నాకు ఒక మిత్రుడు పంపిన వివరాలలో ఒక ఆసక్తిసరమైన విషయం తెలిసింది. అది మన 'హిందూ పదం యొక్క పుట్టుక. హిందూ నాగరికత ప్రధానంగా సింధూ నాగరికత అనే విషయం తెలిసిందే కదా. మరి ఈ హిందూ అనే పదం ఎక్కడి నుంచి పుట్టిందబ్బా? మనకు ఏ పురాణలలో కూడ ఈ శబ్దం ఎక్కడా వున్నట్లు లేదు కదా? (నాకు తెలియదు, వుంటే క్షమించాలి :-))
పారశీకులు ఈ శబ్దానికి మూల కారకులు అంట. వీరు ఋగ్వేద ఆర్యులు నుంచి విడిపోయిన ఒక జాతి. వీరికి "స" అక్షరం సరిగా పలకడం రాదు. వీరు భారత ద్వీపకల్పంలో అడుగు పెట్టిన మొదట్లో ఎదురైన నది "సింధూ నది". దాన్ని వారు "హిందూ నది" గా పిలవటం మొదలుపెట్టారు. నాగరికత అంతా సింధూ లోయ వెంబడే వుండటం చూసి, వారు మన దేశాన్ని "హిందూ దేశం" గా పిలిచారు. అదే తరువాత "ఇండస్ సివిలైజేషన్" అయింది. మన దేశం ఇండియా అయింది.
అందువల్లనే, హిందూ మతం అనేది ఒక అద్భుతమైన ఆర్య సంస్కృతి,సింధూ నాగరికతల మిశ్రమ ఫలితంగ ఏర్పడిన ఒక "మతం". ప్రత్యేకంగా హిందూ మతం అనేది ఎక్కడా పుట్టలేదు. వేదాలలో ప్రస్తావించబడలేదు. ఎందుకంటే వేదాలు కుల ప్రాతిపదికగ సమాజంలో పుట్టినవి. మతానికి అప్పట్లో అర్ధం లేనే లేదు.
3 comments:
మనము హిందువులం అని చెప్పుకోవాల్సిన అవసరం ముందెన్నడు కలగలేదు. ఎందుకంటే హిందు మతమే మతాల పుట్ట. ఎవ్వడి ఆలోచన వాడి మతం. ఇప్పటి ప్రపంచ మానవుల్ని అందరినీ పిలవడానికి ఒక ప్రత్యేక మతం పేరు ఎలా లేదో అలానే అప్పటి బారత దేశపు ప్రజల్ని పిలవడానికి ఒక పేరంటూ లేదు. పరాయి దేశాల వారు అలా మనల్ని సిందూ దేశపు వారిగా పిలిచే క్రమం లోనే "హిందు" పదం పుట్టింది. ఇప్పటికీ మా ప్రాంతంలో కొండకు ఆవలి వారిని "కనుమౌతల వాళ్ళు" అంటారు. అయితే ఆ "కనుమౌతల" వాళ్ళకి మేము "కనుమౌతల వాళ్ళ"మవుతాం. అంతేగానీ ఎవరికి వాళ్ళం "కనుమౌతల వాళ్ళ" మని పిలుచుకోం గదా! కావలిస్తే గుండుకింద రామయ్య, చింతచెట్టు సుబ్బన్న అని పిలుచుకుంటాం గానీ. అలానే వీళ్ళు "ఆంద్రా" వాళ్ళు, "ఒరియా" వాళ్ళు, గందర్వులు, యక్షులూ ఇలా సవా లక్ష పేర్లున్నాయి గానీ మనందరికీ, మనం గాని ఇంకొకడు వస్తే గానీ మనకు ఉమ్మడిగా ఒక పేరంటూ రాలేదు.
-- ప్రసాద్
http://charasala.wordpress.com
ఔనండోయ్ ప్రసాద్ గారూ! మాకు మీరు, మీకు మేము "కనుమౌతల" వాళ్ళమే! :D
అమెరికా లో వున్న వాళ్ళకు మనం భూమౌతల వాళ్ళం :-)
Post a Comment