నేను ఈ నెల తెలుగు బ్లాగర్ల సమావేశానికి వెళ్ళలేకపోయినా (మనం ఆదివారం లేచేదే పదిన్నరకి..ఇంకెక్కడకి వెళ్తాం. అయితే నేను కిరణ్ చావా కంటే నయమే లేండి..అతను పదకొండుకు లేచాడు :-)) నాకు బాగ నచ్చిన ఒక అంశం "తెలుగు చేతి రాతని బ్లాగ్ చెయ్యటం". వీవెన్ గారి ఈ పోస్ట్ చూసి, నేను కూడా ఆవేశంగా కలం కలపాలని నిర్ణయించుకున్నా అది పై విధంగా విషాదాన్ని చిందించిందండి :-(
6 comments:
మీరు ఒదిగి మాట్లాడుతున్నారు గానీ, మీ రాత ముచ్చటగా ఉంది. ఇంగ్లీషు దాడిలో.. బాగుంది.
చేతి వ్రాత చాక్కగా ఉంది. ఈ ఐడియా ఏదో ఆసక్తికరంగా అనిపిస్తుంది...
మీ చేతిరాతకే బాగుంది. మీ చేతిరాత బాలేదన్నారంటే మిమ్మలని మీరు తక్కువచేసుకుని మాట్లాడుతున్నట్టే.
మీ చేతిరాత బాలేదన్నారంటే నేన మనుకోవాలి :-((- చేతి వ్రాత చాక్కగా ఉంది.
నా రాత చూస్తే మా ఇంట్లో వాళ్ళు చాలా బాధ పడతారు :-) మీ అభిప్రాయం బట్టి నేను ఇంకా కొండ అంచులోనే నిలబడి వున్ననని అర్ధం అవుతుంది. అఖాతంలో పడిపోకుండా చూసుకోవాలి :-)
మీ రాత చాలా బాగుంది.
కీ బోర్డ్‌లు బ్లాక్‌బెర్రీలు చేతి రాతను మరుగు పరుస్తున్నాయి. ఇమెయిళ్ళయితే జాబులు రాసే పని లేకుండా సర్వదా కృషి చేస్తున్నాయి. అంతో ఇంతో జాబులు రాయటానికైనా చేతి వ్రాత పనికొస్తుంది అనుకుంటే ఇమెయిళ్ళు, టెలిపోనులు, చాటింగులూ, వెబ్‌కెమరాలు ఆ అవసరాన్ని మరిపించాయి.
ఉత్తరం వ్రాయటం, మన పేరుతో వుత్తరం వచ్చిందంటే వుండే సంతోషం ఇప్పుడు ఇమెయిల్‌తో రావటం లేదు. బహుశా ఇమెయిల్ సందేశం క్లుప్తంగా వుండటమేమొ.
-- ప్రసాద్
http://charasala.wordpress.com
Post a Comment