2006 సంవత్సరానికి ఇండీబ్లాగీస్ వారి అవార్డులు ప్రకటించబడ్డాయి.
నా బ్లాగు అవార్డు గెలుచుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు బ్లాగుల మువ్వల సవ్వడి అంత అద్భుతంగా వుంది. దీనికి సాక్ష్యం వోట్ల సంఖ్య . దాదాపు అన్ని బ్లాగులూ మంచి ఎన్నిక శాతాన్ని సంపాదించాయి. అన్ని మంచి బ్లాగులే అయితే ఏది మంచిదో తేల్చుకోవటం కష్టమే కదా. ఇది చాల మంచి శకునం. ఖచ్చితంగా తెలుగు బ్లాగులకు మంచి రోజులొచ్చాయి. దీనంతటికి కారణమైన లేఖిని , కూడలి, తేనె గూడు మరియు తెలుగు బ్లాగుల ప్రపంచానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా బ్లాగుకు ఈ గుర్తింపు రావటానికి కారకులైన తోటి తెలుగు బ్లాగరులకు, నా బ్లాగు పాఠకులకు మనసా వాచా ధన్యవాదాలు. తెలుగు బ్లాగు పోటీల జ్యూరీ సభ్య్లులకు ధన్యవాదాలు.
ఈ e-తెలుగు ప్రపంచానికి తెలుగు బ్లాగర్లు, తెలుగు బ్లాగు పాఠకులే ప్రాణవాయువు . మీరు లేని ప్రపంచంలో బ్లాగింగు ఎడారిలో ఎలుగెత్తి మాట్లడమే అవుతుంది . తెలుగు బ్లాగులను ఇలాగే ఎప్పుడూ ఆదరిస్తారని, సద్విమర్శలతో దిన దిన ప్రవర్ధమానం చేస్తారని ఆశిస్తూ...మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్న....
మీ
సుధాకర్ (శోధన)
Friday, February 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
24 comments:
సుధాకర్, హార్ధిక శుభాకాంక్షలు. మాకు కూడా ఎంతో ఆనందం గా ఉంది. ఇలానే మీరు ఎన్నో విజయాలను గెలవాలని, మీ ఆనందం రెట్టేంపవ్వాలని కోరుకుంటున్నాను.
శుభాకాంక్షలు
శుభాకాంక్షలు సుధాకర్ గారు :)
హార్ధిక శుభాకాంక్షలు!
నా శుభాకాంక్షలు కూడా...
హార్ధిక శుభాకాంక్షలు సుధాకర్ గారు.
అభినందనలు సుధాకర్ గారు.
అభినందనలు
శుభాభినందనలు. భవిష్యత్ లో 'శోధన ' మరిన్ని శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ అవార్డుతో మీ భాధ్యత మరింత పెరిగింది. మాలాంటి తోటి బ్లాగర్లకి దిశానిర్దేశము చేసి, ముందునాటికి తెలుగు బ్లాగులు ఇతర క్యాటగిరిలలో కూడా అవార్డులు పొందేటట్లు చేయవలిసిన భారం మీమీదున్నది.
శుభాకాంక్షలు శోధన గారు. మీ బ్లాగు చాలా బాగుంది. :)
అభినందనలు
మీకు నా అభినందనలు. ఇలాగే కొనసాగించండి.
అభినందనలు
Congratulations Sudhakar gaaru
శోధనకీ సుధాకర్ గారికీ అభినందనలు.
ఇతర పోటీలలో వలె కాకుండా మిగతా పోటీదారులు కూడా విజేతకి అభినందనలు ఇలా పబ్లిగ్గా చెప్పటం మన తెలుగు బ్లాగర్ల సహృదయతనీ, సౌభ్రాతృ భావనలనీ చాటి చెపుతోంది - చాలా సంతోషం.
ఈ విజయాలు, మీకే కాదు, ఇప్పటిదాకా కేవలం "లర్కర్లు" గా ఉన్న వారిని సైతం స్ఫూర్తి నిచ్చి బ్లాగింప చేస్తాయని, తెలుగు బ్లాగుల్ని ప్రపంచ భాషల స్థాయిలో కెత్తుతాయని గుండెనిండా కోరుకుంటున్నా!
