కంప్యూటర్ తో, ఇంటర్నెట్ తో కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారందరు ఈలేఖలు రాయటం అనేది తప్పని సరిగా చేసి తీరుతారు. లేక పోయినా ఏదో ఒక రకంగా పదాలను టైప్ చెయ్యటం మాత్రం తప్పించుకోలేరు. రోజూ కంప్యూటర్ తోనే సహవాసం చేసే వాళ్ళకు కీబోర్డు వాడటం బాగానే ఉంటుంది గానీ, వయస్సులో పెద్ద వారికి, వికలాంగులకు ఇది చాలా సంకటంగా ఉంటుంది. ఇక తెలుగులో రాయాలంటే చెప్పాలా?
సరిగ్గ ఇటువంటి వారికోసమే తయారు చేసిన సాఫ్టువేరు "డాషర్"
ఒక్క ముక్కలో చెప్పాలంటే దీనిని ఉపయోగించి రాయాలంటే ఒక కీ కూడా నొక్కనక్కరలేదు. అక్షరాలను త్రిమితి అంతరిక్షంలో ఏరుకుంటూ ఒక పక్క పేర్చుకుంటూ పోవటమే. ఇది చాలా భాషలలో ఉపయోగించవచ్చు. మన తెలుగు కూడా అందులో ఉంది.
పైన సరి చూసే గీత చూసారు కదా. అది స్థిరంగా ఉంటుంది. ఎంపిక గీత అనేది ఒక పాయింటర్ లా నాలుగు వైపులా తిప్పవచ్చు. ఈ గీతను పదాల అక్షాంశానికి దగ్గరగా, దూరంగా తీసుకుపోతూ ఉంటే అవి పెద్దవిగా,చిన్నవి గా మారుతూ ఉంటాయి. మనకు కావాల్సిన అక్షరం సరి చూసే గీత మీద ఉన్న + మీదగా పోనించి దాటిస్తే దానిని ఏరుకున్నట్లే. అలా ఏరుకున్న పదాలు "రాసిన పదాలు" అనే చోట చేర్చ బడతాయి. ఇది చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది గానీ, అత్యంత సులభమైన రాత పధ్ధతి.
ఇక ఆంగ్లబాష అయితే T9 (predictive text input) సౌలభ్యం కూడా ఉంది. అంటే Hello అని రాసిన తరువాత How, are, you అనే అక్షరాలు నన్ను ఎంచుకుంటావా అన్నట్లు మన దగ్గరలోకి వచ్చేస్తాయి :-)
ఇది పక్కగా పరిశోధనలతొ చేసిన సాఫ్టువేరు. దీనిని గొంతుతో, కళ్ళతో కూడా అక్షరాలను ఎంచుకునే సౌలభ్యం కల్పించారంటే ఇక దీని స్థాయి అర్ధం అవుతుంది.
మీరు ఇంకా తెల్లమొహంతోనే ఉంటే ఈ వీడియో చూడండి. అర్ధం అవుతుంది.
3 comments:
naaku video open avvatledu.
వీడియో చూశాక బాగా అర్థమయ్యింది. అలవాటైతే ఇది వేగంగా చేయొచ్చనిపిస్తోంది.
--ప్రసాద్
http://blog.charasala.com
చాలా అడిక్టివ్ గా ఉంది.
నేను డౌన్లోడు చేసి మరి ప్రయోగాలు చేసా.
తెలుగులో ఏదో training ఇచ్చి random గా లాగితే ఇలా వచ్చింది.
"ఉదాహరణకు ఉచినప్పుడు చెప్పిన రెడు కాబట్టి నేను చూస్తున్నారు. దీనిని అర్థ చేసుకుని వుడ్ నిర్ణయిచడ జరిగిది. అప్పుడు అతని ముదు ముదు మీరు కూర్చున్న "
చాలా తెలివైన program లా ఉంది.
కాని గమనించండి అందులో సున్నాని program చేయడం మరచి పోయారు !!
రెండు - రెడు
ముందు - ముదు etc. గా వస్తున్నాయి.
Post a Comment