ఆప్తులకు, మిత్రులకు మరియు ఈ బ్లాగు పాఠకులకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు.
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడొక మహాకవి. మరి ఆ లెక్కన మన దేశ ప్రజల మనస్సులకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా? లేకా 'ఇండియా' అనే భూమికి మాత్రం చెర వీడిందా?
మన మనస్సులలోంచి బానిసత్వపు జాడలు పోయాయా? పోతే ఇంకా మనలో దొరలు, సార్లు, అయ్యగారు, అమ్మగారు, బాబుగార్లు ఇంకా ఎందుకున్నట్టబ్బా? మనకి ఇంకా పోలీసులంటే భూతాలే అనిపిస్తుందే !!! మన ప్రాధమిక హక్కులు ఎంటో కూడా చాలమందికి తెలియవే? అమెరికా లాంటి దేశం లో సైతం పోలీస్ తో నా హక్కులేంటో నాకు తెలుసు అని చెప్పే వీలుంది కాని, మన దేశం లో అలా చెప్తే పిచ్చోడిలా చూస్తారు.
చెప్పండి, ఇది స్వాతంత్రమా? సర్వతోముఖాభివృధ్ధా? ఎదో నూతన్ ప్రసాద్ కామెడీ డైలాగ్ లా వుందేమో గాని, నిజంగా దేశం చాల క్లిష్ట పరిస్థితులలో వుంది. గడచిన 60 ఏళ్ళలో లేనంతగా....
0 comments:
Post a Comment