పొద్దు ఈ-పత్రిక చూసారా? ఇది మరొక బ్లాగో, లేదా పత్రికో మాత్రం కాదు. ఇంటర్నెట్ లో తెలుగు తేజాన్ని అన్ని కోణాలలో పరిశోధిస్తూ, అభినందిస్తూ చక్కని పరిశోధనాత్మక వ్యాసాలు అందించే తెలుగు కుసుమం అని చెప్పవచ్చు.
ఈ ప్రయోగకర్తలు చదువరి గారికి, త్రివిక్రం గారికి, మరియూ వీవెన్ గారికి హార్దిక శుభాభినందనలు.
మొదటి సంచికలో నా అభిమాన బ్లాగరు రా.నా.రె పరిచయం కావటం ఎంతో ఆనందంగా ఉంది.
3 comments:
పొద్దును మీ బ్లాగు కెక్కించినందుకు చాలా థాంక్సండి, సుధాకర్ గారూ!
ఆహా! ఆనందంతో మనసు నిండిపోయింది. ధన్యుణ్ణి. పొద్దుపొడుపులో తొలి ఆతిథ్యం అందించిన త్రివిక్రమ్ గారికి రుణపడ్డాను.
పొద్దు పొడిచిన తెలుగు తేజాలకు అభినందనలు. రానారె మొదటి అతిథి కావటం ముదావహమే కాదు, సమంజసం కూడ. రచనలన్నీ మంచి క్వాలిటీతో మొదలు పెట్టారు. ఆ విషయంలో రాజీ పడవద్దని మనవి. పొద్దుని పరిచయం చేసినందుకు సుధాకరుని శోధనకు దండాలు.
Post a Comment