హమ్మయ్య చాన్నాళ్ళకు కేంద్రం ఒక మంచి పని, అదీ క్యాపిటల్ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ చేసింది. ఇకనుంచి ఏ కంపనీ
అయినా ఎన్ని కోట్లు పెట్టి కొన్నా, వారు ప్రసారం చేసే అన్ని భారత్ ఆడే క్రికెట్ మ్యాచులు, భారత్ లో జరిగే క్రికెట్ మ్యాచులు ప్రసార వాహికను ప్రసార భారతికి తప్పని సరిగా ఇవ్వాలి. ఆ విధంగా కేంద్రం ఒక ఆర్డినెన్సు జారీ చెయ్యటం ముదావహం.
టీమ్ మనది….
పిచ్చిగా అభిమానించి, క్రికెటర్లను దేవుళ్ళు చేసి, క్రికెట్ ను కాసులు కురిపించే ఆటగా మార్చేసిన అభిమానులు మన వాళ్ళు….
క్రికెటర్లు రక రకాల ప్రకటనలలో కనిపించి నేను అది వాడతా, ఇది వాడతా, ఇది నా సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ …మీరు వాడంది అని చెప్పేదీ మనకే….
ప్రసార భారతి మనది...
ఆడే స్టేడియాలు మనవి...
మహా మాయగాడు జగ్మోహన్ దాల్మియా పుణ్యాన బీ.సి.సి.ఐ ఈ రోజు ఇవన్నీ విస్మరించి ప్రసార హక్కులు (నిజానికి చూసే భారత అభిమాని హక్కులు) ఒక పాశ్చాత్య మీడియా కంపనీకి కట్టపెట్టడం పూర్తిగా బాధ్యతారాహిత్యం. వారు మొండిగా దేశంలో 2% కూడా చూడని NEC sports అనే ప్రసార వాహికలో ప్రసారం చెయ్యటం ఇంకా విడ్డూరం. ఇదొక రకమైన నూతన స్వేచ్చా దోపిడి అన్న మాట.
మన దేశం వచ్చి, మన వాళ్ళు ఆడే ఆటను, మన ప్రసార భారతికి, మనకు ప్రసారం చెయ్యటానికి నిబంధనలు, ఆంక్షలు పెట్టడం…
ఇలాంటివి ముందు ముందు ఏ రంగంలోనూ జరగకుండా భారతీయులు జాగ్రత్త పడాలి. లేకపోతే వేల కొద్ది ఈస్టిండియా కంపనీలు ఇండియాలో తిష్ట వేస్తాయి, తమ పరపతితో పార్టీలను, ఎం.పిలను కొనటం మొదలు పెడతాయి. ప్రజల బతుకు బానిస బతుకై పోతుంది.
బహు పరాక్.
1 comments:
మంచి మాట చెప్పారు. ఇదే స్ఫూర్తి మిగతా రంగాల్లో కూడా మన రాజకీయ నాయకులు చూపిస్తే ఎంత బాగుండు.
Post a Comment