నాకు తెలియదు....
అంతా చట్ట ప్రకారమే...
చంద్రబాబును కోర్టుకు వెళ్ళమనండి..
ఏదీ తెలియకపోవడమే నాకున్న పెద్ద మంచి లక్షణం...
సీ.ఎన్.ఎన్ ఐ.బి.ఎన్ వారి "చీల్చి చెండాట" భలే వుంది. సమాజం కోసం అని చంకలు గుద్దుకునే TV9 ఒక్క సారి ఈ ఛానల్ వారి నాణ్యత చూస్తే మంచిది. రేప్పొద్దున్న ఈ ఛానల్ చంద్రబాబును కూడా ఇలానే ప్రశ్నలు అడగవచ్చు.
ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒకటి అర్ధమైంది. పిచ్చ కోపం వచ్చినప్పుడు రాజశేఖరరెడ్డి నవ్వుతారని. :-) ఇది Art Of Living స్టయిలా? లేకపోతే మున్నాభాయి MBBS మామూ స్టయిలా :-)
మొత్తానికి మన CM గారికి చాలా ఇంటి విషయాలు తెలియవని అర్ధం అవుతుంది. చాలా ప్రదేశాలలో తనకు భూములు వున్నందువలన కొన్ని (తన సొంత Income Tax declarations) తనకు తెలియవని వారు సెలవిచ్చారు. ప్రతి పది నిమిషాలకు "చంద్రబాబును కోర్టుకు వెళ్ళమనండి" అని సవాల్లు విసిరారు. తను ప్రజలకు జవాబుదారీ కానీ చంద్రబాబుకు కాదని అతను ఎప్పుడు అర్ధం చే్సుకుంటారో. "నా ప్రజలలో ఎవరినైనా కోర్టుకు వెళ్ళమనండి" అని వుంటే బాగుండేది. మొత్తానికి విషయమేమిటంటే...ఏ చెత్త పని అయినా చెయ్యు. కానీ చట్టానికి దొరకని విధంగా చెయ్యు. ఎదుటి వాడిని కోర్టుకు వెళ్ళమని సవాలు చెయ్యు. ఇదండీ మనం నేర్చుకోవాల్సిన ఆధునిక నీతి.
ఇంటి విషయాలు అస్సలు పట్టించుకోకుండా, రాష్ట్రానికి సేవలు చేసే ముఖ్యమంత్రులు ఎందరుంటారు చెప్పండీ. కోటికొక్కరుంటారేమో ! ఎంతైనా ఆంధ్రులు అదృష్టవంతులు. :-)
10 comments:
సెహ్ భాష్... సెహ్ భాష్...CNN-IBN.
ఇలాంటి దానిమీద ఇంత తక్కువ టపా రాసారు. ఒక పేజి అంతా కుళ్ళ బొడిచేయచ్చు ఈ ఇంటర్వూ మీద.
అబ్బా ఎంత కుమ్మేశాడు ముఖ్యమంత్రి ని ఇంటర్వూ పేరు చెప్పి. రాజశేఖర రెద్ది మొహం మీద కత్తి వేటుకు నెత్తురు చుక్క లేద.
"...you are saying go to the court everytime like giving burfi to the kid... అనేది దయితే అల్టిమేట్. మన వాళ్ళు ఎప్పుడు చేరుకుంటారో ఈ దశకు.
చాలా మంచి లంకె ఇచ్చారు.
విహారి
http://vihaari.blogspot.com
థాపర్ నిజంగానే చీల్చి చెండాడి నట్లున్నాడు. TV9 వాళ్ళు ఇలాంటివి చెయ్యడం కలలోని వాట. నాకు వారి "For a better society" నినాదం చూసినప్పుడల్లా "better" లో రెండో అక్షరంగా 'i' బదులు 'e' పొరపాటున వ్రాశారేమోనని పిస్తుంది.
He is one of the best interviewer in the world. CM can't do anything much except laughing.
రాజశేఖరా...మత్తు వధులరా ...నిదుర మత్తు వధులరా. పలుకగా లేక, పదములే రాక,....ఇంకేం చేస్తారు నవ్వక !
ఇది మనం ఎన్నుకునే ముఖ్యమంత్రులు, రాజకీయనాయకుల మానసిక బలం ఎంత తక్కువుందనేది చూపించింది. ప్రతీ ప్రశ్నకూ "నాకు తెలియదు","అంతా చట్ట ప్రకారమే" అనటం బుద్ధి తక్కువే. చట్ట విరుద్ధంగా ఏ ప్రభుత్వం పని చేయలేదు.
విహారి గారు,
మీరన్నది నిజమే గానీ...ధాపర్ ఇంటర్వ్యూ ముందు మనం ఎన్ని పేజీలు రాసినా దిగదుడుపే. అందువల్లనే నేను ఆ ప్రయత్నం చెయ్యలేదు. మజా కావాలంటే ఈ ఇంటర్వూ చూసి విని తీరాల్సిందే :-)
నేను ఇంటర్వ్యూ చూడలేదు కాని ఈనాడులో స్క్రిప్ట్ మొత్తం చదివి చాలా అనందిచాను. మనకు కనీసం ఇలాంటి వార్తలు చదివి, ఇంటర్వ్యూలు చూసి ఆనందించే అవకాశం కలిగించిన థాపర్ గారికి వెయ్యాలి పది వీరతాళ్ళు.
ఐనా రాజశేఖరుడు ఎన్ని సార్లు సవాళ్ళు విసిరినా కుడా మన చంద్రబాబు కోర్టుకెళ్ళి కేసేస్తాడా యేంటి??
మీకెవరికైనా రాజశేఖరుడు ప్రతిపక్షంలో వుండగా మన చంద్రబాబు మీద కోర్టుకెళ్ళి తర్వాత తూచ్ తూనాబొడ్డు మాకు మాకు కేసులేంటన్న విషయం గుర్తుందా?
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా అంతా ఆ తాను (కాంగ్రెస్/రాజకీయ) ముక్కలేగా.
భవదీయుడు
రాజేంద్ర ఆలపాటి
భలే...భలే! రాజశేఖరున్ని మూడు చెఱువుల నీళ్లు తాగించారు థాపర్ మహాశయులు! కానీ రాజేంద్ర గారన్నట్టు రెడ్డైనా-నాయుడైనా దొందూ దొందే! ఇద్దరూ తోడుదొంగలు...అదే రాజకీయం!
భలే భలే థాపర్ మహాశయా!
కనీసం రాజా వారు ముడు చెరువుల నీళ్ళు తాగినట్లున్నారు. మీరన్నట్లు మున్నాభాయ్ లో మామూలా నవ్వుతుంటే నాకు తెగ సంతోషమేసింది. ఈ ఇంటర్వ్యూ కు ఒప్పుకొని జీవితంలో అతిపెద్ద తప్పుచేశానని కుమిలిపోయి వుంటాడు ఆ తర్వాత.
--ప్రసాద్
http://blog.charasala.com
భలే భలే థాపర్ మహాశయా!
కనీసం రాజా వారు ముడు చెరువుల నీళ్ళు తాగినట్లున్నారు. మీరన్నట్లు మున్నాభాయ్ లో మామూలా నవ్వుతుంటే నాకు తెగ సంతోషమేసింది. ఈ ఇంటర్వ్యూ కు ఒప్పుకొని జీవితంలో అతిపెద్ద తప్పుచేశానని కుమిలిపోయి వుంటాడు ఆ తర్వాత.
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment