ఇది లోకంలో సగానికి పైగా వున్న సాఫ్టువేరు నిపుణులకు ఆనందకరమైన వార్త. ఇందుగలడందులేడను సందేహము లేని జావా భాషను కనిపెట్టిన సాఫ్టువేరు శిల్పి జేమ్స్ గోస్లింగ్ (జాగ్ గా అందరికి పరిచయం) ని కెనడా ప్రభుత్వం వారి ఉన్నతమైన గుర్తింపు ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ కెనడాతో సముచితంగా సత్కరించుకోనుంది.
ప్రస్తుతం జాగ్, సన్ మైక్రో సిస్టమ్స్ లో ఉపాధ్యక్షులుగా వున్నారు. జాగ్ బ్లాగు ఇదిగో ఇక్కడ చూడండి.
4 comments:
2004 లో హైద్రాబాద్ లో జరిగిన SUN TECH DAYS నేను ఆయన్ను ప్రత్యేక్షంగా చూసా ..అంత పేరు గల వ్యక్తి అయినా ఎంతో సింపుల్ గా అచ్చూ ఈ ఫోటో లో లాగే టీ షర్ట్ వేసుకొచ్చరు .. చేతి లో ఒక మాక్ నోట్ బుక్ తో వచ్చారు . కేవలం 10 ని ప్రసంగించారు ..కానీ 10 ని ఆ రోజుకే హైలైట్ . మధ్య మధ్య మైక్రోసాఫ్ట్ కి చురకలంటించారు .. కాక పోతే నేనూ మా ఫ్రెండ్ ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు .. కానీ ఆయన చేతుల మీదగా ఒక టీ షర్ట్ మాత్రం తీసుకున్నా :)
OOPS !!
ఇప్పుడే డైరీ చూస్తే గుర్తొచ్చింది , ఆ రోజు ఆయన బర్త్ డే .. అక్కడే స్టేజ్ మీదే కేక్ కట్ చేసారు , దీని గురించి ఆయన తన బ్లాగ్ లో కూడా రాసుకున్నారు
http://blogs.sun.com/jag/entry/home_at_last_for_a
ఇప్పటి SUN TECH DAYS 2007 లో మొత్తం మారిపోయింది అయితే :-) దాదాపు అన్ని రకాల SOA, WS-*) ప్రజంటేషన్ లలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా జరుగుతున్న పనులు చెప్పటం జరిగింది :-) నేను కొంత డబ్బులు తగలేసుకొని తల బొప్పి కట్టించుకున్నాను ఈ సారి. అత్యంత నిరాశాజనకంగ జరిగింది.
జేమ్స్ గోస్లింగ్ గారంటే నాకు ప్రత్యేకమయిన అభిమానం వుంది.
Post a Comment