహిస్తున్నారు ప్రజలు, గానీ ఇలా తల్లి రొమ్ము గుద్ది పాలు తాగాలనుకోవటం భయంకరమైన ఆలోచన.

3 comments:

radhika said...

aavida anni saakshyaalathoa alaa vivariste naalanti vaallu nammaka emi ceastaaru.amtha balam gaa ceppaaru aame.

రవి వైజాసత్య said...

పులికొండ సుబ్బాచారి వ్యాఖ్య చాలా హేతుబద్దంగా ఉంది. కాస్త కామన్‌సెన్స్ ఉన్న వ్యక్తి అనుకుంటా

spandana said...

అమ్మయ్య! దుర్గ గారికి గడ్డి బాగా పెట్టారు.
ఆరోజు జిన్నా హిందువులు వేరు ముస్లిములు వేరు అని భారతాన్ని విడదీస్తే ఇప్పుడు విడదీయటానికి ఇలాంటి సంకుచిత వాదాలను నెత్తికెత్తుకొని ౠజువుల్లేని వాదాలు చేసే దుర్గ లాంటి వారికి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ గడ్డి ఇలానే పెడుతూ వుండాలి.
--ప్రసాద్
http://blog.charasala.com

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name