ఆఖరి వారం స్నేహితులతో సరదాగా గోల్కొండ వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు పై సంచికలో పెట్టాను.
నేను గోల్కొండ వెళ్ళడం అదే మొదటి సారి. ఎంతో ఊహించుకున్న నాకు గోల్కొండ దుస్థుతి చూసి బాధ వేసింది. ఎక్కడ పడితే అక్కడ చెత్తా, చెదారం, అతి అపురూపంగా ఉంచుకోవాల్సినా గోడలపై ఐ లవ్ యూ రాతలు. మన దేశంలో ప్రేమ ఎక్కువో, పోయేకాలం ఎక్కువో అర్ధం కాదు. ఇదే గోల్కొండ స్పెయిన్ లోనో, బ్రిటన్ లోనో ఉంటే దానిని అద్భుతంగా తీర్చి దిద్ది భారీగా టికెట్టు కూడా పెట్టే వారేమో. చాలా విచిత్రంగా మన గోల్కొండ టికెట్టు కేవలం ఐదు రూపాయలు.
ఉండేది చెత్తా చెదారమయినా, అందాల ఫోజులకు ఏమీ తీసి పోనంది గోల్కొండ. చూసి ఆనందించండి. :-)
4 comments:
గోల్కొండ ఇంద అందంగా మీ ఫోటోలలోనే కనిపించింది.ఇలా ఎలా తీసారు? ఏ కమెర వాడారుఉ
I also got surprised on seeing the plight of Golconda fort. People are considering it as a park and not as a precious monument.
కొన్ని ఫొటో లు చాలా బాగా వచ్చాయి.అసలు గోల్కొండ కన్నా మీ ఫొటోల్లో గోల్కొండ చాలా అందం గా అనిపించింది.నేను చూసినప్పుడు చాలా డిసప్పోయింట్ అయ్యాను.
నేను సోనీ W50 కెమెరా 3.2 మెగా పిక్సెల్ లో వాడానండి. ఇక మిగతా అందమంతా పికాసా మహత్యమే :-)
Post a Comment