Friday, August 25, 2006

ద్రోహి...ద్రోహి...ద్రోహి...ఎవడురా ఈ ద్రోహి (రఘువరన్ ఫక్కీ లో)

తె.రా.స : కాంగ్రెస్ తెలంగాణా ద్రోహి
తె.దే.పా : తె.రా.స తెలంగాణని మోసం చేస్తోంది
కాంగ్రెస్ : తెలుగుదేశం తెలంగాణ ద్రోహి
భాజపా : కాంగ్రెస్,తెదేపాలు తెలంగాణా ద్రోహులు
వామపక్షాలు : రాష్ట్ర విభజన అంత వీజీ కాదు

విజయశాంతి : నేను పుట్టిందే తెలంగాణా కోసం, నాకు బుర్రలేదన్నవాళ్ళకి అస్సలు బుర్రలు లేవు
నరేంద్ర : రక్తవర్షం చిందిస్తాం, తడాఖా చూపిస్తాం (గత రెండు సం.లు గా ఇదే కలవరింత డాక్టరు గారు :-()
కే.సి.ఆర్ : ప్రజలు తిరగబడి దొమ్మీలు, దాడులు చేస్తే మా పూచి కాదు (ఇదొక హింటా?)

ఎమ్మెస్ : తెలంగాణ మరో పదేళ్ళకు కానీ రాదు
వై.యస్ : తెలంగాణాకి కావల్సింది విభజన కాదు..అభివృధ్ధి

తెలంగాణా ప్రజలు : అయో????? @$%%^%%్%$%$$%$ ???మయం

తెలుగు భాష : హమ్మయ్య ఇన్నాళ్ళకు ఒక అచ్చ తెలుగు పదం "ద్రోహి" పదే పదే అందరూ వాడుతుంటే బలే వుంది...శభాష్ బిడ్డలు, తాంబూలాలిచ్చేసారుగా ఇక తన్నుకు చావండి.

9 comments:

రవి వైజాసత్య said...

ఆంధ్ర రాజకీయాలు కడుపుబ్బా నవ్వించడములో తెలుగు సినిమాలను మించిపోయాయి.

Ramanadha Reddy said...

గత రెండు సం.లు గా ఇదే కలవరింత డాక్టరు గారు :-(
Super sir!! మల్లిక్ cartoons గుర్తొచ్చాయ్.

Srikanth Babu శ్రీకాంత్‌ బాబు said...

తెలంగాణా ప్రజలు : అయో????? @$%%^%%్%$%$$%$ ???మయం
అని రాసవు కద, మరి ఇదిఏందుకు మరిచావు

ఆంద్ర ప్రజలు : మేము అసలైన ద్రొహులం

సుధాకర్(శోధన) said...

శ్రీకాంత్ గారు, ఒక్క మాట చెప్పనా, నాకు ఈ రాజకీయ నాయకుల మీద వున్న కసి ప్రజల మీద లేదు. నిజం చెప్పండి, సామాన్య ప్రజలు (తొంబై శాతం వీరే వుంటారు మన రాష్టృంలో) ఒకరినొకరు ద్రోహం చేసుకుని, కుట్రలు పన్నే స్థితిలో వున్నారంటారా? నేను ప్రస్తుతం తెలంగాణా ప్రజల గురించి అయోమయం అని రాసా గాని (ప్రస్తుత రాజకీయ పరిస్థితుల బట్టి), మీరు ఒక్క సారి మా శ్రీకాకుళం గానీ విజయనగరం గానీ వస్తే పరిస్థితులు ఎంత దయనీయంగా వున్నాయో అర్ధం అవుతుంది. ప్రజలకు ఒక రాజకీయ చైతన్యం లేదు, మంచి నాయకులూ లేరు, మౌలిక సదుపాయాలు లేవు, సరైన రైలు సదుపాయం కూడా లేదు. నక్సలిజం పుట్టిన గడ్డ అయినా కూడా పరిస్థితులలో ఏ మార్పూ లేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్ననంటే, రాష్టృంలో అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధిలో లేనే లేరు. అది ఒక్క తెలంగాణా నే కాదు. ఒక్క మాట లో చెప్పలంటే రాజకీయ నాయకులకు ఎవ్వరూ అత్తీతం కాదు, ఏదీ కబ్జాకు అనర్హం కాదు. ఒకప్పుడు ఇంగ్లీషోడు దోచుకెళ్ళాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంతే...అదే సూత్రం.....విడదీసి ఏలుకో నీ రాజ్యాన్ని.


