Wednesday, February 14, 2007

నా గిజ్మో కోరికల చిట్టా 2005 - నేనెక్కడున్నాను

2005 వ సంవత్సరంలో నేను తప్పని సరిగా కొనుక్కోవలసిన గాడ్జెట్ లన్నీ ఒక చిట్టా తయారు చేసుకొని బ్లాగులో ఇక్కడ రాసుకున్నాను.

ఇప్పుడవన్నీ చూసుకుంటే నవ్వు + ఏడుపు వస్తున్నాయి :-)

ఒక సారి సరి చూసుకుంటే ..పరిస్థితి ఇలా ఉంది.

  1. 20 GB ఐపాడ్ : ఇప్పుడు 20 GB పోయి 30, 80 GB లు వచ్చేసాయి. ఈ మధ్యలో నాకు మైక్రోసాఫ్టు జూన్ వచ్చి పోవడం (అమ్మేసా ;-)) 80GB ఐపాడ్ కొనుక్కోవటం జరిగాయి ….ఇక్కడ హాపీ…
  2. ఒక శక్తివంతమైన టెలిస్కోప్ : భూమి మీద ఉన్న ప్రదేశాలు చూడాలంటే లక్షలు పెట్టాలి. ఒక పది వేలు పడేస్తే మంచి న్యూటోవియన్ టెలిస్కోప్ కొనుక్కుని అంతరిక్షంలోనికే చూడొచ్చు కదా…ఈ కోరిక ఇంకా తీరలేదు…:-(
  3. క్రెడిట్ కార్డు సైజు 10 GB సోనీ హార్డు డిస్కు : కొనలేకపోయాను. కానీ చిన్న పెళ్ళి కార్డు సైజులో ఉండే western digital 120 GB హార్డు డిస్కు కొనుక్కున్నాను….కాబట్టి ఇక్కడ ఫరవాలేదు :-)
  4. సోనీ హోమ్ థియేటర్ సిస్టం + సోనీ వెగా 29" TV : వెగా టీ.వి కొనగలిగా కానీ, సొంత ఇల్లు లేక పోవటం వలన హోమ్ థియేటర్ సిస్టం కొనలేక పోయాను. హోమే లేక పోతే ఇంక దానికొక థియేటర్ ఇంకెక్కడ? :-(
  5. కొత్తగా చిట్టాలో చేరినది : Canon Rebel Xti 400D : ఇంకా కొనే సీను రాలేదు. :-)

3 comments:

రానారె said...

కేనన్ కొనే సీను లేకపోతే వెంటనే మీ జాబితానుండి తొలగించాల్సిందే. ఈ మధ్య చాలా వేగంగా కొత్తకొత్త మోడల్స్ విడుదలచేస్తున్నారు కేనన్ వాళ్లు. మరో రెండునెలల్లో మరింత ఆధునిక కెమెరా వచ్చి Xti 400D ని పాతబడినదిగా మారుస్తుందేమో.

cbrao said...

సోనీ వెగా 29" టివి చాల పాతబడి పోయింది. సోని బ్రయో L.C.D. T.V. ఇప్పటి T.V. CANON 400D కొనడానికి సంకోచం ఎందుకు? మంచి కెమారా. చిన్న పరిమాణంలో అద్దె ఇంట్లో కూడా వుంచు కునే వీలున్న speakers తో home theatre లభ్యం అవుతుంది. Sonodyne home theatre, Bose speakers మంచి ఉదాహరణలు. డబ్బు లేదని మీ చింతా? అన్ని వస్తువులు, వడ్డీ లేని ఉచిత వాయిదా పద్ధతిలో లభ్యం అవుతున్నాయి.Telescope తో అంతరిక్షాన్ని చూడవచ్చు;ప్రపంచాన్ని కాదు. Thomas Cook travels సాయం తో తక్కువ ఖర్చులో మీకు నచ్చిన దేశాలను చుట్టి రండి.

Sudhakar said...

అవునండీ. నేను కూడా సోనీ బ్రయోని చూసి చాలా సరదా పడ్డాను. కానీ ఇప్పుడు మనకున్న ప్రసార నాణ్యతకు రెండు లక్షలు పెట్టడం ఒక దండగ. మన దేశంలో HDTV విప్లవం వస్తే అప్పుడు చూడొచ్చు బ్రయొ బ్రదర్ వైపు. వడ్డీ లేని ఉచిత వాయిదాల వలలో నేను చిక్కుకో దలచుకోలేదు.:-) ఇక దేశాటనలంటారా? పంపే కంపనీలుండగా మనకెందుకు ఈ కుక్కు ట్రావెల్సు?

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name