సుధాకరూ గెలిచితివయ్యా తెలుగు కప్పు.
అందుకో మరి నానుంచి మనసైన మెప్పు.
ఇక నుండి జాగ్రత్తగా పడాలి మీ ప్రతి స్టెప్పు.
మిత్రులంటారు తెలుగు కప్పు వచ్చిందనా ఆపవో నీ డప్పు.
మెప్పులిచ్చే విహారి
http://vihaari.blogspot.com
వచ్చిన అవార్డు కంటే ఈ వ్యాఖ్యలకే నేను తొమ్మిదవ మేఘంలో తేలిపోయానంటే నమ్మండి :-)
వల్లూరి గారు, తోటి బ్లాగర్లకు దిశా నిర్దేశం స్థితికి నేనింకా చేరుకోలేదండి. కాకపోతే మీరన్న భాధ్యత నా స్వేచ్ఛను హరించనంత కాలం నా భుజాలపైనే నిద్ర పోతుంది. అది ఒక తెలుగు బ్లాగరుగా నా హామీ :-)
క్రొత్తపాళీ గారు, మీరన్నది ముమ్మాటికీ నిజం. ఇలాంటి వాతావరణంలో ఓటమికి చోటు లేదు. ఎవరు గెల్చినా మనదే విజయం :-)
విహారి గారు, మీ పదాలు అదిరాయి. ముఖ్యంగా తెలుగు కప్పు:-) NTR, ANR లా కాకపోయినా జాగ్రత్తగా స్టెప్పులు వెయ్యటానికి ప్రయత్నిస్తా :-)
అభినందనలు.మీరిలానే దూసుకుపోవాలని ఆశిస్తున్నాను.
గురువుగారికి అవార్డు వస్తే శిష్యుడు ఎలాగ వుప్పొంగిపొతాడొ, అలాగ వుంది నా అనందం.
నాకు బ్లాగుల ప్రపంచానికి పరిచయం చెసిన నీకు అవార్డు రావటం నిజంగా చాల చాల అనంద కరమయిన విషయం..నువ్వు ఇంక ఎన్నొ ఎన్నొ విజయాలు సొంతం చెసుకుంటావని అశిస్తు...నీ బ్లాగు ని ఇలాగే అహ్లాదకరమయిన, అలొచింపచెస్తున్న, వివరమయిన విషయాలతొ మాకు అందిస్తువుంటావని అశిస్తూ, నీకు మరొ సారి శుభాకంక్షలు.
నీ శ్రేయొబిలాషి
గమనిక : సుధకర్ తొ నాకు వున్న పుర పరిచయం వల్ల నేను ఎక వచనము తొ సంబొదించటం జరిగింది. సుధా, నిన్ను నొప్పిస్తే నన్ను మన్నించు.
హమ్మ ఉదయం..ఎంత మాటన్నావ్ :-) ఇక్కడ గురువంటే మన మధ్య వున్న స్నేహం నొచ్చుకుంటుందేమో :-) నాకు కెమెరా పిచ్చి పట్టి coolclicks.blogspot.com మొదలు పెట్టేవరకూ వచ్చింది తమరి వలనే కదా ? :-) నాకు ఒకొక్క వ్యసనం ఒకొక్కరి నుంచి అప్పు తీసుకోవటం అలవాటు...ఇన్స్పిరేషనల్‍వి మాత్రమే ;-). శుభాకాంక్షలకు ధన్యవాదాలు :-)
లేటుగా చెప్పినా లేటేస్టుగా ఇలా... http://krishnadevarayalu.blogspot.com/2007/02/blog-post_23.html... నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందుకోండి!
ఇది నిజంగా గర్వపడాల్సిన విషయం. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు సుధాకర్‌గారు, బహుమతి మీకు ఆనందం మా అందరికి.
congratulations Sodhana Sudhakar,
Post a Comment