మీరు పైన చెప్పిన వాటిలో ఒక్క పార్టీని ద్రోహి అనా సంతోషించేవాడినండి. కాని వీళ్ళందరిని వదిలేసి ప్రజల మీద పడ్డారే :-)

cbrao said...

ఆంద్ర ప్రజలు : మేము అసలైన ద్రొహులం అని శ్రీకాంత్ వ్యంగంగా స్పందిచినట్లనిపిస్తోంది. వీళ్లను ఎన్నుకొన్న ఆంధ్రప్రజలు వెర్రివాళ్లు అనటం సరైంది.

చదువరి said...

కోస్తావారైనా, తెలంగాణావారైనా, రాయలసీమవారైనా సామాన్య ప్రజలెప్పుడూ అమాయకులే, తెలివిలేనివారే, అయోమయంలో ఉండేవారే! ఆలోచనల్లో రాజకీయులెప్పుడూ మనకంటే ముందే ఉంటారు. అందుకే మనమెప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాం, వాళ్ళు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. మనమెప్పుడూ మోసపోతూ ఉంటాం, వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. రేపు మన తెలివితక్కువతనంపైనే సవారీ చేస్తూ మనకీ మనకీ గొడవలు పెడతారు చూస్తూండండి.

Srikanth Babu శ్రీకాంత్‌ బాబు said...

I partially agree with you but Separate Telangan is inevitable, It does not matter for Telangana what settlers or andhra people thing about it.

సుధాకర్(శోధన) said...

శ్రీకాంత్ గారు, ఒక విషయం మీరు మరచిపోతున్నారు. ఇక్కడ ఎవరూ సెట్ట్లెర్స్ అనేవారు లేరు. మీ ప్రకారం అయితే అమెరికా వాళ్ళూ మన భారతీయులను అందరిని తరిమివేయాలి. బ్రిటీషర్లు మిట్టల్ ని, విక్రం చత్వా ని తరిమివేయాలి. ఈ బహుళ జాతి సంస్థలు ఏమైనా మన రాష్ట్రానివా? లేకా మీరనుకునే తెలంగాణ అనే సంకుచిత వాదానికి చెందినవా? వాటిని కూడా తరిమేద్దాం, మళ్ళీ ఒక నిజాముకు పట్టం కట్టి తెలంగాణ 'ఆత్మ గౌరవం" అనే భ్రమని సాధించండి.

ఇది కూడా ఒక సారి చదవండి
http://nagaraja.info/telugu_nEla/?p=7

S.V.V.Y.K Dhandadarudu said...

Oka naadu Mahatma gandhi okkaday uppu satyagraham modalupetti entho kashtapadi endaro pranalu arpinchi manaku swatantrayam teesuku vacharu. kaani nedu jarugutunnadi Quit India Gandhiiji ninadam ayitay Soniya, Y.S.la ninadam comeon india. Sonia ee desasturalu kaadu mana desamlo rajakiyam loki enduku raavali ani chala mandi peddalu prasninchaga gandhi vaarasuralu amay annaru congress peddalu. Edi emi ayyina congress antha dochukuntundi abhivruddhi antundhi. entho kashtapadi sampadinchi kuduva petti oka sight konukkuntay daanini abivruddhi peruto peddalu kaajesi sommu chesukunnaru. Manaki vaddu ee Rajakiyalu endukantay evariki vaarau dongalu. british vallu pani cheyinchay vaaru baddakastudini sikshinchay vaaru andulo naaku telisi tappu ledhu. Nedu Anni partilu kalasi andhrapradesh okkatiga untay daanini mottam paripalinchi dochukuni daachukuntunnadi okkaday kabatti telangana andhraga vidagodhitay inka ekkuva mandi dochukovachu kada adi andi prastuta rajakiyalu. chinna pillalu school lo Mastarani veedu sanchilo edo techukuni tintunnadu andi ani annattu. ee rajakiyanayakulu prajalara evandi maraymo aa party vaadu intha dobbesadu andi ani antay vaadu kaadandi vaaday nandi ekkuva dobbaysadu antunnaru. andukay manaku rajakiyalu vibajinchi paalinchadalu vaddu saddam la okadday okkadu yavath bharath antha paalinchay vaadu etuvanti swardam lekunda prajalanu choosay vaadu kavali. aa devu varamistay nenu ninnay korukuntalay ani oka premikudu paadadu kaani manamu aa devudu varamistay gandhi malli kavali ani paadukundamu. naa peru nijam ga dandhadurudu kaadu dandhadarudu anaga yamadharmaraju atanay kadandi andarni sikshinchaydi naaku alagay anipistundhi prastuta rajakiyalu choostuntay.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name