Wednesday, February 21, 2007

మాతృ భాషా దేవో భవ...

ఈ రోజు ప్రపంచ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా TV9 మన తెలుగు ప్రజలు తెలుగుని ఎంత వుపయోగిస్తున్నారు అనే విషయం మీద చిన్న సర్వే చేసారు. అట్టా ఆశ్చెర్యపోకబ్బాయ్…అప్పుడప్పుడు దయ్యాలు కూడా వేదాలొల్లిస్తాయ్ మరి. మొత్తానికి ఏదయితేనేం సర్వే చేసారు.

ఈ సర్వేలో తెలిసినదేంటి అంటే చాలా మందికి అచ్చులు ఎన్నో, హల్లులు ఎన్నో తెలియవు.

కొంతమంది ఋ, ౠ లను మర్చిపోయారు

కొంతమందికి హల్లులు నాలుగేనంట :-) (కొంపతీసి A B C D లా? )

ఒకరేమో తెలుగులో అచ్చులు, హల్లులు వుంటాయని మీరడిగితేనే తెలిసింది.

వీటన్నింటికి కారణం మనకు ఆంగ్లంపై వున్న మక్కువనుకుంటున్నారా? కానే కాదు. తల్లి తండ్రులు అంతకన్నా కాదు. అస్తవ్యస్తంగా వున్న విద్యా వ్యవస్థ, అరకొర జీతాలతో బతుకుతున్న ఉపాధ్యాయులు…అసలు తమకే సరిగా విద్య రాని ఉపాధ్యాయులు దీనికి ప్రధాన కారణం.

అయితే ఒక్కటి మాత్రం నిజం. తెలుగు ఒక భాషగా మాత్రం చచ్చిపోయే ప్రసక్తే లేదు. కొన్ని కోట్ల రూపాయల టీ.వీ ఛానల్లు, సినిమా పరిశ్రమ ఈ భాష మీదే బ్రతుకుతున్నాయి మరి. అవి ఎంత పెరిగితే తెలుగు అంత క్షేమం (ఎదో ఒక రూపంలో).

ఒక్క సారి అచ్చులు , హల్లులు చూడటానికి బాల శిక్ష చూద్దాం పదండి.

http://balasiksha.wordpress.com/

6 comments:

రాధిక said...

టీవీ సీరియల్స్ వుండగా తెలుగు మీద మనకు చింతేలా?సినిమాల్లో ఎక్కువ ఇంగ్లీషు వుపయోగిస్తున్నారు.సీరియల్స్ లో ఇంకా అంత విప్లవం రాలేదు.

స్వేచ్ఛా విహంగం said...

TV9 ఎంత తొందరగా మూత పడితే తెలుగు అంత తొందరగా వ్రుధ్ధి చెందుతుంది.

పవన్‌_Pavan said...

సుధాకర్‌ గారూ, మీరు "భాష"ని "బాష ", అంటున్నారు, సరిచేయగలరు.

బాలశిక్ష link ఇచ్చినందుకు ధన్యవాదాలు!!

Sudhakar said...

నాకున్న అప్పుతచ్చు అలవాట్లలో అది ఒకటి. తప్పక సరి చేస్తాను. సరి దిద్దినందుకు ధన్యవాదాలు.

Anonymous said...

మన మాతృ భాషని ఇంకా చక్కగా, వ్యవహరణలో పెట్టడానికి తెలుగు TV ఛానెళ్సు కూడా సహకరిస్తే బావుంటుంది. మంచి భాషా ప్రావీణ్యం, సాంప్రదాయం గల యాంకర్స్ ని ఇప్పటికైనా పెడితే సంతోషం. సాఘం సమయమంతా సినేమా బాతాఖానీ తో సరిపెట్టకుండా, కనీసం ఇప్పటికైన ఈ వ్యవహారం మారుస్తే, ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఉదయ్ భాస్కర్ said...

ఈ మధ్య ఎదొ చలన చిత్రం లొ("అతడు" అనుకుంటా..) ఒక మంచి డయలాగు విన్న్నను, తక్కువ తెలిసిన వారు ఉపాధ్యాయులు అవుతున్నారు అంటే, అది గుర్తుకు వస్తుంది....

హీరొ వూరిలొ విశేషాలు ఎమిటి అని అడిగితే, కామేడి నటుడు సునీల్‌ అంటాడు
" పాసు అయిన వాళ్ళందరు ఉద్యొగం చేస్తున్నారు, అవ్వలేని వాళ్ళు స్కూలు పెట్టుకుంటున్నరు" అని....అదే కనుక నిజమయితే, మన తెలుగు భాష రాను రాను ఇంక తగ్గుముఖం పట్టటం లొ ఖాయం.మా అబ్బయి ఇంగ్లిషు మీడియము స్కూలు లొ చదువుతున్నడు అని గొప్పకు చెప్పుకునే ఈ కాలం లొ, ఒక, సినారే, ఒక విశ్వనాధ శాస్త్రి లాంటి వళ్ళు ఇంకా పుడతార అనేది కాలమే సమాధానం చెప్పలి? ...."నాన్న" అని పిల్లల చేత పిలుపించుకొవటం నమొషి అయిన ఈ కాలం లొ, తల్లితండ్రులు పిల్లలకి తెలుగు మీద మక్కువ కల్పిస్తారు అని అనుకొవటం ఒక కల.

ఎప్పుడయిన మన శాసన సభా సమావేశాలు చూసారా?...మన స్పీకరు గారు ఏ భాష మాట్లాడతారు?...

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name