రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తనకూ బాధ్యతలు వున్నాయని చాటి చెప్పింది. గణేశుడి నిమజ్జనంపై మూడు రోజులలో తేల్చాలని ప్రభుత్వానికి ఆఙ్ఞ ఇవ్వటం నాకు ఎంతో సంతోషంగా వుంది. మరో వైపు నిమజ్జన కమిటీ ప్రవర్తన మరీ బజారు ప్రవర్తన లా వుంది. ఒరేయ్ నీకు లెక్కలలో 3 మార్కులు వచ్చెయేంట్రా అని తండ్రి అడిగితే..పక్కింటి గోపి గాడికి 0 వచ్చాయి...వాడినెవరైనా అడిగారా అని తిరిగి కోపంగా చూసే పనికిరాని లాజిక్కులతో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
ఒక పక్క టన్నుల కొద్ది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో హుస్సేన్ సాగరం అడుగున ఒక గట్టి మందమైన పొర ఏర్పడిపోతుందిరా బాబు అని కాలుష్య నివారణ సంస్థలు ఏడుస్తుంటే, దాన్ని కనీసం ఒక సమస్యగా కూడా పట్టించుకోక పోవటం, వారి కళ్ళకు పట్టిన ధన మదం అని చెప్పకనే చెపుతుంది. అసలు మన దేశంలో పి.సి.బి కి అత్యున్నతమైన అధికారాలు ఎప్పుడు వస్తాయో కదా :-(.......
1 comments:
కథ కొత్త మలుపు తిరిగిoది. తాజా గా న్యాయస్థానo జారి చేసిన ఉత్తర్వు లో ఈ యేడాది ఒక్కటే బొజ్జ వినాయకుడి ని హుస్సేన్ సాగర్o లో నిమజ్జనo అనుమతి0చిది.
"దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి" అని చిన్నప్పుడు దుబ్బులు కొట్టేవాళ్ళo. ఈ సారి, కొత్తగా "చిట్టీ, పొట్టీ గణపయ్య, వచ్చే యేడాది మళ్ళీ నీకు హుస్సేన్ సాగర్ తప్పదయ్య " అని చేర్చాలి !!!
Post a Comment