రాముయో : ఒరే సోముయో ఈ బ్లాగు, కూడలి ఇవన్నీ ఏమిట్రా (ఏడుపు మొహంతో)
సోముయో : ఏం ఎందుకడుగుతున్నావ్? అరె.. ఏరా ఆ ఒళ్ళంతా దెబ్బలేంది. ఏమయింది.
రాముయో : ఆ గీతాని గత పది రోజుల నుంచి లైన్ వేస్తున్నానా?
సోముయో : అవును…అందుకని ఇలా నిన్ను పోలిసులతో కొట్టించిందా (కోపంగా)
రాముయో : లేదురా, గీతకొక అన్న ఉన్నాడు. వాడు ఇప్పటికి నాకు ఆరు సార్లు వార్నింగులు ఇచ్చాడు. అవి నేను లెక్క చెయ్యటం లేదని చితక బాదాడు..ఆబ్బా..
సోముయో : ఒరేయ్ మరి వాడలా వార్నింగులు ఇస్తే , జాగ్రత్తగా ఉండాలి కదరా…ఎందుకు ఆ అమ్మాయి వెనక పడ్డావు.
రాముయో : వాడు…..వాడి తెలుగు బ్లాగులో వార్నింగులు ఇచ్చాడంటరా, నాకెట్టా తెలుస్తుంది…వా….వా….వా. క్షమాపణ కూడా అదేదో వ్యాఖ్యలలో చెప్పాలంట. లేక పోతే రెండో కోటింగు ఉంటాదంట...వా...వా..
సోముయో : ఆ !
5 comments:
చాలా బావుంది.
:)
Raamuyo is a Telugu form of Romio ? :-)
:)
--ప్రసాద్
http://blog.charasala.com
కొత్తజోకు. ఇది తెలుగులో బ్లాగుజోకులకు నాంది ఔతుందేమో చూద్దాం.
Post a Comment